
వాటర్ ఎలర్జీ...
మెడి క్షనరీ
ఈ జబ్బు ఉన్నవాళ్లు నీళ్లు అంటేనే అలర్జీ. వీళ్ల ఒంటిమీద నీళ్లు పడితే అవి చర్మంపై దద్దుర్లు పుట్టిస్తాయి. అవి దురదను కలిగిస్తాయి. చాలా అరుదుగా కనిపించే ఈ జబ్బు పేరే ‘వాటర్ అలర్జీ’! వైద్యపరిభాషలో దీన్ని ‘అక్వాజెనిక్ అర్టికేరియా’ అంటారు.
మొదట నీళ్లలోని క్లోరిన్ లేదా ఫ్లోరిన్ వంటి రసాయనాల వల్ల ఇలా చర్మంపై అలర్జీ వస్తుందేమోనని అనుమానిస్తారు. కానీ స్విమ్మింగ్‌పూల్‌లో దిగడం వంటి పనుల తర్వాత ఒంటి మీద రాష్ రావడం వంటి చర్యల వల్ల అది నీళ్ల వల్లనే అని నిర్ధారణ అవుతుంది. ప్రస్తుతానికి వ్యాధికి అంతగా మందులు అందుబాటులో లేవు.