రారండోయ్‌ | This Week Literature Events In Hyderabad | Sakshi
Sakshi News home page

రారండోయ్‌

Published Mon, Feb 3 2020 1:30 AM | Last Updated on Mon, Feb 3 2020 1:32 AM

This Week Literature Events In Hyderabad - Sakshi

రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారాన్ని అద్వంద్వం కవితాసంపుటికిగానూ శ్రీరామ్‌కు ఫిబ్రవరి 9న ఉదయం 10 గంటలకు సిరిసిల్లలోని రంగినేని ట్రస్టులో ప్రదానం చేయనున్నారు. దేశపతి శ్రీనివాస్, జూకంటి జగన్నాథం, జిందం కళాచక్రపాణి, రంగినేని మోహన్‌రావు, మద్దికుంట లక్ష్మణ్, పత్తిపాక మోహన్, నాగిళ్ల రమేశ్‌ పాల్గొంటారు.

నోరి నరసింహ శాస్త్రి 121వ జయంతి ఉత్సవం ఫిబ్రవరి 6న సా. 6 గంటలకు హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో జరగనుంది. ఇందులో– నోరి పురస్కారాన్ని అక్కిరాజు సుందరరామకృష్ణకూ, నోరి యువరచయిత ప్రోత్సాహక పురస్కారాన్ని గౌరీభట్ల రుక్మిణీ బాలముకుంద శర్మకూ ప్రదానం చేస్తారు. నిర్వహణ: నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్‌ ట్రస్ట్, నాచారం, హైదరాబాద్‌.

జానుడి– సెంటర్‌ ఫర్‌ లిటరేచర్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న ఒంగోలులోని డాక్టర్‌ మల్లవరపు రాజేశ్వరరావు భవన్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు ఇటీవల వచ్చిన 12 కవితా సంపుటాల పరిచయ సభ జరగనుంది.

దాట్ల దేవదానం రాజు రచనల– ‘మధు హాసం’, ‘చైనా యానం’– ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 8న సాయంత్రం 5 గంటలకు కాకినాడలోని గాంధీ భవన్‌లో జరగనుంది. పి.చిరంజీవినీ కుమారి, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, మధునాపంతుల మూర్తి, రెంటాల శ్రీవెంకటేశ్వరరావు, కె.శైలజ, మధునామూర్తి పాల్గొంటారు. నిర్వహణ: ఆంధ్రీకుటీరం, స్ఫూర్తి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement