ఫారిన్ నారి..దేశీ శారీ | foreign ladies are intrested on sarees | Sakshi
Sakshi News home page

ఫారిన్ నారి..దేశీ శారీ

Published Wed, Nov 12 2014 10:34 PM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

ఫారిన్ నారి..దేశీ శారీ - Sakshi

ఫారిన్ నారి..దేశీ శారీ

‘ఐ కాంట్ వేర్ శారీ... ఇట్స్ వెరీ వెరీ హెవీ యు నో...’ అంటూ అచ్చ తెలుగు పడతులు కూడా అరువు లాంగ్వేజ్‌లో దీర్ఘాలు తీస్తుంటే... ‘ఇట్స్ లుకింగ్ గ్రేట్. ఎలిగెంట్. యువార్ సో లక్కీ ఫర్ హేవింగ్ దిస్ వండర్‌ఫుల్ శారీ’ అంటూ మనసారా మన చీరపై  పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు విదేశీ వనితలు. విభిన్న వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాలు చేస్తూ సిటీలో నివసిస్తున్న ఫారిన్ విమెన్ తరచుగా పార్టీల్లో, వేడుకల్లో పాల్గొనేందుకు చీరలకే ప్రాధాన్యమిస్తున్నారు. అలవాటులేని వస్త్రధారణ ఇబ్బందులు కలిగిస్తున్నా..

తట్టుకుంటూనే అందంగా ఆ‘కట్టు’కుంటున్నారు. ‘ఆరు గజాల అద్భుతం’ అంటూ ఎందరో పెద్దలు పొగిడి, ఆడవారిని మరింత అందంగా చూపే చీర విదేశీ మహిళల మనసు దోచుకుంటోంది. నగరానికి చుట్టపు చూపుగా వచ్చి వెరైటీ కోసం ఒకసారి కట్టుకుని వదిలేసే విదేశీయుల గురించి వదిలేస్తే.. ఇక్కడే ఉంటూ సిటీజనుల్లో ఒకరిగా కలసిపోయిన మహిళలు.. ప్రతి ప్రత్యేక సందర్భంలోనూ చీరకట్టుకు ఇస్తున్న ప్రాధాన్యం ఆశ్చర్యం కలిగిస్తోంది.

..:: ఎస్.సత్యబాబు
 
నాట్ ఈజీ.. బట్  క్రేజీ..
మాది వెనిజులా. ఈ సిటీలో రెండున్నరేళ్లుగా ఉంటున్నాం. శారీ కట్టుకోవడం, కట్టుకున్నాక ఇబ్బంది లేకుండా నడవడం అంత ఈజీ కాదు. కాని నాకు శారీస్ అంటే మహా క్రేజ్. అందుకే కష్టమైనా కట్టుకుంటున్నా. నా దగ్గర ఆరు చీరలున్నాయి. అన్నీ డిజైనర్ శారీసే. ‘శారీతో నీ అందం డబుల్ అవుతుంది’ అని మావారు అంటుంటే.. ఐ లైక్ దట్ కాంప్లిమెంట్ సోమచ్.
- గ్లాసీ గ్లేసివెల్
 
ఫస్ట్ టైమ్ కట్టేసినట్టుంది...
మాది రష్యా. టూ ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి. జూబ్లీహిల్స్‌లో మేం ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నాం. శారీ చాలా సార్లు ట్రై చేశా. ప్చ్. కట్టుకోవడం కుదర్లేదు. ఈసారి మాత్రం ఏదో కట్టగలిగా. అయితే కదలడం మాత్రం కాస్త కష్టంగానే ఉంది. చూస్తున్నారుగా ఎంత కేర్‌ఫుల్‌గా నడుస్తున్నానో. ఏమైనా.. సరే శారీని చాలా ఈజీగా హ్యాండిల్ చేయడం వచ్చే వరకూ కడుతూనే ఉంటా. ఎందుకంటే ఐ లైక్ దిస్ గ్రేట్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్.
- అనస్టాసియా

ఓల్ట్ సిటీలో కొంటా..
జాబ్ కోసం అమెరికా నుంచి వచ్చాను. లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. గచ్చిబౌలిలో స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్నప్పుడే శారీ కట్టుకునేదాన్ని. అప్పుడు  మంచి కాంప్లిమెంట్స్ వచ్చేవి. అందుకని కంటిన్యూ చేశా. ఇప్పుడు నా వార్డ్‌రోబ్‌లో 15-20 దాకా శారీస్ ఉంటాయి. సత్యపాల్ శారీస్ నుంచి ఓల్డ్‌సిటీ శారీస్ దాకా ఎక్కడ నచ్చితే అక్కడ కొంటుంటా. అయితే ఇంకా కట్టుకోవడం పూర్తిగా రాలేదు. మా వదిన నాకు హెల్ప్ చేస్తుంటుంది.
-లిసా
 
ఫస్ట్ టైమ్ కట్టేసినట్టుంది...
మాది రష్యా. టూ ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి. జూబ్లీహిల్స్‌లో మేం ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నాం. శారీ చాలా సార్లు ట్రై చేశా. ప్చ్. కట్టుకోవడం కుదర్లేదు. ఈసారి మాత్రం ఏదో కట్టగలిగా. అయితే కదలడం మాత్రం కాస్త కష్టంగానే ఉంది. చూస్తున్నారుగా ఎంత కేర్‌ఫుల్‌గా నడుస్తున్నానో. ఏమైనా.. సరే శారీని చాలా ఈజీగా హ్యాండిల్ చేయడం వచ్చే వరకూ కడుతూనే ఉంటా. ఎందుకంటే ఐ లైక్ దిస్ గ్రేట్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్.
- అనస్టాసియా
 
హబ్బీ చాయిస్...
తాతల కాలం నాడు యూరప్‌లో ఉన్నాం. తర్వాత సౌతాఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చా. ఐదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నా.  శారీస్ అంటే మహా ఇష్టం. యునో.. హైట్‌గా ఉన్నవారికి శారీ అంత బాగా ఇంకేదీ సూట్ కాదు తెలుసా! ఇప్పుడేమిటి? ఎప్పటి నుంచో శారీస్ కట్టుకుంటున్నా. ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ.. ఎక్కడ కొన్నానంటే.. ఎక్కడంటే... ఎస్.. నీరూస్‌లో కొన్నా. నా శారీస్ ఎంపిక ఎక్కువగా మా హస్బెండ్‌దే. ‘యువార్ లుకింగ్ లైక్ ప్రిన్సెస్’ అంటూ ఆయన కాంప్లిమెంట్ ఇవ్వాలంటే నేను శారీ కట్టాల్సిందే. నా దగ్గర పదిహేనుకు పైగా డిఫరెంట్ శారీస్ ఉన్నాయి. కట్టుకోవడానికి.. కట్టే విషయంలో నా స్టైల్ గురు శాంతి  హెల్ప్ చేస్తుంది. ఇంత గొప్ప లుక్ కోసం జస్ట్.. ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేయలేనా?
- లూచెల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement