సేంద్రియ సేద్యంపై ఆన్‌లైన్‌ శిక్షణ | Online training on organic farming | Sakshi
Sakshi News home page

సేంద్రియ సేద్యంపై ఆన్‌లైన్‌ శిక్షణ

Published Tue, Jun 23 2020 6:34 AM | Last Updated on Tue, Jun 23 2020 6:34 AM

Online training on organic farming - Sakshi

కేంద్ర వ్యవసాయ, సహకార, రైతుల సంక్షేమ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం (ఎన్‌.సి.ఓ.ఎం.) కనీసం గ్రామీణ రైతులు, మహిళా రైతులకు సేంద్రియ సేద్యపద్ధతులపై ఆన్‌లైన్‌లో 7 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. జూలై మొదటి వారంలో శిక్షణ  ఇస్తారు. ఇంటర్మీడియట్‌ లేదా పాలిటెక్నిక్‌/ డిగ్రీ/ పీజీ పాసైన గ్రామీణ యువ రైతులు, యువ మహిళా రైతులు అర్హులు. వయస్సుకు సంబంధించి నిబంధన లేదు. గ్రామీణ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.

ఎన్‌.సి.ఓ.ఎం. కేంద్ర కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉండగా, మరో 8 చోట్ల ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ప్రతి ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వంద మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పరిధిలోని రైతులకు నాగపూర్‌లోని ప్రాంతీయ కార్యాలయం శిక్షణ ఇస్తుంది. రైతులు దరఖాస్తు పంపాల్సిన మెయిల్‌ ఐడి:

rdrcof.ngp-agri@gov.in
phone: 07118 297 054
దరఖాస్తు ఫారంను ఈ క్రింది వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..
https://ncof.dacnet.nic.in/DowloadableForms/ApplicationFormForTraining.pdf 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement