
కన్నీటి చిత్రం
కంటతడి పెట్టించే చిత్రాలతో కాన్వాస్ జేవురించింది. సమాజంలో మగువలు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ.. చిత్రాల రూపంలో ఆలోచింపజేసింది. మాదాపూర్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అజయ్ రాథోడ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ శుక్రవారం ప్రారంభమైంది. దీన్ని మిసెస్ సౌత్ ఏసియా ఇంటర్నేషనల్ రుచికాశర్మ, గోథే జంత్రం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అమితా దేశాయ్ ప్రారంభించారు. ఈ నెల 12 వరకూ ప్రదర్శన కొనసాగనుంది.