2099కే మలేషియా నుంచి హైదరాబాద్ టికెట్! | AirAsia to Fly Hyderabad to Malaysia Soon | Sakshi
Sakshi News home page

2099కే మలేషియా నుంచి హైదరాబాద్ టికెట్!

Published Tue, Sep 30 2014 2:21 PM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

2099కే మలేషియా నుంచి హైదరాబాద్ టికెట్! - Sakshi

2099కే మలేషియా నుంచి హైదరాబాద్ టికెట్!

విమానాలనే కాదు, విమాన టికెట్ల ధరలను కూడా ఆకాశం నుంచి భూమ్మీదకు దించిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా. త్వరలోనే ఈ సంస్థ హైదరాబాద్ నుంచి కూడా తన సేవలను ప్రారంభించబోతోంది. వారంలో అన్ని రోజులూ హైదరాబాద్ నుంచి మలేషియాకు విమానాలు నడిపించనుంది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్కు డిసెంబర్ 8వ తేదీ నుంచి ఎయిర్ ఏషియా మలేషియా సేవలు ప్రారంభం అవుతాయని ఆ సంస్థ గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

దీని ప్రారంభ ఆఫర్లో.. మొత్తం అన్ని పన్నులు కలుపుకొని కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్కు కేవలం రూ. 2099కే టికెట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ కింద అక్టోబర్ 5వ తేదీలోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. డిసెంబర్ 8వ తేదీ నుంచి 2015 అక్టోబర్  24వ తేదీ వరకు ప్రయాణాలు చేయొచ్చు. ప్రస్తుతానికి కేవలం బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, కోల్కతా, తిరుచిరాపల్లి నగరాల నుంచి మాత్రమే ఎయిర్ ఏషియా విమానాలు నడుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement