
ఆస్పెర్ గిలియస్ టుబినిజెనిసిస్! భూమ్మీద ఉన్న అనేకానేక పుట్టగొడుగు జాతుల్లో ఇది ఒకటి. కాకపోతే ఇది ప్లాస్టిక్‌ను తిని హరాయించుకోగలదు. ఈ అద్భుత లక్షణాన్ని ఉపయోగించుకుంటే ప్లాస్టిక్ వ్యర్థాల భరతం పట్టవచ్చునని అంటున్నారు లండన్‌లోని రాయల్ బొటానికల్ గార్డెన్స్ శాస్త్రవేత్తలు. ‘స్టేట్ ఆఫ్ ద వరల్డ్ ఫంగీ – 2018’లో ప్రచురితమైన వివరాల ప్రకారం పుట్టగొడుగులు కొన్ని ప్లాస్టిక్‌ను తినడమే కాదు.. నేల, నీటి కాలుష్యాన్ని ఎంచక్కా తొలగించగలవని, ఇంకొన్ని కాలుష్యానికి ఆస్కారం లేని భవన నిర్మాణ సామాగ్రి కూడా అందిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఏడాది క్రితం పాకిస్థాన్‌లోని ఓ చెత్తకుప్పలో దీన్ని తొలిసారి గుర్తించారు. ప్లాస్టిక్ చెత్త నాశనమయ్యేందుకు సహజంగా కొన్ని ఏళ్ల సమయం పడితే.. ఈ పుట్టగొడుగు మాత్రం వారాల్లోనే నాశనమయ్యేలా చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్లాస్టిక్ చెత్తపై నేరుగా పెరగడంతోపాటు ఆ క్రమంలో ప్లాస్టిక్ అణువుల మధ్య ఉన్న రసాయన బంధాలను దెబ్బతీయడం ద్వారా ఈ పుట్టగొడుగు ఎదుగుతుందని టామ్ ప్రెస్కాట్ అనే శాస్త్రవేత్త వివరిస్తున్నారు.ప్లూరోటస్ ఒస్ట్రాటస్, ట్రామెటిస్ వెర్సికలర్ జాతి పుట్టగొడుగులు నేల, నీటిలోని క్రిమిసంహారక మందుల అవశేషాలు, రంగులు, పేలుడు పదార్థాల అవశేషాలను సురక్షితంగా తొలగించవని ప్రెస్కాట్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment