మెడిక్షనరీ
కొంతమంది కాళ్లు అదేపనిగా ఊపుతుంటారు. ఈ కండిషన్‌ను ‘రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్’ అంటారు. ఇదొక నరాల జబ్బు. ఇది నిద్రకూ అంతరాయం కలిగిస్తుంటుంది. కాబట్టి దీన్ని నిద్రసంబంధమైన రుగ్మత (స్లీప్ డిజార్డర్)గా కూడా పరిగణిస్తుంటారు. ఇక కొంతమంది మహిళల్లో ఇది గర్భధారణ తర్వాత కనిపిస్తుంది. ఇంకొందరిలో ఆస్తమా అలర్జీలకు వాడే మందులు, యాంటీడిప్రెసెంట్ తీసుకున్నప్పుడూ రావచ్చు. ఆల్కహాల్, నిద్రలేమి సైతం ఈ జబ్బుకు కారణాలు కావచ్చు.
దీన్ని తగ్గించడం కోసం సాధారణంగా వ్యాయామాలు, నిద్రను క్రమబద్దీకరించడం, కాఫీ, ఆల్కహాల్, పొగాకు వాడకాన్ని తగ్గించడం తోడ్పడతాయి. ఇలా మందులు వాడకుండానే అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక చాలా కొద్దిమందిలో మెదడులో స్రవించే ఒక రకమైన రసాయనాన్ని పెంచే డోపమినర్జిక్ మందులు, ఫిట్స్‌ను తగ్గించే మందులు వాడాల్సి రావచ్చు.
కాళ్లు ఊపే జబ్బు...!
Published Sat, Dec 5 2015 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM
Advertisement