
కళకు రూపం
సిటీలో చెట్లు నరికేస్తున్నారు. బిల్డింగ్‌లు, షాపింగ్ మాల్స్, ఫ్లైఓవర్లు... ఇష్టారాజ్యంగా కడుతున్నారు. ఫలితంగా కాలుష్యం పెరిగిపోతోంది. గ్లోబల్ వార్మింగ్‌కు దారితీస్తోంది.
సిటీలో చెట్లు నరికేస్తున్నారు. బిల్డింగ్‌లు, షాపింగ్ మాల్స్, ఫ్లైఓవర్లు... ఇష్టారాజ్యంగా కడుతున్నారు. ఫలితంగా కాలుష్యం పెరిగిపోతోంది. గ్లోబల్ వార్మింగ్‌కు దారితీస్తోంది. దీనిపై నగరవాసులకు అవగాహన కల్పించేందుకు బిల్డింగ్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, రోడ్లపై నడుచుకుంటూ వెళుతున్న ప్రజలను నలుపు, తెలుపు రంగుల్లో రూపమిచ్చారు యువ ఆర్టిస్టు వైశాలి. పల్లెటూరు నుంచి పట్నం వచ్చిన బ్యాచిలర్ కష్టాలు ప్రతిబించేలా కాన్వాస్‌పై చక్కని రూపమిచ్చారు ఆంజనేయులు. ఆటో మొబైల్ పార్ట్‌లు ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంటాయి.
ఇలాంటి రిలేషన్స్ మానవుల్లోనూ ఉంటాయనే స్పష్టమైన సంకేతాన్ని చిత్రంగా మలిచారు కిరణ్‌కుమార్. ఔత్సాహిక, సీనియర్ ఆర్టిస్టులు, ఫొటోగ్రాఫర్ల విభిన్న థీమ్‌లకు వేదికైంది బాగ్‌లింగంపల్లిలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో గురువారం ప్రారంభమైన ‘రీ కలెక్షన్స్’ ఎగ్జిబిషన్. తెలంగాణ పల్లెల్లోని జీవిన విధానాన్ని కళ్లకు కట్టిన చిత్రాలు అలరించాయి. ఈ ప్రదర్శన ఈ నెల 21 వరకు కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు. ఈ గ్యాలరీలోనే షోల నుంచి సేకరించిన 20 మంది ఆర్టిస్టుల చిత్రాలను ఈ ‘రీ కలెక్షన్స్’లో ఉంచామని గ్యాలరీ నిర్వాహకుడు విజయ్‌రావ్ వెల్లడించారు.
సాక్షి, సిటీప్లస్