వాల్వులోప్లాస్టీ అంటే ఏమిటి? | What is valvuloplasty? | Sakshi
Sakshi News home page

వాల్వులోప్లాస్టీ అంటే ఏమిటి?

Published Sun, Nov 1 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

What is valvuloplasty?

పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా పాప వయసు ఏడేళ్లు. ఎప్పుడూ దాహం అంటూ ఉంటే తరచూ నీళ్లు తాగించేవాళ్లం. చర్మంపై కూడా ర్యాష్ వచ్చింది. పాప కంప్లెయింట్‌ను మా డాక్టర్ గారికి చెబితే ఆయనకు అనుమానం వచ్చి షుగర్ టెస్ట్ చేయించారు.  పాపకు డయాబెటిస్ అని చెప్పారు. ఇంత చిన్నపిల్లల్లోనూ డయాబెటిస్ వస్తుందా? దయచేసి మా పాప విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
 - సువర్చల, విజయవాడ

 
మీ పాప కండిషన్‌ను జ్యూవెనైల్ డయాబెటీస్ అంటారు. దీన్నే టైప్ వన్ డయాబెటీస్ అని కూడా అంటారు. ఇది నెలల పిల్లలకూ రావచ్చు. డయాబెటిస్ రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో జన్యుపరంగా సంక్రమించడం ఒక కారణం. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అంతవూత్రాన ఆందోళనపడాల్సిందేమీ లేదు. వీళ్లలో చక్కెర నియుంత్రణ చేస్తూ ఉంటే మిగతా అందరు సాధారణమైన పిల్లల్లాగానే వీళ్లూ పెరిగి తవు ప్రతిభాపాటవాలు చూపుతారు. ఇలాంటి పిల్లల్లో మందుల ద్వారా, ఆహారం ద్వారా డయూబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. పిల్లల్లోనే ఇలా డయూబెటిస్ రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు... కొన్ని రసాయునాలు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు కారణం అవుతాయి. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్ వాడటం తప్పనిసరి.
 
ఈ పిల్లల చేత క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్‌లు చేయించడం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయుడం కూడా అవసరం. డయాబెటీస్ ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయూలు నేర్చుకొని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. డయూబెటిక్స్ ఉన్న పిల్లలయితే వాళ్లలో సాధారణంగా బరువు పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచూ వాంతులు కావడం, డీ-హైడ్రేషన్, చర్మంపై రాషెస్ వంటివి లక్షణాలు కనిపిస్తాయి.

ఇలాంటి పిల్లల్లో చక్కెర నియుంత్రణ లేకపోతే పోను పోనూ రక్తపోటు పెరగడం, మూత్రపిండాల సమస్యలు. కంటికి సంబంధించిన రుగ్మతలు, కరోనరీ గుండె సవుస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా అవేవీ రాకుండా జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా కాకుండా నోటి ద్వారా లేదా ఇన్‌హెలేషన్ (పీల్చడం) ద్వారా ఇచ్చే ప్రక్రియులు అందుబాటులోకి రాబోతున్నాయి. పాంక్రియాటిక్ సెల్స్ (ఇన్సులిన్ తయారు చేసే కణాల) మార్పిడి శస్త్రచికిత్స కూడా పరిశోధన దశలో ఉంది. అలాంటి చికిత్స వూర్గాలు అందుబాటులోకి వస్తే ఈ పిల్లలకు చికిత్స ప్రక్రియులు వురింత సులువవుతాయి. మీరు పీడియూట్రిషియున్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం తప్పనిసరి.
 
- డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్

 
కార్డియాలజీ కౌన్సెలింగ్

నా వయసు 68. ఇప్పటివరకూఎలాంటి ఆరోగ్య సమస్యా లేదు. ఇటీవలే అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో డాక్టర్‌ను కలిశాను. ఆయన పరీక్షలు చేయించి, నాకు వాల్వులోప్లాస్టీ చికిత్స అవసరమని అన్నారు. వాల్వులోప్లాస్టీ అంటే ఏమిటో దయచేసి వివరించండి.
 - నాగేంద్రరావు, వినుకొండ

 
గుండె కవాటాలను సరిచేయడానికి చేసే చికిత్సను వాల్వులోప్లాస్టీ అంటారు. ఎడమపక్కన ఉన్న మైట్రల్ వాల్వ్ మూసుకుపోయినప్పుడు, దాన్ని బెలూన్ సహాయంతో వెడల్పు చేస్తారు. దీన్ని పీబీఎంఏ అంటారు. ఇక పల్మునరీ వాల్వులోప్లాస్టీలో గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనికి ఉన్న కవాటం అయిన పల్మునరీ వాల్వు మూసుకుపోతే... దాన్ని బెలూన్ ద్వారా తెరుస్తారు. దీన్ని పీబీపీఏ అంటారు.

ఈలోపం సాధారణంగా చిన్న వయసులో వచ్చేది కాబట్టి చిన్న వయసులోనే సరిచేయవచ్చు. గుండె నుంచి రక్తాన్ని శరీరానికి తీసుకెళ్లే ధమని కవాటాన్ని అయోర్టిక్ కవాటం అంటారు. ఇది మూసుకుపోయినప్పుడు పీబీఏవీ ప్రక్రియ ద్వారా సరిచేయవచ్చు. ఇక ట్రైకస్పిడ్ అనే కవాటం మూసుకుపోయినప్పుడు బెలూన్ సహాయంతో తెరవడాన్ని పీబీటీఏ అంటారు. ఇలా ఈ ప్రక్రియలతో కవాటాలను తెరుస్తూ చేసే చికిత్సతో మీలాంటి రోగుల ఇబ్బందులను దూరం చేయవచ్చు.
 
మా బాబు వయసు ఏడేళ్లు. పుట్టినప్పుడు అంతా మామూలుగానే ఉన్నాడు. కానీ... ఈమధ్య తరచుగా దగ్గు, జలుబు వస్తోంది. రెండువారాల క్రితం మాకు దగ్గరలోని ఒక డాక్టర్ పరీక్షించి గుండెజబ్బు ఉండవచ్చని చెప్పారు. అప్పటినుంచి మాకు ఆందోళనగా ఉంది. మా అబ్బాయి విషయంలో ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి.
 - దీపక్, విజయనగరం

 
మీరు చెప్పినదాన్ని బట్టి మీ బాబుకు పుట్టుకతో వచ్చే గుండెజబ్బు... అంటే గుండెలో రంధ్రం (ఏఎస్‌డీ లేదా వీఎస్‌డీ) ఏర్పడి ఉండవచ్చునని అనిపిస్తోంది. కానీ మీ బాబు విషయంలో మంచిని సూచించే విషయం ఏమిటంటే... ఇప్పటికవరకు మీ బాబు మామూలుగానే ఉన్నాడు. కాబట్టి ఆ రంధ్రం చాలా చిన్నదై ఉండే అవకాశం ఉంది. ఇటువంటి వారికి ఈమధ్య వచ్చిన ఆధునిక టెక్నాలజీ సహకారంతో ఏ ఆపరేషన్ లేకుండానే ‘డివైజ్ క్లోజర్’ అనే ప్రక్రియ ద్వారా పూర్తిగా నార్మల్‌గా అయ్యేలా చేయవచ్చు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు ఆందోళన వీడి, ఇంకా కాలయాపన చేయకుండా వెంటనే మీకు దగ్గరలో గుండె వ్యాధులకు అడ్వాన్స్‌డ్ చికిత్సలు లభ్యమయ్యే సెంటర్‌లో మీ బాబును చూపించండి.

- డాక్టర్ అనూజ్ కపాడియా
 సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్

 

డర్మటాలజీ కౌన్సెలింగ్

నా వయసు 62 ఏళ్లు. గృహిణిని. నా కాళ్లు ఎప్పుడూ తడిలోనే ఉంటుంటాయి. శాండల్స్ కూడా వేసుకోను. ఈమధ్య నా కాలి వేళ్ల మధ్యన చర్మం చెడినట్లుగా అవుతోంది. చూడటానికి ఎర్రగా, ముట్టుకుంటే మంటగా అనిపిస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
 - అనసూయ, నెల్లూరు

 
మీరు చెబుతున్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. నీళ్లలో ఎక్కువగా ఉండేవారు, నిత్యం నీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండేవారికి ఇది ఎక్కువగా వస్తుంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘క్యాండిడియాసిస్’ అంటారు. మీ సమస్యను దూరం చేసుకోవడం కోసం మీరు ‘టెర్బినఫైన్’ అనే మందు ఉన్న క్రీమును ప్రతిరోజూ ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి చొప్పున నాలుగు వారాల పాటు రాసుకోవాలి. అలాగే ఇట్రకొనజోల్ 100 ఎంజీ అనే ట్లాబ్లెట్‌ను పొద్దునే టిఫిన్ అయ్యాక వేసుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది కొన్నాళ్ల పాటు మీరు తడిలో, తేమ ఉన్న చోట కాలు పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదా అలాంటిచోట్ల తిరగాల్సి వస్తే కాలికి తడి అంటకుండా స్లిప్పర్లు వేసుకొని తిరగండి.
 
నా వయసు 27 ఏళ్లు. ఇంత చిన్న వయసులోనే నా తలవెంట్రుకలు రాలిపోవడం గమనించాను. ఇది ఇలాగే కొనసాగితే ఇప్పుడే బట్టతల వస్తుంది. నేను ఆత్మన్యూనతకు గురవుతున్నాను. నా బట్టతలకు చికిత్స విషయంలో చేయాలో
 - కిరణ్, కొత్తపేట
 

మీ జట్టు రాలిపోతుందంటే బహుశా మీ జన్యువుల ప్రభావమే కారణం కావచ్చు. ఇటీవల పురుషుల్లో వచ్చే బట్టతలకు ఫెనస్టెరైడ్ మినాక్సిడిల్, పీఆర్‌పీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ పూర్తి మెడికల్ హిస్టరీని అధ్యయనం చేసి, మీ బట్టతలకు ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఆ తర్వాతనే పైన పేర్కొన్న మందులను తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. మీరు దగ్గరలోని అనుభవజ్ఞులైన డర్మటాలజిస్టును కలవండి.
 
- డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement