నిర్ణయాల అమలులో ఆడవాళ్లదే అగ్రస్థానం!
కొత్త సంవత్సరం... పాత అలవాట్లను వదిలించుకుని, కొత్త మంచి అలవాట్లను అలవరుచుకోవడానికి తగిన సమయం అని చాలామంది భావిస్తారు. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటూ గుడ్‌నెస్‌కు వెల్కమ్ చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. మరి న్యూయర్ రెజల్యూషన్స్‌ను ఎంత మంది అమల్లోపెడుతున్నారు? అనే దానిపై బ్రిటన్ పత్రిక డెయిలీ మెయిల్‌లోని అధ్యయనం ప్రకారం..
ప్రతియేటా దాదాపు 52 శాతంమంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్‌ను అమల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీటికి కట్టుబడి ఉంటున్నది కేవలం 12 శాతం మందే! నిర్ణయాలను సక్సెస్‌ఫుల్‌గా అమల్లో పెట్టడంలో మహిళలదే అగ్రస్థానం. పురుషులు మాత్రం బద్ధకిస్టులుగా మారుతున్నారు. నిర్ణయానికి కట్టుబడే శక్తి, క్రమశిక్షణ లేకపోవడం వల్లనే తాము న్యూ ఇయర్ రెజల్యూషన్‌ను అమల్లో పెట్టలేకపోయామని 46 శాతంమంది తెలిపారు.
తమ పని ఒత్తిడి వల్ల అమల్లో పెట్టలేకపోయామని 23 శాతంమంది తెలిపారు. ఫ్యామిలీ కమిట్‌మెంట్స్ వల్ల న్యూ ఇయర్ రెజ ల్యూషన్స్‌ను అమల్లో పెట్టలేకపోయామని 22 శాతం మంది తెలిపారు. 26 శాతంమంది తొలి మూడు వారాల్లోనే న్యూ ఇయర్ రెజ ల్యూషన్‌కు స్వస్తి చెబుతున్నారట.