శిలువతో వా‘కింగ్’
ఈ ఫొటోలో కనిపిస్తున్న అమెరికన్ పెద్దమనిషి పేరు అర్థర్ బ్లెసిట్. ఇతగాడు వాకింగ్‌లో కింగ్. కాలినడకతోనే ప్రపంచమంతా చుట్టేశాడు. చేతులు ఊపుకుంటూ సాదాసీదాగా సాగిన నడక కాదు, 3.7 మీటర్ల పొడవు ఉన్న శిలువను భుజాన వేసుకుని మరీ నడక సాగించాడు.
ఫ్లోరిడా నుంచి 1969లో మొదలుపెట్టిన నడకను 2000 సంవత్సరం వరకు కొనసాగించాడు. మొత్తం 31 ఏళ్ల వ్యవధిలో ఏడు ఖండాలనూ చుట్టేస్తూ, 34,501 మైళ్లు (55,524 కి.మీ) నడక సాగించి, గిన్నెస్ బుక్‌లోకి ఎక్కాడు. ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.
తిక్కలెక్క