సెప్టెంబర్ 30న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
దీప్తీ భట్నాగర్ (నటి), రేలంగి నరసింహారావు (దర్శకుడు), షాన్ (సింగర్)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రునికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరికి ఉత్సాహవంతంగా ఉంటుంది. గత సంవత్సరం చేపట్టిన ప్రాజెక్టుల నుంచి ఈ సంవత్సరం లాభం గడిస్తారు. నలుగురిని కలుపుకుని కొత్త టెక్నాలజీతో కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త పనులు చేపడతారు. విందు వినోదాలతో గడుపుతారు. పార్ట్‌నర్‌షిప్ వ్యవహరాలు లాభిస్తాయి. వివాహయోగం, సంతానయోగం వంటి శుభపరిణామాలు సంభవిస్తాయి. పాత స్నేహితులతో తిరిగి స్నేహం బలపడుతుంది. పుట్టిన తేదీ 30. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య కాబట్టి ఈ సంవత్సరం గురు చంద్రుల ప్రభావం వల్ల గజకేసర యోగం ఏర్పడి సంఘ గౌరవం పొందుతారు.
సంగీతం, నాట్యం లాంటి లలిత కళలలో సృజనాత్మకతతో కొత్త పుంతలు తొక్కుతారు. ప్రజలలో గుర్తింపు పొందుతారు. ఉదర సంబంధ వ్యాధులు, గ్యాస్ సమస్యలు వచ్చే వకాశం ఉన్నందువల్ల ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. లక్కీ నంబర్స్: 1,2,3,6,9; లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డ్, ఎల్లో, శాండిల్. సూచనలు: తల్లిని, తల్లి తరఫు వారిని ఆదరించడం, అమ్మవారిని ఆరాధించడం, పేద కన్యల వివాహానికి సాయం చేయడం, రోజూ కొంతసేపు వెన్నెలలో విహరించడం.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్