మహిళలు... మణిపూసలు..! | Women ....bead | Sakshi
Sakshi News home page

మహిళలు... మణిపూసలు..!

Published Tue, Aug 12 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

Women ....bead

అహల్యాబాయ్ మహారాష్ట్ర సైన్యానికి సారథ్యం వహించి మహిళలను సంఘటితం చేసింది. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆంధ్ర మహిళాసభను స్థాపించి, పిల్లలందరూ ఉచితంగా చదువుకోవడానికి, స్త్రీవిద్యకు ఎంతగానో కృషి చేసింది. సుచేతా కృపలానీ, కస్తూర్బాగాంధీ, విజయలక్ష్మీ పండిట్... వంటివారంతా స్వాతంత్య్రోద్యమ సమయంలో స్త్రీలందరినీ సంఘటితం చేశారు. అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించి ఆధ్యాత్మికతను ప్రజలలోకి తీసుకువెళ్లడానికి ఒక ఉద్యమం నడిపింది. గుంటూరులో శారదానికేతన్ స్థాపించిన లక్ష్మీబాయమ్మ స్త్రీవిద్యకు తోడ్పడింది. ఇలా చెప్పుకుంటే చరిత్ర పుటల్లో ఎందరో మణిపూసల్లాంటి ఎందరో గొప్ప మహిళలు. వారిలో కొందరిని స్వాతంత్య్ర దినం దగ్గరపడుతున్న సందర్భంలో ఓసారి గుర్తు చేసుకుందాం!    
 
రాణీ లక్ష్మీబాయిhttp://img.sakshi.net/images/cms/2014-08/51407867621_Unknown.jpg

ఈమె ఝాన్సీలక్ష్మీబాయిగా, రాణీ ఆఫ్ ఝాన్సీగా అందరికీ పరిచితులు. పురుష వేషం ధరించి సైన్యాన్ని ముందుకు నడిపింది. తుది శ్వాస వరకు పోరాడింది, నిజమైన వీరురాలిగా యుద్ధభూమిలో మరణించింది. సంప్రదాయమైన విద్య మాత్రమే కాకుండా, విలు విద్య, గుర్రపు స్వారీ, ఆత్మరక్షణ వంటివి నేర్చుకుంది. తను నమ్మిన సిద్ధాంతం కోసం ఇవి ఉపయోగపడ్డాయని ఆవిడ నమ్మకం.
 
సరోజినీనాయుడుhttp://img.sakshi.net/images/cms/2014-08/81407867342_Unknown.jpg

భారతకోకిల సరోజినీనాయుడు భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారు.  తన వాగ్ధాటితో ఎందరో దేశాభిమానులను ఉద్యమానికి అండగా నిలబడమని ఉత్తేజపరిచారు. పన్నెండేళ్లకే మెట్రిక్ పరీక్షలో ప్రథమంగా నిలిచారు. ఆ తరువాత తన చదువును లండన్‌లో కొనసాగించారు. ఆమెకు పలు భాషలలో ఉన్న ప్రావీణ్యత కారణంగానే గొప్ప కవయిత్రి, వక్త, రచయిత్రిగా పేరుప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా గవర్నరుగా కూడా తన ప్రతిభ చాటారు.
 
మేడమ్ భికాజీ కామా
http://img.sakshi.net/images/cms/2014-08/51407867539_Unknown.jpg

భారతదేశ స్వాతంత్య్రం కోసం జెండా పట్టుకుని ఐరోపా పర్యటించినందుకుగాను మేడమ్ కామాకు మనమంతా ఋణపడి ఉండాలి. అలెగ్జాండ్రా నేటివ్ గర్ల్స్ ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువు పూర్తి చేసుకున్నాక, మేడమ్ భికాజీ వివాహం చేసుకున్నారు. అయితే ప్లేగు వ్యాధిగ్రస్తులకి సేవ చేస్తూ తాను కూడా ఆ వ్యాధికి గురి కావడంతో  వైవాహిక జీవితం దెబ్బతింది. చికిత్సకోసం ఐరోపా వెళ్లారు. వ్యాధి తగ్గిన తర్వాత స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ఐరోపా నుంచే నేషనలిస్ట్ డాక్యుమెంట్లు అనువాదం చేసి పంపుతూ భారతీయులను ఉత్తేజపరిచారు. జాతీయపతాక రూపకల్పనలో కృషి చేశారు.
 
అరుణా అసఫ్ అలీ
http://img.sakshi.net/images/cms/2014-08/61407867274_Unknown.jpg

‘ద గ్రాండ్ లేడీ ఆఫ్ ఇండియా’ గా ప్రఖ్యాతి చెందిన అరుణా అసఫ్ అలీ, ఎన్నో ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ, క్విట్‌ఇండియా ఉద్యమంలోనూ తన వంతు సేవలు చురుకుగా అందించారు. రాజకీయ ఖైదీగా తీహార్ జైల్‌లో జీవితం గడిపారు. క్విట్ ఇండియా ఉద్యమంలో  అజ్ఞాతంగా పాల్గొన్న అరుణా... కారాగారం నుంచి విడుదలైన తర్వాత, క్విట్‌ఇండియా ఉద్యమం నుంచి తప్పుకున్నారు. చదువులో ముందంజలో ఉంటూ అందరి ప్రశంసలు అందుకున్నారు. డిగ్రీ పూర్తయ్యాక, తను ముందుండి పదిమందిని ముందుకు నడిపించడానికి,  కలకత్తాలోని గోఖలే మెమోరియల్ స్కూల్‌లో టీచరుగా తన జీవితాన్ని అంకితం చేశారు. జీవించినప్పుడు పద్మవిభూషణ అవార్డు, మరణానంతరం భారతరత్న అవార్డులు ఆమెను వరించాయి.
 
సుచేతా కృపలానీhttp://img.sakshi.net/images/cms/2014-08/71407867197_Unknown.jpg

భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీ, సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆమె విద్యాభ్యాసం గడిచింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ హిస్టరీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. రాజ్యాంగ సంబంధిత అంశాలలో ఉన్న పరిజ్ఞానంతో చట్టాలు, విధానాల గురించి సమగ్రంగా తెలుసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటూ, దేశం కోసం పోరాడటం ప్రారంభించారు.  భారత రాజ్యాంగ నిర్మాణంలో సైతం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement