పిట్ట గోడ | pitta goda | Sakshi
Sakshi News home page

పిట్ట గోడ

Published Thu, Sep 10 2015 12:13 AM | Last Updated on Thu, Apr 4 2019 12:50 PM

పిట్ట  గోడ - Sakshi

పిట్ట గోడ

వనజ: పిన్నిగారూ... ఇది విన్నారా?
పిన్నిగారు: ఏంటి వనజా... అంత గొప్ప విషయమా?
వనజ: మన కాలనీలో ఉండే ఆటో శీనయ్యను పోలీసులు పట్టుకెళ్లారట.
పిన్నిగారు: అమ్మో... పోలీసులే?!
వనజ: ఆ... పోలీసులూ జీప్‌లో రాలేదు. పెద్ద వ్యాన్‌లో వచ్చారట. పోలీసులతో పాటు పెద్ద ఎస్పీ గారే స్వయంగా వచ్చారంట!
పిన్నిగారు: వ్యాన్‌లోనా? పైగా ఎస్పీ గారు! ఒక్క జవాను సరిపోడా వీడొక్కణ్ణీ తీసుకెళ్లేందుకూ?
వనజ: అదేగద వింత!  
పిన్నిగారు: అంత ఘనకార్యం ఏం చేశాట్ట?
వనజ: ఏం చేశాడా...? ఎవడో వీడి ఆటోలో ఒక పావుకిలో ఉల్లిపాయలు మరచిపోయాట్ట. మన కాలనీలో వీడే తెగ నిజాయితీపరుడైనట్టూ...ఉల్లిపాయలు రిటర్న్ ఇచ్చాడట. వాడికి అవార్డు ఇవ్వడానికి సీఎం పిలిపించుకున్నాట్ట.
పిన్నిగారు: అందుకేనా... వాడి పెళ్లాం తెగ బడాయిపోతోంది. అమ్మా...!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement