ఆంగ్ల రచయిత సోమర్‌సెట్ మామ్ ఒకసారి స్పెయిన్ చూడ్డానికి వెళ్లాడు. అక్కడున్న సమయంలోనే తన పుస్తకాలకు రావలసిన రాయల్టీ అందజేయబడింది. అంత డబ్బును ఏకమొత్తంలో తమ దేశానికి తీసుకుపోవడానికి స్పానిష్ చట్టం ఒప్పుకోదు. ఆలోచించి మామ్ ఓ నిర్ణయానికి వచ్చాడు. మాడ్రిడ్‌లోని అతి ఖరీదైన హోటల్లో బస చేశాడు. అక్కడున్నన్ని రోజులూ రాజభోగాలను అనుభవించాడు. చివరకు మొహం మొత్తింది.
అప్పటివరకూ ఖర్చయినది చాల్లెమ్మనుకొని, హోటల్ మేనేజర్ దగ్గరకెళ్లి, ‘‘నేను గది ఖాళీ చేస్తున్నాను. బిల్లు వేయండి’’ అన్నాడు.అందుకా మేనేజర్ వినయాంజలి ఘటిస్తూ, ‘‘అయ్యా! తమవంటి గొప్పవారు మా హోటల్లో బస చేయడమే మహాభాగ్యంగా భావిస్తున్నాం. మీరు మా హోటల్లో ఉన్నందువల్ల, మీ పేరు మీదుగా మా వ్యాపారం మామూలు కన్నా రెట్టింపైంది. మీరేమీ బిల్లు కట్టనవసరం లేదు.ఇకముందు మీరెప్పుడు స్పెయిన్ కొచ్చినా మా హోటల్లో ఉచితంగా బస చేయాలని కోరుకుంటున్నాం’’ అనేసరికి మామ్‌కు నోట మాట రాకపోయింది. అయినాల కనకరత్నాచారి
Comments
Please login to add a commentAdd a comment