The Daily Mail
-
పుతిన్ పదవి నుంచి వైదొలగనున్నారా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇకపై పదవిలో కొనసాగబోరనే వార్తలు వినపడుతున్నాయి. పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా పుతిన్ జనవరిలో పదవి నుంచి వైదొలగే వీలుందని వార్తలొచ్చాయి. పుతిన్ ప్రియురాలు 37 ఏళ్ళ ఎలీనా కబేవా, ఆయన కుమార్తెలు పుతిన్‌ని పదవి నుంచి దిగిపోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు, మాస్కోకి చెందిన రాజకీయ విశ్లేషకులు వలేరి సొలోవే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘ద డెయిలీ మెయిల్’ఒక కథనాన్ని ప్రచురించింది. పుతిన్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఉండి ఉండవచ్చునని సొలేవే తెలిపారు. పుతిన్ పాదాల కదలికలో తేడాలున్నాయని, ఆయన కుర్చీని గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న దృశ్యాలు బయటపడ్డాయని, ఆయన పక్కనున్న కప్పు నిండా మాత్రలున్నాయని ఆయన తెలిపారు. పుతిన్ త్వరలోనే నూతన ప్రధానిని నియమిస్తారని, ఆయనను తన వారసుడిగా తయారు చేస్తారని సొలోవే తెలిపినట్లు న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది. ఇదిలా ఉండగా పుతిన్ పదవి నుంచి దిగిపోతారనే ప్రచారాన్ని రష్యా అధికార వర్గాలు తోసిపుచ్చాయి. పదవి నుంచి వైదొలగే అవకాశమే లేదని క్రిమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. -
ట్రంప్ భార్యకు భారీ మూల్యం!
లండన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి, ఫస్ట్‌లేడీ మెలానియా.. గతంలో వ్యభిచార వృత్తిలో (ఎస్కార్ట్)ఉన్నట్లు ఆరోపిస్తూ వివాదాస్పద కథనం రాసిన డెయిలీ మెయిల్ పత్రిక, మెయిల్ ఆన్లైన్ వెబ్సైట్లు మరోసారి క్షమాపణలు చెప్పాయి. సదరు కథనాలపై రూ.1000 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఫస్ట్‌లేడీ మెలానియాతో ఎట్టకేలకు రాజీ ఒప్పందం కుదుర్చుకుదిరిందని డెయిలీ మెయిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె(మెలానియా) ఎస్కార్ట్‌గా ఉన్నట్లుగానీ, ట్రంప్‌ను తొలిసారిగా ఎప్పుడు కలిశారనేదానిపైగానీ తాము ప్రచురించిన కథనం సత్యదూరమని, తప్పుడు కథనం ప్రచురించినందుకుగానూ మెలానియాకు మరోసారి క్షమాపణలు చెబుతున్నామని పత్రికా ప్రతినిధులు పేర్కొన్నారు. ఏమిటీ వివాదం?: డొనాల్డ్ ట్రంప్‌తో పరిచయానికి ముందు.. 1990 దశకంలో మెలానియా వ్యభిచార వృత్తిలో (ఎస్కార్ట్)ఉన్నారని, ఆమె పనిచేసిన మోడలింగ్ ఎజెన్సీ నిర్వాహకుడే ఈ విషయాన్ని వెల్లడించారని గత ఆగస్టులో డెయిలీ మెయిల్, మెయిల్ ఆన్లైన్ సహా నాలుగు వార్తాసంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలు నూటికి నూరు శాతం అబద్దాలేనని, వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠ దారుణంగా దెబ్బతీసేవిగా ఉన్నాయని మండిపడ్డ మెలానియా.. ఆ పత్రికలపై మేరీలాండ్ కోర్టులో భారీ పరువు నష్టం దావా వేశారు. మెలానియా దావా దాఖలు చేసిన వెంటనే డైలీమెయిల్ సహా మిగతా పత్రికలు ఆ కథనాన్ని తొలిగించి క్షమాపణలు చెప్పాయి. క్షమాపణ చెప్పినప్పటికీ తన క్లయింట్ కేసును ఉపసంహరించుకోబోరని మెలానియా తరఫు న్యాయవాది హార్డర్ స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీలేక భారీ మూల్యం చెల్లించుకుని రాజీపడ్డారు. కాగా, మెలానియా డిమాండ్ చేసిన 150 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.1000 కోట్ల) కాకుండా కేవలం 2.9 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.19 కోట్లు) మాత్రమే చెల్లించేందుకు డైలీ మెయిల్ అంగీకరించిందని కొందరు, కాదూ భారీ మొత్తాన్నే చెల్లించారని ఇంకొందరు ప్రతిస్పందించారు. -
వెయ్యి కోట్లకు దావా వేసిన ట్రంప్ భార్య
-
వెయ్యి కోట్లకు దావా వేసిన ట్రంప్ భార్య
వాషింగ్టన్: డైలీ మెయిల్, అమెరికా చెందిన బ్లాగ్ టార్ప్లేపై రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా పరువునష్టం దావా వేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసినందుకు వెయ్యి కోట్ల రూపాయలకు(150 మిలియన్ డాలర్లు) చెల్లించాలని మేరీలాండ్ కోర్టులో దావా దాఖలు చేశారు. న్యూయార్క్ లో మెలానియా పార్ట్ టైమ్ సెక్స్ వర్కర్(ఎస్కార్ట్) గా పనిచేశారని, ఆ సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ ఆమెకు పరిచయం అయ్యారని డైలీ మెయిల్ ప్రచురించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మెలానియాపై రాసిన కథనాలు పూర్తిగా అసత్యమని ఆమె తరపు న్యాయవాది చార్లెస్ హార్డర్ అన్నారు. ‘ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. మెలానియా గురించి రాసిదంతా వంద శాతం అబద్ధం. ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించేలా రాశారు. తన గురించి ఇష్టమొచ్చినట్టు రాసినందుకు రెండు రెండు సంస్థలపై 150 మిలియన్ డాలర్లకు పరువు నష్టం దావా వేశార’ని చార్లెస్ హార్డర్ తెలిపారు. స్లోవెనియాలో జన్మించిన మెలానియా 1990 దశకంలో అమెరికాలో మోడల్ గా పనిచేశారు. 2005లో ట్రంప్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు -
డబుల్ టెంపరేచర్!
సూపర్ సింగర్ జస్టిన్ బీబర్, మెగా మోడల్ లారా స్టోన్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. కాల్విన్ క్లెయిన్ కొత్త యాడ్‌లో ఇద్దరూ టెంపరేచర్ రైజ్ చేసే పనిలో పడ్డారు. ఈ ప్రకటన కోసం టాప్‌లెస్‌గా నటించి షాకిచ్చారు. ఫుల్‌గా టాటూలతో నిండిపోయిన బీబర్ బాడీని చుట్టేసిన లారా పిక్చర్‌ను చూస్తుంటే పురుష పుంగవుల టెంపరేచర్లు రైజవుతున్నాయన్నది ‘డైలీ మెయిల్’ కథనం. రీసెంట్గా ఈ పిక్చర్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటి వరకూ బీబర్ అండర్ వేర్ యాడేదో చేస్తున్నాడని రూమర్లు షికార్లు చేశాయి. తాజా ఫొటోతో అందరి ఊహాగానాలకు తెరపడింది. -
నిర్ణయాల అమలులో ఆడవాళ్లదే అగ్రస్థానం!
కొత్త సంవత్సరం... పాత అలవాట్లను వదిలించుకుని, కొత్త మంచి అలవాట్లను అలవరుచుకోవడానికి తగిన సమయం అని చాలామంది భావిస్తారు. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటూ గుడ్నెస్కు వెల్కమ్ చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. మరి న్యూయర్ రెజల్యూషన్స్‌ను ఎంత మంది అమల్లోపెడుతున్నారు? అనే దానిపై బ్రిటన్ పత్రిక డెయిలీ మెయిల్లోని అధ్యయనం ప్రకారం.. ప్రతియేటా దాదాపు 52 శాతంమంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్‌ను అమల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీటికి కట్టుబడి ఉంటున్నది కేవలం 12 శాతం మందే! నిర్ణయాలను సక్సెస్‌ఫుల్‌గా అమల్లో పెట్టడంలో మహిళలదే అగ్రస్థానం. పురుషులు మాత్రం బద్ధకిస్టులుగా మారుతున్నారు. నిర్ణయానికి కట్టుబడే శక్తి, క్రమశిక్షణ లేకపోవడం వల్లనే తాము న్యూ ఇయర్ రెజల్యూషన్‌ను అమల్లో పెట్టలేకపోయామని 46 శాతంమంది తెలిపారు. తమ పని ఒత్తిడి వల్ల అమల్లో పెట్టలేకపోయామని 23 శాతంమంది తెలిపారు. ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల న్యూ ఇయర్ రెజ ల్యూషన్స్ను అమల్లో పెట్టలేకపోయామని 22 శాతం మంది తెలిపారు. 26 శాతంమంది తొలి మూడు వారాల్లోనే న్యూ ఇయర్ రెజ ల్యూషన్కు స్వస్తి చెబుతున్నారట.