ఈ వారం యూట్యుబ్ హిట్స్‌ | youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యుబ్ హిట్స్‌

Published Sun, Jan 29 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

ఈ వారం యూట్యుబ్ హిట్స్‌

ఈ వారం యూట్యుబ్ హిట్స్‌

నీతో ప్రేమలో పడిపోతా.. ఏమనుకుంటున్నావో!
కమాండో 2 : ట్రైలర్‌
నిడివి :2 ని. 34 సె.
హిట్స్‌ : 91,45,132

‘ఇంకోసారి ఇలా చేశావా.. నీతో నేను పిచ్చిగా ప్రేమలో పడిపోతాను జాగ్రత్త. అంతేకాదు, నీ పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాను. ఏమనుకుంటున్నావో’ : అమ్మాయి!ఒరేయ్‌ హీరో ఏం చేశావురా అంత పెద్ద తప్పు?!ఆ పిల్ల ఆదాశర్మ. వాడు విద్యుత్‌ జమాల్‌. చిత్రం కమాండో 2. చిత్రం మార్చి 3న విడుదలౌతోంది.ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌ బ్లాక్‌ మనీ ఏజెంట్‌ విక్కీ చడ్డా మలేసియాలో అరెస్ట్‌ అవుతాడు. అతడి భార్యతో సహా మలేసియన్‌ అధికారి ఇంట్లో సేఫ్‌గా ఉంటాడు. అతడిని ఇండియా తెచ్చేందుకు ఒక టీమ్‌ మలేసియా బయల్దేరి వెళుతుంది. ఆ టీమ్‌ బయటి హీరో విద్యుత్‌ జమాల్‌. ఆ టీమ్‌లోని హీరోయిన్‌ ఆదా శర్మ. వీళ్లిద్దరి వేట, వీళ్లిద్దరి సయ్యాట.. చిత్రంలో ఇంట్రెస్టింగ్‌ పార్ట్‌. ఇంతకీ జమాల్‌ ఏం చేశాడు. భావనారెడ్డి (ఆదాశర్మ) ఎందుకు ఢమాల్‌ అంది! వీడియోలో తెలీదు. సినిమాలో చూడాల్సిందే.

బేబీ బేబీ..
ఐ ఫీల్‌ క్రేజీ.. జైన్‌ మాలిక్, టేలర్‌ స్విఫ్ట్‌

జైన్‌ మాలిక్, టైలర్‌ స్విఫ్ట్‌ – ఐ డోన్ట్‌ వాన్నా లివ్‌ ఫరెవర్‌
నిడివి : 4 ని. 16 సె. హిట్స్‌ : 1,30,94,908

బ్రిటన్‌ అబ్బాయి జైన్‌ మాలిక్, అమెరికన్‌ అమ్మాయి టేలర్‌ స్విఫ్ట్‌ కలిసి పాడిన తాజా మెలోడియస్‌ సెన్సేషన్‌ ‘ఐ డోన్ట్‌ వాన్నా లివ్‌ ఫరెవర్‌’ (ఫిఫ్టీ షేడ్స్‌ డార్కర్‌). ‘మూసి ఉన్న నాలుగ్గోడల నడుమ కళ్లింత చేసుకుని నీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా. ఏ ఆశా లేని నిర్దాక్షిణ్య జీవితం ఇది..’ అంటూ సాంగ్‌ మొదలౌతుంది. ‘నువ్వొచ్చే వరకు నీ పేరునే పలవరిస్తూ కూర్చుంటాను... నువ్వు రావు.. నాకు పిచ్చిపట్టిపోతుంది. నువ్వే జీవితం అనుకున్న నేను, నీ నిర్లక్ష్యం వల్ల.. జీవించాలని కోరుకోవడం లేదు.. బేబీ బేబీ, ఐ ఫీల్‌ క్రేజీ, అప్‌ ఆల్‌ నైట్, ఆల్‌ నైట్‌ అండ్‌ ఎవ్రీ డే’ అని ప్రియుడు ఆవేదన చెందుతాడు. ‘ఐ జస్ట్‌ వాన్నా కీప్‌ కాలింగ్‌ యువర్‌ నేమ్‌ అంటిల్‌ యూ కమ్‌ బ్యాక్‌ హోమ్‌’ అంటూ సోలిపోతాడు. ప్ఛ్‌.. పాపం అనిపిస్తుంది ఈ అబ్బాయిని చూస్తే. అమ్మాయిది కూడా ఇదే బాధ. సమాంతర చరణాలలో. ఒకరికోసం ఒకరు తపించిపోతుంటారు. ఒకరి ఎడబాటును ఒకరు తట్టుకోలేకపోతుంటారు. వెరీ హార్ట్‌ టచింగ్‌.

ఫ్రీ పీజా, బీర్‌..
ఓ.. మై వైట్‌ హౌస్‌!

బౌలింగ్‌ ఇన్‌ ది వైట్‌ హౌస్‌ బేస్‌మెంట్‌
నిడివి : 5 ని. 48 సె.
హిట్స్‌: 12,44,143

వైట్‌ హౌస్‌లో ఉద్యోగం అంటే.. ప్రతి ఒక్కరు అక్కడ ఒక అమెరికన్‌ ప్రెసిడెంట్‌ అన్నంత హోదా ఉంటుంది. ఆ రిచ్‌నెస్, ఆ సౌకర్యాలు, రిఫ్రెష్‌మెంట్స్, ఫ్రీ పీజా, బీర్‌.. ఓహ్‌! ఇవన్నీ లోపలి వాళ్లు్ల వచ్చి బయటికి చెప్తే తప్ప ఆ వైభోగం గురించి బయటి ప్రపంచానికి తెలియదు. అయితే కేసీ నైస్టాట్‌ అనే యువకుడు కళ్లారా వాటన్నిటినీ తిలకించి వచ్చాడు.  వైట్‌ హౌస్‌ బేస్‌మెంట్‌లోకి వెళ్లడం కోసం 2011 నుంచి అతడు ట్రై చేస్తున్నాడట. వైట్‌హౌస్‌లో పని చేస్తున్న ఒక ఉద్యోగిని పట్టుకుని, అతడి నుంచి అపాయింట్‌మెంట్‌ సంపాదించి, ఎవరికీ అనుమానం రాకుండా బేస్‌మెంట్‌లో అన్నీ తిరిగేసి, సక్సెస్‌ఫుల్‌గా ఒక షాట్‌ బౌలింగ్‌ కూడా ఆడేసి, వాటన్నిటినీ తన కెమెరాలో షూట్‌ చేయించుకుని (కొన్ని తను షూట్‌ చేశాడు. తనని వేరొకరిచేత షూట్‌ చేయించుకున్నాడు).. ఈ వీడియోను.. ఐదేళ్ల తర్వాత, ఇప్పుడు.. కొన్ని గంటలక్రితమే యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement