కొత్త పరిశోధన
కేవలం ఐదంటే ఐదు... అంశాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా గుండెజబ్బుల నుంచి, గుండెపోటు నుంచి గుండెను పూర్తిగా రక్షించుకోవచ్చని అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు డాక్టర్ శివానీ పటేల్ పేర్కొంటున్నారు. 1) పొగతాగే అలవాటు, 2) ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహారానికి దూరంగా ఉండటం 3) హై బ్లడ్ ప్రెషర్ రాకుండా చూసుకునేందుకు ఎప్పుడూ ఒత్తిడికి గురికాకుండా ఉండటం, 4) టైప్-2 డయాబెటిస్‌ను నివారించే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, 5) స్థూలకాయం రాకుండా, బరువు పెరగకుండా చూసుకోవడం. ఈ ఐదు అంశాలనూ పాటించడం అన్నది మన చేతుల్లో ఉన్న విషయమే.
ఈ ఐదు అంశాలను పాటిస్తూ సాధ్యమైనంతవరకు వాటిని మన ఆరోగ్యాన్ని కాపాడేవిధంగా మార్పులు చేసుకుంటే గుండె సురక్షితంగా ఉంటుందంటున్నారు డాక్టర్ శివానీ. ఈ అధ్యయనం కోసం ఆమె 45 నుంచి 79 ఏళ్ల వయసున్న దాదాపు ఐదు లక్షల మందిని పరిశీలించారు. వారి జీవనశైలిని ఆరోగ్యకరంగా ఉండేలా మార్పులు చేయడం వల్ల 54 శాతంమందిలో గుండె జబ్బులను నివారించగలిగినట్లు ఆమె పేర్కొంటున్నారు. తన పరిశోధన ఫలితాలను ‘యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అనే జర్నల్‌లో పొందుపరచినట్లు ఆమె వెల్లడించారు.
మార్చుకోదగ్గ అలవాట్లతో గుండెను రక్షించుకోవచ్చు!
Published Tue, Jul 21 2015 11:14 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM
Advertisement