సహనం... ధైర్యం | problems in jobs with womens | Sakshi
Sakshi News home page

సహనం... ధైర్యం

Published Thu, Mar 10 2016 10:53 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

సహనం... ధైర్యం

సహనం... ధైర్యం

డ్యూటిప్స్
 * ఉద్యోగాల్లో కొనసాగే మహిళలకు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులను ధైర్యంగా అధిగమించే ప్రయత్నం చేయాలి. ఉద్యోగం ఒక్కటే సర్వస్వం కాదనే సంగతిని గుర్తెరగాలి. ఉద్యోగం కారణంగా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసేంతగా ఒత్తిడిని పెంచుకోవడం సరికాదు.
     
 * పనిభారం పంపిణీలో సమతుల్యత లోపించినట్లయితే, నిశ్శబ్దంగా భారాన్ని భరిస్తూ రావడం అంత క్షేమం కాదు. ఈ అంశంలో వివక్ష ఎదుర్కొంటున్నట్లు భావిస్తే, బాస్‌తో నేరుగా చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారమయ్యేలా ప్రయత్నించడం మంచిది.
     
 * ఉద్యోగ జీవితంలో రకరకాల మనస్తత్వాలు ఉన్నవాళ్లు తారసపడుతూ ఉంటారు. వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శలు ఎదురైనంత మాత్రాన కుంగిపోవడం మంచిది కాదు. విమర్శల్లో సహేతుకత ఉంటే, మిమ్మల్ని మీరు చక్కదిద్దుకునే చర్యలు మొదలుపెట్టండి. పనితో నిమిత్తంలేని అనవసరమైన విమర్శలను పట్టించుకోకండి.
     
 * ఉద్యోగ జీవితం విజయవంతంగా సాగాలంటే, నిరంతర అధ్యయనం తప్పదని గ్రహించండి. తెలియని విషయాలు ఏవైనా ఉంటే సీనియర్లను అడిగి తెలుసుకోవడానికి మొహమాటపడకండి. అప్పగించిన పనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయడాన్ని అలవాటుగా మార్చుకోండి.
     
 * మొండితనం, పిరికితనం... ఈ రెండూ ఉద్యోగ జీవితానికి చేటు చేస్తాయి. నిక్కచ్చిగా ఉంటూనే నిలకడగా సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. పిరికితనానికి పోయి వెనుకంజ వేసినా, మొండితనానికి పోయి దూకుడుగా వ్యవహరించినా సమస్యలు మరింత జటిలమై, కెరీర్ దెబ్బతింటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement