కారంగా ఉండే టమోటాలు | The use of capsinoid chemicals has been used | Sakshi
Sakshi News home page

కారంగా ఉండే టమోటాలు

Published Wed, Jan 9 2019 12:04 AM | Last Updated on Wed, Jan 9 2019 12:04 AM

The use of capsinoid chemicals has been used - Sakshi

కారం తింటే నోరంతా మండిపోతుంది గానీ.. అందులో ఉండే కాప్సినాయిడ్‌ రసాయనాల వల్ల మాత్రం బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఊబకాయం, నొప్పి తగ్గించే విషయంలో ఈ కాప్సినాయిడ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇంకేముంది. వీటిని బోలెడన్ని పండిస్తే సరి అంటున్నారా? అక్కడే వస్తోంది చిక్కు. వీటిని పెద్దఎత్తున పండించడం సాధ్యం కాదు. మిరప, మిరియాలు, కాప్సికం వంటి వాటిల్లోనూ ఇవి తక్కువగా ఉంటాయి. పంటపంటకూ తేడాలూ ఉంటాయి. మరెలా? అంటే.. సులువుగా పండించుకోగల టమోటాల్లో కాప్సినాయిడ్లు ఉత్పత్తి చేసే జన్యువులను మళ్లీ ఆన్‌ చేస్తే సరి అంటున్నారు శాస్త్రవేత్తలు.

టమోటా, కాప్సికమ్‌లు రెండూ ఒకేజాతికి చెందినప్పటికీ రెండు కోట్ల ఏళ్ల కిత్రం విడిపోయాయని, కాకపోతే రెండింటిలోనూ ఒకే రకమైన జన్యువులు కొన్ని ఉండటం గమనార్హమని తాజా ప్రతిపాదన తీసుకొచ్చిన శాస్త్రవేత్త అగస్టిన్‌ సైన్‌. ఈ జన్యువుల్లో కాప్సినాయిడ్‌ ఉత్పత్తి చేసేవి కూడా ఉన్నాయని.. ఇవెలా పనిచేస్తాయో తెలుసుకుని టమోటాల ద్వారా బహుళ ప్రయోజనకరమైన కాప్సినాయిడ్లను పెద్దఎత్తున ఉత్పత్తి చేయడం ఎంతైనా ప్రయోజనకరమని ఆయన వివరించారు. టమోటా కేంద్రంగా కొన్ని ఆహారానికి రంగులిచ్చే బిక్సిన్, కంటిచూపును మెరుగుపరిచే బీటా కెరొటిన్‌ వంటి ఆక్సిడెంట్లను కూడా ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement