
గోఆధారిత సమీకృత సహజ సేద్య నిపుణులు, దొడ్డబళ్లాపూర్ (కర్ణాటక)కు చెందిన ప్రముఖ రైతు ఎల్. నారాయణ రెడ్డి (84) అక్టోబర్ 21 (ఆదివారం)న హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ కేఎల్‌ఎన్ ప్రసాద్ ఆడిటోరియం, రెడ్ హిల్స్, లక్డికపూల్‌లో ౖరైతులకు తెలుగులో శిక్షణ ఇస్తారు. భాగ్యనగర్ గోపాలాస్, రైతునేస్తం, నేచర్స్‌వాయిస్ సంయుక్త ఆధ్వర్యం లో ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో గోఆధారిత సమీకృత సహజ వ్యవసాయం, ఆహారం, జీవన విధా నంపై వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 70939 73999, 70608 43007 నంబర్లలో సంప్రదించవచ్చు.
21న సిరిధాన్యాల సాగుపై శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 21(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు ప్రకృతి వ్యవసాయ విధానంలో రబీలో సిరిధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. కడప జిల్లాకు చెందిన సీనియర్ రైతు విజయ్‌కుమార్ రైతులకు శిక్షణ ఇస్తారు. రైతులకు ఉచితంగా వేస్ట్ డీ కంపోజర్‌ను పంపిణీ చేస్తారు. వివరాలకు.. 83675 35439, 97053 83666.