ఈ వారం యూట్యూబ్ హిట్స్ | YouTube hits this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్

Published Sun, Nov 8 2015 11:28 PM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

ఈ వారం యూట్యూబ్ హిట్స్

ఈ వారం యూట్యూబ్ హిట్స్

ఎమిరేట్స్ : హలో జెట్‌మ్యాన్
నిడివి : 1 ని. 39 సె.
హిట్స్ : 92,60,517

 
విమానం లోపల ప్రయాణించడం అనే మాటను మర్చిపోండి. ఇద్దరు డేర్ డెవిల్ జెట్‌మెన్ రోసీ, రెఫెట్ విమానం బయట, విమానంతో పాటు గంటకు 120 మైళ్ల వేగంతో ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్యాసింజర్ ఎయిర్ బస్ ఎ380కు బయట ప్రయాణించారు. ఈ ‘బయట’ అనే కాన్సెప్ట్ అర్థం కావాలంటే తక్షణం మీరు ఈ వీడియో వీక్షించాల్సిందే. భూమికి నాలుగు వేల అడుగుల ఎత్తులో దుబాయ్ గగనతలంపై వీరు చేసిన విన్యాస్యాలు నిజానికైతే ఒళ్లు గగుర్పొడిచేలా ఉండాలి. కానీ ఎంతో ఆహ్లాదభరితంగా జెట్‌ప్లేన్‌లకు తమను తాము కట్టేసుకుని వీళ్లిద్దరూ ఎయిర్‌బస్ చుట్టూ చక్కర్లు కొట్టేశారు!
 
వార్‌క్రాఫ్ట్ : ట్రైలర్
నిడివి : 2 ని. 13 సె.
హిట్స్ : 46,73,210

వార్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ ఆధారంగా డంకన్ జోన్స్ డెరైక్ట్ చేసిన హాలీవుడ్ చిత్రం ‘వార్‌క్రాఫ్ట్:     ది బిగినింగ్’ అఫిషియల్ ట్రైలర్ మూడు రోజుల క్రితమే విడుదలైంది. ‘అజెరాత్’ అనే కాల్పనిక ప్రపంచంలో మానవులు, మరుగుజ్జులు, స్నేహపాత్రమైన భూతాలు, వింత జీవుల మధ్య జరిగే అమెరికన్ ఇతిహాస యుద్ధాలు ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణ. సినిమాలో ఉన్న దమ్మంతా ఈ చిన్ని ట్రైలర్‌లో కనిపిస్తుంది! అంత చక్కగా ఎడిట్ చేసి అప్‌లోడ్ చేశారు. లెజెండరీ పిక్చర్స్, బిజార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా తీసిన వార్‌క్రాఫ్ట్: ది బిగినింగ్ 2016 జూన్ 10న రిలీజ్ అవుతోంది.
 
కుంగ్ ఫు పాండా 3 : ట్రైలర్
నిడివి : 2 ని. 54 సె.
హిట్స్ : 37,31,134

అమెరికన్లు, చైనీస్ కలిసి తీస్తున్న కంప్యూటర్ ఏనిమేటెడ్ యాక్షన్ కామెడీ మార్షల్ ఆర్ట్స్ మూవీ ‘కుంగ్ ఫూ పాండా 3’ అఫిషియల్ ట్రైలర్ ఇది. యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ అయ్యీకాగానే హిట్లు లక్షల్లోకి చేరుకున్నాయి! 2011లో వచ్చిన కుంగ్ ఫూ పాండా 2 కి ఇది సీక్వెల్. దీర్ఘకాలం తర్వాత తన తండ్రిని కలుసుకున్న ‘పో’... విలన్ ‘కాయ్’ ని ఓడించడంలో తండ్రికి హెల్ప్ చెయ్యడం కోసం తన గ్రామంలోని పాడాలకు యుద్ధవిద్యల్లో శిక్షణ ఇస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే అనుభవాల హాస్య సన్నివేశాలు, ఉద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కట్టిపడేస్తాయి. చిత్రం విడుదల జనవరి 29.
 
జాన్ లీవైజ్ : మ్యాన్ ఆన్ ది మూన్
నిడివి : 2 ని. 10 సె.
హిట్స్ : 60,47,629

బ్రిటన్‌లోని ప్రముఖ డిపార్ట్‌మెంటల్ స్టోర్స్ జాన్ లీవైజ్... క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రూపొందించిన     ఈ ‘మ్యాన్ ఆన్ ది మూన్’ అనే వాణిజ్య ప్రకటన పిల్లల్ని, పెద్దల్ని బాగా ఆకట్టుకుంటోంది. చంద్రుడిపై నివాసం ఉన్న ఒక ఒంటరి వృద్ధుడు సేవా కార్యక్రమాల కోసం వేలాది పౌండ్ల విరాళాలను సేకరించడం థీమ్. ఇంట్లోని టెలిస్కోప్ ద్వారా వృద్ధుడి గురించి తెలుసుకున్న లిల్లీ అనే ఆరేళ్ల చిన్నారి ఆయనకు భూమి మీద నుంచి తన వంతుగా ఓ కానుకను పంపిస్తుంది. ‘మీ గురించి ఆలోచించడానికి కింద మేమొకళ్లం ఉన్నాం’ అన్న సందేశం ఆ కానుకలో ఉంటుంది.
 
ఫాన్స్ : టీజర్ 2
నిడివి : 2 ని. 37 సె.
హిట్స్ : 38,94,343

మనీష్ శర్మ డెరైక్ట్ చేస్తున్న థ్రిల్లర్ మూవీ ‘ఫ్యాన్’ రెండో టీజర్ ఇది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ (వై.ఆర్.ఎఫ్.) బ్యానర్‌పై.. వచ్చే ఏడాది ఏప్రిల్ 15న విడుదలకు సిద్ధం అవుతున్న ‘ఫ్యాన్’లో షారుక్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండో టీజర్‌ను షారుక్ 50వ జన్మదినం సందర్భంగా నవంబర్ 2న వై.ఆర్.ఎఫ్. విడుదల చేసింది. ‘కనెక్షన్ ఈజ్ ఎ స్ట్రేంజ్ థింగ్. డోన్ట్ ఆస్క్ హౌ ఇట్ వర్క్స్’ అంటూ టీజర్ మొదలవుతుంది. ముంబై, క్రొయేషియా, లండన్, ఢిల్లీ నగరాలలో ‘ఫ్యాన్’ చిత్రీకరణ జరిగింది. ఇందులో షారుక్ అభిమానిగా షారుక్కే కనిపిస్తాడు.
 
ఆజ్ ఉన్‌సె మిల్‌నా హై : పి.ఆర్.డి.పి.
 నిడివి : 2 ని. 04 సె.
 హిట్స్ : 19,78,361

 
ప్రేమ్ రతన్ ధన్ పాయో (పి.ఆర్.డి.పి.)లోని స్వీట్‌బాక్స్ లాంటి ఒక వీడియో సాంగ్ ‘ఆజ్ ఉన్‌సె మిల్‌నా హై’. ఐదు రోజుల క్రితమే టి-సీరీస్ దీనిని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసింది. సల్మాన్‌ఖాన్, సోనమ్ కపూర్ మధ్య సాగే ఈ పాటలో తాజా కూరగాయలతో పాటు, స్వీట్స్, స్నాక్స్ మధ్య వారిద్దరూ చిరునవ్వుల్ని ఇచ్చిపుచ్చుకుంటారు. పాట పాడింది షాన్ , ఆయన బృందం. పాట రాసింది ఇర్షన్ కమిల్. సంగీతం హిమేశ్ రిషామియా. సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 12న విడుదల అవుతోంది. సేవాభావం. పదిమందికి మంచి చేయడం అన్నది కథాంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement