సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పది కోట్ల మంది ప్రజలు అధిక ఫ్లోరైడ్‌తో కూడిన నీటిని తాగుతున్నారని స్వయంగా ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 12,577 జనావాసాల్లో దాదాపు 10.06 కోట్ల మంది కలుషిత నీటి బారినపడుతున్నారని పేర్కొంది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో నీటి కల్తీని నివారించేందుకు నీటి శుద్ధి కేంద్రాలకు నీతిఆయోగ్ సిఫార్సు మేరకు రూ. 800 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం తెలిపింది.
పశ్చిమ బెంగాల్, రాజస్ధాన్‌లోని మారుమూల ప్రాంతాల్లో పైప్‌లైన్ల ద్వారా రక్షిత మంచినీటి కోసం మరో రూ. 100 కోట్లు కేటాయించామని తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. నాలుగేళ్ల వ్యవధిలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలన్నింటికీ రక్షిత మంచినీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జాతీయ నీటి నాణ్యతా మిషన్‌ను ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment