కేస్ స్టడీ
సరిత, దినేష్‌ల పెళ్లయ్యి ఆరేళ్లయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. దినేష్ తన తలిదండ్రులకు ఒక్కడే సంతానం. వారి పినతండ్రులకూ, పెద తండ్రులకూ ఎవరికీ మగసంతానం లేదు. వారి ఏకైక వారసుడు దినేష్ ఒకడే. అందరూ వారి వంశంలో ఒక మగపిల్లాడు పుట్టాలని కలలు కంటున్నారు. దినేష్‌కి గనక మగపిల్లలు పుట్టకపోతే, ఇక అతని తర్వాత వారి వంశం అంతరించి పోతుందని వారి భావన. దాంతో మూడోసారైనా కొడుకు పుట్టాలని సరితని ఆపరేషన్ చేయించుకోకుండా ఆపేశారు. ఇప్పుడు సరిత గర్భవతి. అందరిలోనూ టెన్షన్. ఒకవేళ ఇప్పుడు పాపే పుడితే ..? అందరూ కలిసి ఆమెను బలవంతం చేయసాగారు. తెలిసిన డాక్టర్ దగ్గరకెళ్లి స్కానింగ్ చేయించి చూసి పాపైతే అబార్షన్ చేయిస్తామని తీవ్రంగా వేధించసాగారు. సరితకు ససేమిరా ఇష్టం లేదు. అతికష్టం మీద భర్తను ఒప్పించి ఫ్యామిలీ కౌన్సెలర్ దగ్గరకు తీసుకొని వెళ్లింది. ఆ ఫ్యామిలీ కౌన్సెలర్ న్యాయవాది కూడా:
నెమ్మదిగా వారి సమస్య ఏమిటో తెలుసుకుని, గర్భస్థ పిండ పరీక్ష, లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 గురించి ఇలా వివరించారు.
హాస్పిటల్స్‌లో ఎవరైనా డాక్టర్‌గాని, టెక్నీషియన్ గాని, గైనకాలజిస్ట్ లేక మెడికల్ ప్రాక్టిషనర్ గానీ లింగనిర్థారణ పరీక్షలు నిర్వహించకూడదు. అవసరం లేకుండా గర్భిణులకు స్కానింగ్ చేయరాదు. ఒకవేళ ఆరోగ్య కారణాల దృష్ట్యా చేయవలసి వస్తే గర్భస్థ శిశువు ఎవరైనదీ చెప్పరాదు. అలా చేస్తే చట్టప్రకారం 3 సం. జైలుశిక్ష, జరిమానా పడతాయి.
35 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భవతులైన మహిళలకు, ఎక్కువసార్లు గర్భస్రావాలు జరుగుతున్న మహిళలకు, జన్యుసంబంధ, క్రోమోజోమ్ సంబంధ, సెక్స్ సంబంధ రోగాలతో బాధపడుతున్న గర్భిణులకు మాత్రమే గర్భస్థ శిశువు పెరుగుదల, ఆరోగ్యాలను గురించి తెలుసుకునేందుకు పిండపరీక్ష లు చేయవచ్చు. అంతేగాని లింగనిర్ధారణ, ఫీమేల్ ఫీటిసైడ్ కోసం కాదు. న్యాయవాది చెప్పిన విషయాలు విని దినేష్ షాక్ తిన్నాడు. తన కుటుంబ సభ్యులకూ చెప్పాడు. దాంతో సరితపై వేధింపులు తగ్గాయి. అసలు గర్భస్థ శిశువు ఆడామగా అనేది నిర్ణయించేది పురుషునిలోని ్ఠడ క్రోమోజోములే!
ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్
లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడితే... జైలు, జరిమానా
Published Tue, Aug 4 2015 11:01 PM | Last Updated on Sat, Sep 15 2018 3:43 PM
Advertisement