bactiria
-
'కోళ్ల ఫారాల కాలుష్యానికి' ఇకపై చెక్! ఎలాగో తెలుసా?
కోళ్ల ఫారంలో కోళ్ల విసర్జితాల వల్ల కోళ్ల రైతులు, కార్మికులకే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు ఈగలు, దుర్వాసన పెద్ద సమస్యగా ఉంటుంది. కోళ్ల విసర్జితాలను ఆశించే ఈగలు మనుషులకు, కోళ్లకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కోళ్ల విసర్జితాల నుంచి విడుదలయ్యే అమ్మోనియా వాయువు వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు, రైతులకు కళ్లు మండటం, తలనొప్పి వంటి సమస్యలు రావటంతో పాటు కోళ్లకు సైతం తలనొప్పి, కంటి చూపు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. లేయర్, బ్రీడర్ కోళ్ల ఫారాల కింద పోగుపడే కోళ్ల విసర్జితాల దుర్వాసన, ఈగల నివారణకు రసాయనాలు చల్లినప్పటికీ ఇది తీరని సమస్యగానే మిగిలిపోతోంది. జనావాసాలకు దగ్గరగా ఉండే కోళ్ల ఫారాల దుర్గంధాన్ని, ఈగలను భరించలేని ప్రజలు వాటిని మూయించే పరిస్థితులు కూడా నెలకొంటూ ఉంటాయి. అయితే, ఈ సమస్యలను పర్యావరణహితంగా పరిష్కరించే ఓ మార్గాన్ని సూచిస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు యడ్లపాటి రమేష్. బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) అనే హానికరం కాని ఈగకు చెందిన పిల్ల పురుగులను కోళ్ల ఫారంలోని విసర్జితాలపై వదిలితే కోళ్ల ఫారాల నుంచి దుర్వాసన సమస్య, విసర్జితాల యాజమాన్య సమస్యలు తీరిపోతాయని రమేష్ తెలిపారు. కోళ్ల వ్యర్థాలను – వర్మి కంపోస్ట్ ప్రక్రియ లాగా మారుస్తూ బిఎస్ఎఫ్ లార్వా (పిల్ల పురుగులు) పెరుగుతాయి. నెలకొకసారి వీటిని కోళ్ల ఫారంలో విసర్జితాలపై వేసుకుంటే చాలు. కోళ్ల ఫారాల నుంచి వ్యర్థాల దుర్వాసన నుంచి 95% పైగా విముక్తి కలిగించడానికి సహజ ప్రక్రియ అయిన బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా ఒక మంచి పరిష్కారమని ఆయన చెబుతున్నారు. గత ఐదారేళ్లుగా బిఎస్ఎఫ్ లార్వా ఉత్పత్తిపై పనిచేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కోళ్ల రైతులకు ఈ లార్వాను అందిస్తూ కాలుష్య నియంత్రణకు, ఆరోగ్య రక్షణకు కషి చేస్తున్నామని ఆయన అన్నారు. లార్వాను కోళ్ల విసర్జితాల (లిట్టర్)పై నెలకోసారి చల్లటం వల్ల ఉపయోగాలు: ► సాధారణ ఈగలు పూర్తిగా తగ్గిపోతాయి. కోళ్ల విసర్జితాలపై ఈగలు అరికట్టేందుకు ఉపయోగించే మందులు, అలాగే ఈగల లార్వాను నిర్మూలించడానికి, ఫీడ్‌లో ఇచ్చే మందులు అసలు అవసరం లేదు. ► దుర్వాసన తగ్గుతుంది, కోళ్ల విసర్జితాల నుంచి వెలువడే అమ్మోనియా తగ్గిపోతుంది. ► కోళ్ల ఫారంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. కళ్ళు మంటలు, సిఆర్డి సమస్య తగ్గుతుంది. ► విసర్జితాలను బిఎస్ఎఫ్ పిల్ల పురుగులు ఎరువుగా మార్చే క్రమంలో, విసర్జితాల్లో తేమ తగ్గిపోయి, దుర్వాసన కూడా తగ్గుతుంది. ► సున్నం, బ్లీచింగ్ అవసరం ఉండదు. వీటి ఖర్చు తగ్గుతుంది. ► విసర్జితాల నిర్వహణకు కూలీలు, స్పేయ్రర్లు, మందుల ఖర్చు ఆదా అవుతుంది. కోళ్ల విసర్జితాలపై ఉండే సాల్మొనెల్లా, ఈ–కొలి వంటి హానికారక సూక్ష్మక్రిములను అరికడతాయి ► ఆర్గానిక్ కంపోస్ట్‌గా మారిన కోళ్ల విసర్జితాలను రైతులు మంచి ధరకు విక్రయించుకోవచ్చు. బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను విసర్జితాలపై చల్లటం అనే సహజ సిద్ధమైన ప్రక్రియ వల్ల.. కోళ్లకు, పనివారికి, చుట్టపక్కల నివసించే ప్రజలకు ఇబ్బందులు తప్పటమే కాకుండా, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ► చనిపోయిన కోళ్లను, పగిలిపోయిన గుడ్లను త్వరగా కుళ్ళబెట్టడానికి, దుర్వాసన, బాక్టీరియా తగ్గడానికి కూడా బిఎస్ఎఫ్ లార్వా ఉపయోగపడుతుంది. ► కోళ్ల ఫారం పరిసర ప్రాంతాలు ఆరోగ్యకరంగా, కాలుష్యరహితంగా తయారై కోళ్ల ఆరోగ్యం బాగుంటుంది. ► ఉత్పాదకత 1–2 శాతం పెరుగుతుంది. బిఎస్ఎఫ్ గుడ్డు నుంచి ఈగ వరకు జీవితకాలం మొత్తం 45 రోజులు. గుడ్డు నుంచి పిల్లలను ఉత్పత్తి చేయటం అనేది తక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమ గల వాతావరణంలో జరగాల్సి ఉంటుంది. మరోన్నో ఉపయోగాలు.. ► 20 రోజుల వయసులో గోధుమ రంగులో ఉండే బిఎస్ఎఫ్ పురుగులు బతికి ఉండగానే లేయర్ కోళ్లకు, బ్రాయిలర్ కోళ్లకు, నాటు కోళ్లకు 10–20% మేరకు సాధారణ మేత తగ్గించి మేపవచ్చు. ► వంటింటి వ్యర్థాలు, ఆహార వ్యర్థాలపై ఈ బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను వేసి పెంచవచ్చు. ► 15 రోజుల తర్వాత ఆ లార్వాను పెంపుడు కుక్కలకు /పిల్లులకు /పక్షులకు మేతగా వేయొచ్చు. బతికి ఉన్న పురుగులు మేపవచ్చు. లేదా ఎండబెట్టి లేదా పొడిగా మార్చి కూడా వాడుకోవచ్చు. 'ఆక్వా చెరువుల్లో రోజుకు మూడు సార్లు మేత వేస్తూ ఉంటారు. ఒక మేతను బిఎస్ఎఫ్ లార్వాను మేపవచ్చని రమేష్ చెబుతున్నారు.' వివరాలకు: 9154160959 - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!? -
దానికదే పగుళ్లు పూడ్చుకునే కాంక్రీటు..!
భవన నిర్మాణంలో వాడే కాంక్రీటు దృఢంగా ఉంటుంది. అయితే వాతావరణంలోని తేమ లేదా ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గుల వల్ల కాంక్రీటు నిర్మాణాల్లోనూ పగుళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు దాని నిర్వహణకోసం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పగుళ్లతో కొన్నిసార్లు కాంక్రీటు మూలకాలు క్షీణించే ప్రమాదం ఉంది. ఈ సమస్యలను నివారించటానికి డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు వినూత్నమైన కాంక్రీటును రూపొందించారు. ఇది తనకు తానే మరమ్మతు చేసుకుంటుంది. ఇందులోని బయోఫైబర్లు బ్యాక్టీరియా సాయంతో పగుళ్లను పూరిస్తాయి. కాంక్రీటు నిరంతరం వాతావరణ ప్రభావానికి గురవుతున్నప్పుడు పగుళ్లు ఏర్పడుతుంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత మరీ పెరిగితే పగుళ్లు మరింత పెద్దగా అవుతాయి. పైగా తేమ సైతం వివిధ ప్రక్రియలతో కాంక్రీటు క్షీణించేలా చేస్తుంది. కాబట్టి కాంక్రీటు నిర్మాణాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. తరచూ మరమ్మతులు అవసరమవుతాయి. దీనికి ఖర్చు అవుతుంది. అసౌకర్యమూ కలిగిస్తుంది. అందుకే కాంక్రీటు క్షీణించే వేగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అందుకు అనుగునంగా డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు బయోఫైబర్లు రూపొందించారు. ఈ పాలిమర్ ఫైబర్లు కేవలం కాంక్రీటుకు దన్నుగా నిలవటమే కాకుండా పగుళ్లు వాటికవే పూడిపోయేలా చేసి మన్నికగా ఉండే కాలాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ ఫైబర్లకు సన్నటి రంధ్రాలు కలిగిన హైడ్రోజెల్ పూత పూస్తారు. ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఇదీ చదవండి: చాట్ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో..! ఇది నిద్రాణంగా ఉంటూ తీవ్ర వాతావరణ పరిస్థితులనూ తట్టుకొని జీవిస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా పగుళ్లు ఏర్పడితే వాటిలోంచి నీరు వెళ్లి బయోఫైబర్లును తాకుతుంది. అప్పుడు హైడ్రోజెల్ విస్తరిస్తుంది. ఈ క్రమంలో బ్యాక్టీరియా నిద్రలేస్తుంది. కాంక్రీటు చుట్టూ ఉండే కార్బన్, క్యాల్షియంను తినటం ఆరంభిస్తుంది. అప్పుడు వీటి నుంచి క్యాల్షియం కార్బొనేట్ ఉత్పత్తి అవుతుంది. ఇది పగుళ్లను పూడుస్తుంది. నిర్మాణ పదార్థాలను మెరుగు పరచటానికి జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో బయోఫైబర్లతో కూడిన కాంక్రీటు ఆసక్తి కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. -
తాగకపోయినా... తాగినట్టే మత్తుగా ఉంటుందా? ఆ జబ్బేంటో తెలుసా?
ఒకవేళ ఎవరికైనా ఈ జబ్బు ఉందంటే... పొరబాటున వారు వాహనం నడిపేటప్పుడు పోలీస్ చెకింగ్ గానీ జరిగిందంటే... అది వారి పాలిట సమస్యే అవుతుంది. నిజానికి వారు మద్యం తాగకపోయినప్పటికీ... బ్రెత్ అనలైజర్‌తో పరీక్ష చేశారంటే మద్యం తాగితే వచ్చే ఫలితమే కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘‘డ్రంకెన్నెస్ డిసీజ్’’ అంటారు. ఎందుకు జరుగుతుందంటే...? ఈ జబ్బు ఉన్నవారిలో వాళ్లు తిన్న కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు) ఎప్పటికప్పుడు ఆల్కహాల్‌గా మారిపోతుంటాయి. అందుకే ఈ వైద్య సమస్యను ‘బీర్ గట్’ (బీరుతో నిండిన కడుపు / కడుపు నిండా బీరు) లేదా గట్ ఫర్మెంటేషన్ సిండ్రోమ్ / ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ పరిస్థితి కారణంగా తాగక పోయినా మత్తు వచ్చేస్తుంది. అవాంఛితమైన ఆ మత్తు కారణంగా ప్రమాదాలూ జరగవచ్చు. బాధితులలో భౌతికంగా కూడా చాలా సమస్యలూ వస్తుంటాయి. ఉదాహరణకు మద్యం తాగినప్పుడు చాలామందిలో కనిపించే లక్షణమైన నోరంతా ఎండిపోవడంతో పాటు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, దీర్ఘకాలికంగా నిస్సత్తువ ఉండటం వంటివెన్నో కనిపిస్తాయి. దాని వల్ల డిప్రెషన్లోకి కూడా జారిపోవచ్చు. వాళ్ల జీర్ణకోశంలో ఉండే ‘శాకరోమైసిస్ సెరివిసీ’ అనేఒక రకమైన సూక్ష్మజీవి వల్ల ఇలా జరుగుతుంది. చికిత్స ఏమిటి? పిండిపదార్థాలను పూర్తిగా నివారించడం, అలాగే బాధితులకు ఎప్పుడూ హై ప్రోటీన్ ఆహారాన్ని ఇవ్వడంలాంటి ‘డైట్ థెరపీ’తో డాక్టర్లు ఈ సమస్యకు చికిత్స అందిస్తారు. కొందరికి యాంటీ ఫంగల్ / యాంటీ బ్యాక్టీరియల్ మందుల చికిత్స అవసరమవుతుంది. శాకరోమైసిస్ సెరివిసీ అనేది ఈస్ట్ లాంటి మైక్రోబ్ వల్ల ఈ జబ్బు వస్తుంది కాబట్టి డాక్టర్లు యాంటీఫంగల్ మందులతో, సూక్ష్మజీవులను అరికట్టే యాంటీ బయాటిక్స్తోనూ ఈ సమస్యను అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. -
మానవులకు మంచి చేసే బ్యాక్టీరియా
-
పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...
పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారం కంటే.. శరీరంలోని బ్యాక్టీరియా వైవిధ్యతను పెంచే ఆహారం ఇవ్వడం మేలని అంటున్నారు వాషింగ్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక అధ్యయనం ఇదే విషయాన్ని చెబుతోంది మరి! పౌష్టికాహారంతో బాధపడుతున్న పిల్లల్లో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా తక్కువగా ఉన్నట్లు తాము గుర్తించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త జెఫ్రీ గార్డన్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు తాము ప్రత్యేక ఆహారాన్ని సిద్ధం చేశామని.. ఇది శరీరంలోని మంచి బ్యాక్టీరియా సంతతి, వైవిధ్యతను పెంచేదిగా ఉందని తెలిపారు. పుష్టిలేని పిల్లల్లోని బ్యాక్టీరియా అపరిపక్వంగా ఎదిగి ఉంటుందని.. ఈ ప్రభావం కాస్తా రోగనిరోధక వ్యవస్థతోపాటు జీర్ణక్రియను బలహీన పరుస్తోందని జెఫ్రీ తెలిపారు. జంతువుల్లో బ్యాక్టీరియా సంతతిని పెంచే ఆహారాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా తాము పిల్లలకోసం మూడు రకాల ఆహారాలు సిద్ధం చేశామని.. 12 – 18 నెలల కాలం ఈ ఆహారం తీసుకున్న 63 మంది పిల్లల పౌష్టికత గణనీయంగా పెరిగినట్లు గుర్తించామని వివరించారు. ఈ ప్రత్యేక ఆహారం తీసుకోవడం మొదలుపెట్టిన నెలరోజుల్లోనే పిల్లల జీర్ణక్రియల్లో వృద్ధి కనిపించిందని చెప్పారు. శనగ, సోయా, ఆరటిపండు, వేరుశనగలతో కూడిన ఈ ఆహారం బియ్యం, పప్పు దినుసుల కంటే మెరుగైన ఫలితాలు చూపినట్లు చెప్పారు. -
మొండి రోగాల ముప్పు!
వచ్చిన జబ్బేమిటో, దాని తీవ్రత ఎంతో తెలియకపోయినా ఇష్టానుసారం మందులు మింగే అల వాటు మానవాళి మనుగడకే ప్రమాదంగా పరిణమించిందని, మొండిరోగాలు పుట్టుకొస్తున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ ఏజెన్సీ కో ఆర్డినేషన్ బృందం (ఐఏసీజీ) సోమవారం చేసిన హెచ్చరిక అందరికీ కనువిప్పు కలిగించాలి. బ్యాక్టీరియా వల్లనో, వైరస్‌వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో ఏదైనా వ్యాధి సోకినప్పుడు శరీరతత్వాన్నిబట్టి స్పందన ఉంటుంది. ఏ కారణంగా నలత ఉందో, దాన్ని అరికట్టడానికి ఏ మందు ఏ మోతాదులో, ఎలా వాడాలో వైద్య నిపుణులు చెప్పాలి. కానీ ఎవరినీ సంప్రదించకుండా, మందుల దుకాణంలో లక్షణాలు చెప్పి గోలీలు కొనుక్కుని వాడే ధోరణి మన దేశంలోనే కాదు... ప్రపంచమంతటా పెరిగిపోయింది. దానికి తోడు ఆసుపత్రులు కాసుపత్రులుగా మారాక అవసరమున్నా లేకున్నా వైద్యులే మందులు అంటగడుతున్నారు. ఇలాంటి ధోరణుల వల్ల మొండి రోగాలు విస్తరించి 2030నాటికి అల్పాదాయ దేశాల్లో దాదాపు రెండున్నర కోట్లమంది తీవ్రమైన పేదరికం బారిన పడతారని, దానివల్ల ఆర్థిక వ్యవస్థలు ధ్వంస మవుతాయని ఐఏసీజీ హెచ్చరిస్తోంది. మన దేశంతోసహా 71 దేశాల్లో గణాంకాలు సేకరించి విశ్లేషిం చాక ఇందులో మూడోవంతు దేశాల్లో వ్యాధికారక క్రిములు మందులకు లొంగని రీతిలో తయా రయ్యాయని తేలిందని అంటోంది. వైద్య సదుపాయాలు అంతంతమాత్రంగా ఉన్న మన దేశంలో అసలు ఔషధాల వాడకం ఎలా ఉందో, అందులోని గుణదోషాలేమిటో ఆరా తీసే వ్యవస్థ సక్రమంగా ఉండాలని కోరుకోవడం అత్యాశే. కొన్నేళ్లక్రితం ఏ మందులకూ లొంగని అత్యంత శక్తిమంతమైన కొత్త బ్యాక్టీరియా పుట్టు కొచ్చిందని కనుక్కున్నప్పుడు దానికి ‘న్యూఢిల్లీ సూపర్‌బగ్’ అని పేరుపెట్టారు. పేరు గురించిన వివాదం సంగతి పక్కనబెడితే ‘ఇ–కొలి’ అనే అసాధారణ బ్యాక్టీరియాలో కొత్త జన్యువు బయల్దేరి దాన్ని మొండి ఘటంగా మార్చిందని ఆ పరిశోధన ద్వారా కనుక్కున్నారు. అశాస్త్రీయంగా, విచ్చలవి డిగా మందులు మింగడం వల్లే ఈ ‘సూపర్‌బగ్’ పుట్టుకొచ్చిందని నిర్ధారించారు. ఇన్ఫెక్షన్లు ఏర్ప డినప్పుడు వాటిని ఎదుర్కొనడానికి నిర్దిష్టమైన మోతాదులో మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మోతాదు ఎక్కువైనా, తక్కువైనా రోగికి ముప్పు కలిగించడమే కాదు... ఆ రోగకారక క్రిమి మరింత శక్తి సంతరించుకుని చుట్టూ ఉన్న అనేకమందికి సోకుతుంది. అటుపై దాన్ని అరికట్టడం అసాధ్య మవుతుంది. అంటురోగాలను నివారించడానికి పెన్సిలిన్ కనుగొన్నప్పుడు అందరూ సంబరప డ్డారు. కానీ రెండు దశాబ్దాలు గడిచేసరికల్లా వ్యాధికారక బ్యాక్టీరియా పెన్సిలిన్‌ను తట్టుకునే విధంగా వృద్ధి చెందింది. మన దేశంలో జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లకు వినియోగించే యాంటీ బయాటిక్ మందుల విక్రయాలపై ఎవరికీ అదుపు లేదు. వైద్యుల చీటీ ఉంటే తప్ప కొన్ని మందులు విక్రయించకూడదన్న నిబంధన ఉన్నా దాన్ని పాటించేవారుండరు. అది అమలవుతున్నదో లేదో చూసే వ్యవస్థ సక్రమంగా లేదు. జ్వరం, జలుబు, దగ్గు, అతిసార వంటి వైరస్ కారక జబ్బులకు చాలా సందర్భాల్లో అసలు యాంటీ బయాటిక్స్ అవసరమే ఉండదని, వాటంతటవే దారికొస్తా యని అంటారు. కానీ సరైన అవగాహన లేకపోవడం, శాస్త్రీయంగా ఆలోచించే ధోరణి కొరవడటం, వ్యాపార ప్రయోజనాలు ఇమిడి ఉండటం వగైరా కారణాల వల్ల వైద్యులు అయినదానికీ, కానిదా నికీ రోగులతో ఔషధాలు వాడిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆఖరుగా ఇవ్వాల్సిన యాంటీ బయాటిక్స్‌ను మొదట్లోనే అంటగడుతున్నారు. ఈ సంగతిని రెండేళ్లక్రితం యునిసెఫ్ నివేదిక వెల్ల డించింది. సక్రమంగా మందులు వాడకపోవడం వల్ల లేదా మోతాదుకుమించి మింగడం వల్ల ఏటా ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో లెక్కేసే విధానమే మన దేశంలో లేదు. కనుక దాన్ని అరికట్టడ మనే ఆలోచనే ఉండటం లేదు. మెరుగైన, ప్రామాణికమైన వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ బాధ్యతగా ఉన్నప్పుడే ఔషధాల వాడకం ఒక క్రమపద్ధతిలో ఉంటుంది. అదొక్కటే కాదు...దీనితో ముడిపడి ఉండే ఇతర సమస్యలపై సైతం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పరిశు భ్రమైన తాగునీటి లభ్యత, పారిశుద్ధ్యం అంతంతమాత్రం. వాటికి పౌష్టికాహారలోపం తోడవటంతో వ్యాధుల వ్యాప్తికి ఆస్కారం ఎక్కువ. ఈ స్థితిలో జబ్బును అరికట్టడానికి అవసరమైన మోతాదులో మందుల వినియోగం కొరవడితే చెప్పేదేముంది? ఔషధ నిరోధకతను అరికట్టడానికి రెండేళ్లక్రితం భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. కానీ ఆచ రణలో అది సరిగా అమలు కావడం లేదు. కొన్ని ఔషధాలను నిషేధించడం, మరికొన్ని ఔషధాల విక్రయంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు తీసుకున్నా అవి ఏమాత్రం చాలవన్నది ఐఏసీజీ భావన. ఔషధ నిరోధకత ఏ స్థాయిలో ఉన్నదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నప్పుడు మాత్రమే దాన్ని సంపూర్ణంగా అరికట్టడం సాధ్యమవుతుంది. ఔషధ నిరోధకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇప్పటికే 7 లక్షలమంది మరణిస్తున్నారు. 2050 నాటికి ఈ సంఖ్య కోటికి చేరుకుంటుందని ఐఏసీజీ అంచనా వేస్తోంది. మన దేశంలో సగటున ప్రతి వేయిమందిలో రోజూ యాంటీబయాటిక్స్ వాడే అలవాటు 63 శాతం పెరిగిందని నిరుడు ఒక అధ్యయనం తెలియజేసింది. పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తున్నదని వెల్లడైంది గనుక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే ప్రణాళికలు రచించి మందుల వినియోగంపై వైద్యులు, ఫార్మాసిస్టులు మొదలుకొని నర్సుల వరకూ అందరికీ అవగాహన కలిగించాలి. విస్తృత ప్రచారోద్యమాన్ని నిర్వహించాలి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల తరహాలో జబ్బుపడినవారెవరికైనా నాణ్యమైన చికిత్స అందేలా చూడాలి. అప్పుడు మాత్రమే ఔషధ నిరోధకత ముప్పునుంచి తప్పించుకోగలం. -
కుష్ఠును తరిమేద్దాం..!
కరీంనగర్‌హెల్త్: కుష్ఠు వ్యాధి జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కుష్ఠు వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల ద్వారా వ్యాధి కొంత వరకు తగ్గుముఖం పట్టింది. అయితే గత రెండేళ్లతో పోల్చితే ఇటీవల రోగుల సంఖ్య పెరగడంతో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరముంది. జిల్లాలో 2018–19లో 89 కేసులు నమోదు అయినట్లు కుష్ఠు వ్యాధి నివారణ శాఖ రికార్డులు తెలుపుతున్నాయి. గతేడాది జనవరి నుంచి మార్చి వరకు 24 మంది రోగులు ఉండగా, ఆ తర్వాత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రోగుల సంఖ్య 89కి పెరిగింది. 2016–17లో 54 కొత్త కేసులు నమోదు కాగా, 2017–18లో 43 కేసులు నమోదు అయ్యాయి. జమ్మికుంట మండలం తనుగులలోని పరిమళ కాలనీలో 67 మంది ఉండగా, వీరికి పరీక్షలు నిర్వహిస్తే 17 కేసులు నమోదు అయినట్లు సమాచారం. కొత్త కేసుల నమోదుతో పాటు వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేయడంలో కూడా ఆ శాఖ ముందుంది. ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించి 2018లో 28 మందికి వ్యాధిని పూర్తిగా నయం చేశామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 85 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. ఒకరికి శస్త్రచికిత్స నిర్వహించి వంకరగా మారిన అవయవాలను సరిచేశారు. కుష్ఠు వ్యాధి నిర్మూలనకు జిల్లా కుష్ఠు నివారణ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణాల నుంచి గ్రామ స్థాయి వరకు ప్రచారం నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. అయితే కుష్ఠు వ్యాధిపై ప్రజలను మరింత అప్రమత్తం చేయడం కోసం ప్రభుత్వం ఈ నెల 30న కుష్ఠువ్యాధి వ్యతిరేక దినంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది? అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వ్యాధి లక్షణాల ఎలా ఉంటాయి? వంటి అంశాలతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి గ్రామ స్థాయిలో ప్రచారం, ప్రతిజ్ఞ వంటి కార్యక్రమాలను రూపొందించారు. వ్యాధి రెండు రకాలు పాసి బేసిలరీ లెప్రసీ (పీబీ)మొదటిది. దీనివల్ల శరీరంపై ఒకటి నుంచి ఐదు వరకు మచ్చలు ఏర్పడుతాయి. మచ్చలు పొడిబారి, నొప్పి లేకుండా ఉంటాయి. మల్టీ బేసిలరీ లెప్రసీ (ఎంబీ) ఇది రెండవ రకం. శరీరంపై మచ్చల సంఖ్య ఆరు అంతకంటే ఎక్కువగా కనిపిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ నరాలకు కూడా సోకుతుంది. ఒకటే శస్త్రచికిత్స కేంద్రం వ్యాధి తీవ్రమై అంగవైకల్యం కలిగినపుడు శస్త్రచికిత్స చేయడానికి రాష్ట్రంలో ఒకే కేంద్రం ఉంది. హైదరాబాద్‌లోని శివానంద (ఎన్జీవో) లెప్రసీ రిహాబిలిటేషన్ సెంటర్లో శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. ఇక్కడ శస్త్రచికిత్స చేయించుకున్న వారికి మందులు, పౌష్టికాహారం కోసం రూ.8వేలు అందిస్తారు. వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెత్తని చెప్పులు ధరించి స్పర్శలేని పాదాలకు బొబ్బలు, పుండ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు కాళ్లు, చేతులు, శరీర భాగాలను పండ్లు రాకుండా గమనిస్తుండాలి పొడిబారిన చేతులు, కాళ్లును ప్రతిరోజు 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి పగుళ్లు, గాట్లు ఉన్న చోట మొద్దుగా ఉన్న అంచులు గల రాయితో తోమాలి. ఆ తర్వాత వంటనూనె పూసుకోవాలి. బొబ్బలు, పండ్లు ఉన్నపుడు సబ్బుతో శుభ్రం చేసుకొని గుడ్డను కట్టాలి. యాంటీ బయాటిక్ మాత్రలు వాడాలి. కండరాలు పని చేయనపుడు నూనెతో మర్ధన చేసి కీళ్లు గట్టిపడకుండా వ్యాయామం చేయాలి. సూర్యరశ్మిని భరించలేని పరిస్థితిలో కళ్లకు అద్దాలు వాడాలి. నిద్రపోయే సమయంలో కళ్లను కంటి ప్యాడ్స్‌తో మూసుకోవాలి. కుష్ఠు వ్యాధి లక్షణాలు.. కుష్ఠు వ్యాధి మైక్రోబ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మజీవి వల్ల సంక్రమిస్తుంది. ఇది ప్రధానంగా నరాలు, చర్మానికి సోకుతుంది. రోగి చర్మం రంగు కంటే తక్కువ రంగు, లేదా ఎరుపు రంగు, స్పర్శ లేని మచ్చలు, ముఖంపై మెరిసే చర్మం ఉన్నపుడు కుష్ఠుగా అనుమానించాలి. అరిచేతులు, అరికాళ్లలో కండరాల బలహీనత, అంగవైకల్యం, కన్ను ఎగువ రెప్పలపై బలహీనతగా అనిపిస్తుంది. ఉచితంగా చికిత్స.. కుష్ఠు వ్యాధి రెండు మూడు రకాల ఔషధాల వల్ల (బహుళ ఔషద చికిత్స) పూర్తిగా నయం అవుతుంది. ఇది 28 రోజులకు సరిపడా ప్యాక్‌లో లభిస్తుంది. దీనిని ప్రారంభ దశలోనే తీసుకుంటే అంగవైకల్యం అరికట్టువచ్చు. రోగులకు నిర్ధేశించిన కాలం వరకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ చికిత్స అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి 12 నెలలపాటు ఖచ్చితంగా మందులు వాడితే పూర్తిగా నయం చేసుకోవచ్చు. నెలకు రూ.1500 పింఛన్ కుష్ఠు వ్యాధితో బాధపడి పని చేసుకోలేని స్థితిలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీరికి పింఛన్ అందిస్తోంది. ఒక్కొక్కరికి నెలకు రూ.1500 చొప్పున మంజూరు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 232 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతున్నారు. ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స కుష్ఠు వ్యాధి నివారణకు అవసరమైన అన్ని రకాల మందులు, చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి నివారణకు ప్రచారం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ సుజాత, జిల్లా కుష్ఠు వ్యాధి నివారణ శాఖ అధికారి -
బ్యాక్టీరియాకు.. బ్యాడ్ టైమ్ స్టార్ట్!
ఇటు నుంచి వీలు కాకపోతే అటు నుంచి నరుక్కురమ్మన్నారనేది సామెత.. యాంటీబయాటిక్ మందుల విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది.. ఉన్న మందులకు అలవాటు పడిన బ్యాక్టీరియాలు ఒక పట్టాన చావమంటున్నాయి.. కొత్తవాటి తయారీకి బ్రేకులు పడి ఏళ్లు గడిచిపోతున్నాయి.. దీంతో శాస్త్రవేత్తలు రూటు మార్చేశారు. అటు నుంచి చెక్ పెట్టే సరికొత్త మందును సిద్ధం చేశారు! యాంటీబయాటిక్ నిరోధకత.. ఈ మధ్యకాలంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో అతిపెద్దది అనడంలో సందేహం లేదు. అంతెందుకు.. దీని కారణంగా 2050 నాటికి కోటి మంది ప్రాణాలు కోల్పోతారంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ ఫార్మా సంస్థ షియొనోగి ఓ శుభవార్తను మోసుకొచ్చింది. ‘సెఫీడెరొకాల్’పేరుతో ఈ సంస్థ అభివృద్ధి చేసిన సరికొత్త యాంటీబయాటిక్ మొండి బ్యాక్టీరి యాలను కూడా నాశనం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఏంటి ఈ కొత్త మందు ప్రత్యేకత? సెఫీడెరొకాల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే మనం జబ్బు పడ్డప్పుడు శరీరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఏదైనా ఇన్ఫె క్షన్ సోకినప్పుడు ముందుగా మన రోగ నిరోధక వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. ఇది రకరకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది. శరీరంలోని ఇనుము మోతాదును తగ్గించడం ఇందులో ఒకటి. రోగ నిరోధక వ్యవస్థ ఈ చర్యకు దిగిన వెం టనే బ్యాక్టీరియా కూడా స్పందిస్తుంది. అందుబాటులోని ఇనుమును వేగంగా తీసుకోవడం మొదలుపెడుతుంది. షియొనోగి శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని సెఫీడెరొకాల్ను సిద్ధం చేశా రు. ఇనుము అణువుల్లోపల యాంటీబయాటిక్ మందును చేర్చారు. బ్యాక్టీరియా ఈ అణువులను లోపలికి చేర్చుకోగానే... సెఫీడెరొకాల్ పని మొదలుపెడుతుంది. లోపలి నుంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. గ్రీకు పురాణాల్లో చెప్పినట్లు చెక్క గుర్రాల్లోపల యోధులను ఉంచి.. ట్రాయ్ నగరంపై దం డెత్తినట్లు అన్నమాట! 73% సక్సెస్.. షియొనోగి ఇటీవలే సెఫీడెరోకాల్ను 448 మందిపై ప్రయోగించి చూశారు. మూత్రపిండాల, మూత్ర నాళ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారిపై ఈ మం దు ప్రయోగించగా దాదాపు 73% మంది స్పందించారని, ప్రస్తు తం మార్కెట్లో అం దుబాటులో ఉన్న శక్తిమంతమైన యాంటీబయాటిక్ కంటే ఇది చాలా ఎక్కువని షియొనొగి తెలిపింది. దాదాపు 15 దేశాలు, 67 ఆసుపత్రుల్లో జరిగిన ప్రయోగాలు సత్ఫలితాలిచ్చినప్పటికీ విస్తృత స్థాయిలో ప్రయోగాలు జరిగితేగానీ.. ఈ మందును అందుబాటులోకి తేలేమన్నది నిపుణుల మాట. సెఫీడెరొకాల్ లాంటి వినూత్న మం దులు మరిన్ని అభివృద్ధి చేస్తే యాంటీబయాటిక్ నిరోధకతకు మెరుగైన పరిష్కారం లభిస్తుందని వీరు అంటున్నారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సుమారు 90 ఏళ్ల క్రితం పెన్సిలిన్ రూపంలో తొలి యాంటీ బయాటిక్‌ను తయారు చేశారు. పెన్సిలిన్ లాంటి యాంటీ బయాటిక్లకూ లొంగని బ్యాక్టీరియా ఏటా 7 లక్షల మంది ప్రాణాలు తీస్తోంది. అవసరం లేకపోయినా యాంటీబయాటిక్‌లు వాడాలని సూచిస్తున్నది.. మొత్తం ప్రిస్క్రిప్షన్లలో 20% అవసరానికి మించి వాడటం వంటి కారణాలతో ఏ మందుకూ లొంగని సూపర్ బగ్‌లు ఎక్కువ అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. 12 రకాల బ్యాక్టీరియాలతో మనిషికి ముప్పు ఎక్కువ! గత 30 ఏళ్లలో మార్కెట్ లోకి వచ్చిన యాంటీ బయాటిక్లన్నీ పాతవాటిలో మార్పులు, చేర్పులు చేసి సిద్ధం చేసినవే! -
బ్యాక్టీరియా భయం : రెండోసారి భారీ రీకాల్
పారిస్: ప్రపంచంలోనే అతిపెద్ద డెయిరీ సంస్థ, ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్ మరోసారి భారీ రీకాల్ చేపట్టింది. తాము తయారు చేసిన బేడీ పౌడర్‌లో అతిప్రమాదకరమైన సాల్మొనెల్లా బాక్టీరియా ఉందంటూ 7వేల టన్నుమేర గ్లోబల్ రీకాల్ చేపట్టిన సంస్థ తాజా మరోసారి తమ ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ముందు ప్రకటించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఈ రీకాల్ చేస్తున్నామిన గురువారం సంస్థ వెల్లడించింది. రెండు వారాల వ్యవధిలో రెండోసారి సాల్మొనెల్లా భయాందోళనలకారణంగా దాదాపు రెట్టింపు పరిమాణంలో మరోసారి రీకాల్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. తాజా రీకాల్ ఫ్రాన్ సహా విదేశాలలో విక్రయించే 720 బ్యాచ్ ఉత్పత్తులు ఉన్నాయి కాగా ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. గ్లోబల్‌గా 625 బ్యాచ్‌లను లేదా దాదాపు 7,000 టన్నుల ఉత్పత్తులను మార్కెట్‌నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు డిసెంబర్ 10 న ప్రకటించిన సంగతి తెలిసిందే. సాల్మొనెల్లా ( జంతువుల లేదా మానవుల మలంతో కలుషితమైన) బాక్టీరియా కారణంగా చాలామంది పిల్లలు అస్వస్థతకు గురికావడంతోపాటు ఫ్రాన్స్ ఆరోగ్య అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా ఆహారం విషతుల్యంగా మారి పిల్లలో డయేరియా, కడుపు తిమ్మిరి, వాంతులు తదితర లక్షణాలు వ్యాపించాయి. డిసెంబరు ప్రారంభంలో దేశంలో 26 మంది శిశువులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బ్రిటన్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సూడాన్ సహా పలు దేశాలకు ఎగుమతులపై ప్రభావం చూపనుంది. కాగా అతి ముఖ్యమైన బేబీ పౌడర్ లేదా పాల పొడి ఉత్పత్తులు అతి ప్రమాదకరమైన బాక్టీరియా ప్రభావానికి గురికావడం ఇదే మొదటి సారి కాదు. చైనాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన పాల పౌడర్‌లో పారిశ్రామిక రసాయనం మెలామైన్ కలవడంతో 2008 లో ఆరుగురు పిల్లలు మరణించారు. సుమారు 3లక్షలమంది పిల్లలతో సహా ఇతరులు కూడా అనారోగ్యం పాలయ్యారు. -
జిమ్‌లో కొన్ని కోట్ల బ్యాక్టీరియా!
లావొక్కింత తగ్గించుకోవాలనే తపనతోనో, జీరో సైజ్ కోసమో, సిక్స్ ప్యాక్ సాధించాలనే పట్టుదలతోనే నేటి యువత జిమ్‌ల వెంట పరుగుతీస్తున్న విషయం తెల్సిందే. అయితే జిమ్ పరికరాలపై మనకు హానికరమైన కొన్ని కోట్ల బ్యాక్టరియా ఉంటుందన్న విషయం ఎంత మందికి తెలుసు? ఇది తెలుసుకోవడం కోసమే ‘ఫిట్ రేటెడ్’ సంస్థ జిమ్‌లోని 27 పరికరాలపై పరిశోధనలు జరిపి కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉందని కనిపెట్టింది. ప్రతి జిమ్ పరికరంపైనా పది లక్షలకు మించి జెర్మ్స్ ఉంటాయని పరిశోధనలో తేలింది. ట్రెడ్మిల్ స్క్రీన్‌ను టచ్ చేసినప్పుడల్లా, ఫ్రీ వెయిట్‌ను పట్టుకున్నప్పుడల్లా బ్యాక్టీరియా జిమ్ యూజర్లపై దాడి చేస్తుంది. దీని వల్ల నిమోనియా లేదా సెప్టిసేమియా, చర్మ వ్యాధులు సంక్రమిస్తాయి. ► ట్రెడ్‌మిల్‌పై పబ్లిక్ టాయ్‌లెట్ కన్నా 74 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ► ఫ్రీ వెయిట్స్‌పై సరాసరి టాయ్‌లెట్ సీటుకన్నా 362 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ► ఎక్సర్సైజ్ బైక్‌పై స్కూల్ కేఫ్ ట్రేకన్నా 39 రెట్లు బ్యాక్టీరియా ఉంటుంది. ► అన్ని మూడు రకాల పరికరాలపై గ్రామ్ పాజిటివ్ కొస్సీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది స్కిన్‌తోపాటు ఇతర ఇన్పెక్షన్లను కలిగిస్తుంది. ఈ రకమైన బ్యాక్టీరియా యాంటీ బయాటిక్స్‌కు కూడా లొంగదు. ►ఫ్రీ వెయిట్స్, ఎక్సర్సైజ్ బైక్‌పైనా బసిల్లస్ బ్యాక్టీరియా కూడా ఉన్నట్టు వెల్లడైంది. దీని వల్ల చెవి, కళ్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తాయి. జిమ్ పరికరాలను రోజుకు ఎంతో మంది ఉపయోగిస్తుండడం వల్ల, వారి నుంచి కారే చెమట బిందువులతో కలసి బ్యాక్టీరియా విస్తరిస్తుందని నిపుణులు తెలిపారు. వాటిని వెంటవెంటనే యాంటీ బ్యాక్టీరియా రసాయనాలతో శుభ్రం చేయకపోవడం వల్ల ఈపరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. బ్యాక్టీరియా భయంతో జిమ్‌ను మానేయాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వారు చెబుతున్నారు. జాగ్రత్తలు జిమ్‌లోకి ప్రవేశించగానే యాంటీ బ్యాక్టీరియా జెల్ లేదా రసాయనంతో చేతులు కడుక్కోవాలి. శుభ్రమైన టవల్‌తో తుడుచుకోవాలి. అదే జెల్‌తో మనం పట్టుకోబోయే ప్రతి జిమ్ పరికరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే దాన్ని ఉపయోగించాలి. ప్రతి పరికరం వర్కవుట్ తర్వాత మళ్లీ చేతులు జెల్‌తో కడుక్కోవాలి. ఇంటికి వెళ్లేటప్పుడు కూడా శుభ్రంగా చేతులు కడుక్కొని వెళ్లాలి. వెళ్లాక జిమ్ బట్టలను నీటిలో తడిపి ఉతికేసుకోవాలి. ఇదంతా శ్రమెందుకు అనుకునేవారు ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవడం మంచిది.