పుష్టిని పెంచే సూక్ష్మజీవులు... | Malnutrition Special Story | Sakshi
Sakshi News home page

పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...

Jul 18 2019 12:47 PM | Updated on Jul 18 2019 12:47 PM

Malnutrition Special Story - Sakshi

పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారం కంటే.. శరీరంలోని బ్యాక్టీరియా వైవిధ్యతను పెంచే ఆహారం ఇవ్వడం మేలని అంటున్నారు వాషింగ్టన్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక అధ్యయనం ఇదే విషయాన్ని చెబుతోంది మరి! పౌష్టికాహారంతో బాధపడుతున్న పిల్లల్లో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా తక్కువగా ఉన్నట్లు తాము గుర్తించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త జెఫ్రీ గార్డన్‌ తెలిపారు.

ఈ సమస్యను అధిగమించేందుకు తాము ప్రత్యేక ఆహారాన్ని సిద్ధం చేశామని.. ఇది శరీరంలోని మంచి బ్యాక్టీరియా సంతతి, వైవిధ్యతను పెంచేదిగా ఉందని తెలిపారు. పుష్టిలేని పిల్లల్లోని బ్యాక్టీరియా అపరిపక్వంగా ఎదిగి ఉంటుందని.. ఈ ప్రభావం కాస్తా రోగనిరోధక వ్యవస్థతోపాటు జీర్ణక్రియను బలహీన పరుస్తోందని జెఫ్రీ తెలిపారు. జంతువుల్లో బ్యాక్టీరియా సంతతిని పెంచే ఆహారాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా తాము పిల్లలకోసం మూడు రకాల ఆహారాలు సిద్ధం చేశామని.. 12 – 18 నెలల కాలం ఈ ఆహారం తీసుకున్న 63 మంది పిల్లల పౌష్టికత గణనీయంగా పెరిగినట్లు గుర్తించామని వివరించారు. ఈ ప్రత్యేక ఆహారం తీసుకోవడం మొదలుపెట్టిన నెలరోజుల్లోనే పిల్లల జీర్ణక్రియల్లో వృద్ధి కనిపించిందని చెప్పారు. శనగ, సోయా, ఆరటిపండు, వేరుశనగలతో కూడిన ఈ ఆహారం బియ్యం, పప్పు దినుసుల కంటే మెరుగైన ఫలితాలు చూపినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement