
సైన్స్ ఫిక్షన్‌కూ ఓ మ్యూజియమ్
సైన్స్- ఫిక్షన్ అంటే ఇష్టం లేనిది ఎవరికి? ఆ ఇష్టాన్ని మరింత పెంచడానికి వాషింగ్టన్, డి.సి(అమెరికా)లో ‘మ్యూజియం ఆఫ్ సైన్స్ ఫిక్షన్’ ప్రారంభం కానుంది.
సై-ఫై
సైన్స్- ఫిక్షన్ అంటే ఇష్టం లేనిది ఎవరికి? ఆ ఇష్టాన్ని మరింత పెంచడానికి వాషింగ్టన్, డి.సి(అమెరికా)లో ‘మ్యూజియం ఆఫ్ సైన్స్ ఫిక్షన్’ ప్రారంభం కానుంది. ఈ మ్యూజియంలో సైన్స్ ఫిక్షన్‌కు సంబంధించిన రచనలు, వీడియోలు...ఉండబోతున్నాయి.
‘వాషింగ్టన్ పేరు వినబడగానే సై-ఫై మ్యూజియం గుర్తుకు వచ్చేలా ఉండాలనేదే మా ప్రయత్నం’ అంటున్నాడు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గ్రేగ్ విగియానో. ఈయన హాలీవుడ్ సినిమాలకు రచనలు చేస్తుంటాడు. గత సంవత్సరం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాకు రచన చేయాల్సి వచ్చింది. తనకు కావల్సిన సమాచారం కోసం వెదికినప్పుడు నిరాశ ఎదురైంది. అరకొర సమాచారం మాత్రమే దొరికింది. ‘సైన్స్-ఫిక్షన్‌కు పూర్తిస్థాయిలో ఒక మ్యూజియం అందుబాటులో ఉంటే బాగుండేది’ అనుకున్నాడు. అనుకోవడమే కాదు తన ఆలోచనను ‘మ్యూజియం ఆఫ్ సైన్స్ ఫిక్షన్’ రూపంలో ఆచరణలోకి తెస్తున్నాడు గ్రేగ్.
మ్యూజియంలో మొత్తం ఏడు గ్యాలరీలు ఉంటాయి. వీటిలో రకరకాల వింత వాహనాలు, టైమ్‌ట్రావెల్ కాన్సెప్ట్‌లు, గ్రహాంతర వాసుల చిత్రాలు, రోబోలు... మొదలైనవి ప్రదర్శిస్తారు. ‘సైన్స్‌కు ప్రేరణలాంటిది సైన్స్‌ఫిక్షన్. నేటి సెల్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు... సైన్స్‌ఫిక్షన్ నుంచి పుట్టినవే కదా! ఈ మ్యూజియం ప్రారంభమైన తరువాత మరిన్ని కొత్త ఆవిష్కరణలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు’ అంటున్నాడు గ్రేగ్.