అనుబంధాల గురించి చెబుతున్నారా?
సెల్ఫ్‌చెక్
చదువు, ఆరోగ్యం... అన్నింటిలో మన పిల్లలు ముందుండాలని కోరుకుంటాం. వయసుతో సంబంధం లేకుండా వారు చేసే అద్భుతాలను చూసి మురిసిపోతుంటాం. అంతా బాగానే ఉంది కానీ, అనుబంధాల మాటేమిటి? తాతల పేర్లు కూడా సరిగ్గా తెలియని పిల్లలు ఉన్నారంటే మీరు నమ్ముతారా?
1.మీ తల్లిదండ్రుల గురించి, వీలైతే తాతల పేర్లు వారి జన్మస్థలం.. వృత్తుల గురించి, మీ అత్తమామలు, వారి తల్లిదండ్రుల వివరాల గురించి పిల్లలకు చెబుతుంటారు.
ఎ. అవును బి. కాదు
2. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు... వారి వివరాలతో పాటు చిన్నప్పుడు వారితో మీకున్న జ్ఞాపకాలను తరచూ చెబుతుంటారు.
ఎ. అవును బి. కాదు
3. ఎవరైనా బంధువులు ఇంటికొస్తున్నారని ముందుగానే తెలిస్తే వారు రాక ముందే వారికి సంబంధించిన విషయాలన్నీ పిల్లలకు చెబుతారు.
ఎ. అవును బి. కాదు
4.బంధువులకు సంబంధించిన చేదు అనుభవాలను తరచూ పిల్లల దగ్గర ప్రస్తావిస్తుంటారు.
ఎ. అవును బి. కాదు
5. తరచూ బంధువులను కలుస్తుండడం వల్ల పిల్లలకు మంచి చెడులు త్వరగా తెలుస్తుంటాయని నమ్ముతారు.
ఎ. అవును బి. కాదు
ఇందులో ‘ఎ’లు ఎక్కువగా వచ్చినట్టయితే మీరు మీ పిల్లలకు అనుబంధాల గురించి చెబుతున్నట్టు. లేదంటే మీ పిల్లలను మీరే కుటుంబ బంధాలకు దూరం చేస్తున్నట్టు లెక్క. తల్లి తరపున, తండ్రి తరపున కనీసం రెండు తరాల వారి పేర్లు, వివరాలు తెలపడం తల్లిదండ్రులుగా మీ బాధ్యతైతే, తెలుసుకోవడం పిల్లలకు కనీస అవసరం. పేర్లు, వివరాలే కాదు... వారితో మీకున్న అనుబంధం గురించి చెబుతుండాలి. ఈ విషయంలో తల్లిదండ్రులుగా మీరెలా ఉన్నారో తెలుసుకోండి.