
‘బిగ్’ న్యూస్!
టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్ మాంచి మాస్ మసాల సినిమాను మించి జనాన్ని ఊపేస్తోంది. ‘రియాల్టీ’ షోలో ‘రియల్’గా పాత్రలు పోషించేస్తున్నారు. చాలా రోజులుగా యమ కిక్కిస్తున్న గౌతమ్ గులాటీ, దియాంద్రా సోర్స్‌ల లవ్ అఫైర్ కొత్త టర్న్ తీసుకుంది.
షోలో ఇద్దరూ ఒక్కటిగా బతికేస్తున్నారంటూ కథలు కుప్పలుతెప్పలుగా వస్తున్న క్రమంలోనే... బ్రేకప్ న్యూస్ బ్రేకింగ్‌లా వచ్చేసింది. ఇది అర్థం చేసుకునే లోపే... దియాంద్ర గర్భవతి అయిందన్న వార్త వైరస్‌లా పాకేసింది.
పుట్టబోయే బిడ్డకు తండ్రి గౌతమే అని కొందరు.. అసలు గర్భవతే కాదని ఇంకొందరు... ఎవరికి తోచిన ప్రచారం వారు చేసేస్తున్నారు. అయితే.. కొద్ది రోజులుగా దియాంద్ర ఆరోగ్యం దెబ్బతిందని, వైద్యుడిని సంప్రదించిందని సమాచారం.