
వనజ (ఫైల్)
పెళ్లకూరు: ఆత్మహత్యాయత్నానికిపాల్పడ్డ మండలంలోని శిరసనంబేడు గ్రామానికి చెందిన దాసరి వనజ (18) అనే విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృత్యువాత పడింది. గ్రామానికి చెందిన దాసరి వెంకటాద్రి, మణెమ్మ దంపతుల రెండో కుమార్తె వనజ. నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. పరీక్ష ఫలితాల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపంతో నాలుగురోజుల క్రితం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమె శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వనజను తిరుపతికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వనజ కుటుంబసభ్యులను నాయకులు మురళీకృష్ణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, హరిబాబురెడ్డి, శ్యాంరెడ్డి తదితరులు పరామర్శించారు.