చెన్నై: అడవుల్లో నివసించే ఆదివాసీల సంప్రదాయాలు ఆధునికులకు వింతగా ఉంటాయి. ఒక్కో తెగ పద్దతులు ఒక్కోలా ఉంటాయి. అలాగే తమిళనాడు అడవుల్లో నివసించే టోడ అనే గిరిజన తెగ సంప్రదాయాలు చూడటానికి, వినడానికి విచిత్రంగా ఉంటాయి. నీలగిరి అడవుల్లో ఉండే ఈ తెగ పెళ్లి విషయంలో వింత ఆచారాన్ని పాటిస్తారు. ఆ పెళ్లి స్పెషాలిటీ ఏమిటంటే....
టోడ గిరిజన తెగలో పెళ్లివేడుక సాధారణంగా నిర్వహిస్తారు. పెళ్లి తర్వాత వధువు, వరుడితో గడుపుతుంది. అనంతరం వధువు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో పెళ్లి కూతురు కచ్ఛితంగా నెల తప్పాల్సిందే. గర్భం ధరించకపోతే ఆ వివాహం చెల్లదు. నెల తప్పితే ఏడో నెలకు భర్త అడవికి వెళ్ళి పవిత్రంగా భావించే చెట్టు కాండంతో విల్లు, బాణం తయారు చేసి భార్యకు ఇస్తారు. ఆవస్తువులు భార్యకు నచ్చి తీసుకొంటే అతడిని భర్తగా అంగీకరించినట్లు. అంతేకాదు కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిగా కూడా ఒప్పుకొంటుంది.
ఈకార్యక్రమం అనంతరం విల్లు, బాణం వేడుకలు భారీ ఎత్తున జరుపుతారు. సంప్రదాయ నృత్యాలు పాటలతో ఘనంగా సంబరాలు చేసుకొంటారు. ఈ వేడుకలు అనంతరం ఇరువురు పెద్దల ఆశీర్వాదంతో అప్పటి నుంచి భార్యాభర్తల్లా జీవితాంతం కలిసి ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment