హైదరాబాద్ ఫుల్ హ్యాపీ | Hyderabad Full Happy | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ఫుల్ హ్యాపీ

Published Mon, Feb 16 2015 1:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

Hyderabad Full Happy

‘ఏబీసీడీలు చెప్పు నాన్న’.. ఓ తల్లి తన గారాలపట్టిని ముద్దుగా అడిగింది. ఆ చిచ్చర పిడుగు వెంటనే డాడీ స్మార్ట్ ఫోన్ తెచ్చేసి అందులో ఆల్ఫాబెట్స్ యాప్ ఓపెన్ చేసి ఏ ఫర్ యాప్.. అని మొదలెట్టేసింది. స్మార్ట్ ఫోన్ల జమనాలో మాటలాడుకోవడానికి వాట్సప్.. పాటలాడుకోవడానికి రాగా, గానా యాప్‌లు.. యాప్ యాప్ హుర్రే అంటున్నాయి. ‘కాసేపు బయటకెళ్లి ఫ్రెండ్స్‌తో ఆడుకోండి’.. అని పేరెంట్స్ బంపర్ ఆఫర్ ఇచ్చినా.. ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుని లెట్స్ ప్లే అంటున్నారు పిల్లలు. పెద్దలు కూడా ప్రతి పనినీ ‘యాపీ’గా ఫోన్లోనే కానిచ్చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌తో దోస్తీలోనే కాదు.. యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడంలోనూ హైదరాబాదీలు రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. యాప్‌ల వినియోగంలో ఇంతకుముందు ఢిల్లీ, బెంగళూరు లాంటి మెట్రో  నగరాలు ముందుండగా వాటిని వెనక్కి నెట్టి ఇప్పుడు హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్‌ను కొట్టేసింది.    ..::
- కట్ట కవిత
 
యాప్ మానియాలో హైదరాబాదీలు మునిగితేలుతున్నారు. బస్సు రూట్ తెలుసుకోవడానికి ‘హైదరాబాద్’ ఆర్టీసీ ఇన్‌ఫో, ఏదైనా ఆపద వచ్చినప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేయడానికి ‘హాక్ ఐ హైదరాబాద్ పోలీస్’ లాంటివి కొన్నుంటే.. కమ్యూనికేషన్ యాప్స్ మరికొన్ని, కాల క్షేపానికి వాడే ఈ కామర్స్, ట్రావెలింగ్, గేమింగ్ యాప్స్ ఇంకొన్ని ఉన్నాయి. దీన్ని బట్టి నగరవాసులు ఈ కామర్స్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్న వారిలో ఇరవై మూడు శాతం మంది ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. అంటే లార్జ్ స్క్రీన్స్ డివైస్‌లను ఉపయోగించేందుకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్, లార్జ్ స్క్రీన్ ఫోన్స్ ఉపయోగించేవాళ్లలో విద్యార్థులు, ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటున్నారు. ఇక షాపింగ్ అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకోవడంలో మాత్రం బెంగళూరే ప్రథమ స్థానంలో ఉంది. ట్రావెల్ అప్లికేషన్స్ డౌన్‌లోడింగ్‌లో సిటీ మూడో స్థానంలో ఉంది. ఈ వివరాలన్నీ ఆండ్రాయిడ్ ఫోన్స్ అప్లికేషన్ ‘ప్లాట్‌ఫామ్ ఫ్రీపైసా’ నిర్వహించిన సర్వేలో తేలాయి.
 
త్రీజీ మేడ్ ఈజీ..

ఈ ఏడాది ఇప్పటి వరకు మన దేశం 9 బిలియన్ల అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకుంది. 2012తో పోల్చుకుంటే ఇది ఐదురెట్లు ఎక్కువ. ఇందులో పెయిడ్ యాప్స్ 1,500 కోట్ల రూపాయల విలువైనవి. ఇక ఫ్రీ యాప్స్ గురించి చెప్పనక్కర్లేదు. త్రీజీ నెట్‌వర్క్ విస్తరిస్తుండటం, ఈ ఏడాది వస్తున్న ఫోర్‌జీ నెట్‌వర్క్ స్మార్ట్ ఫోన్ యూసేజ్‌ను, యాప్స్ డౌన్‌లోడింగ్‌ను మరింత పెంచుతుందని అంచనా. ప్రస్తుతం ఇండియాలో మూడు లక్షల మంది యాప్ డె వలపర్స్ ఉన్నారు. 2017 కల్లా సాఫ్ట్‌వేర్ డెవలపర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
 
ఈ కామర్స్‌దే ఫస్ట్ ప్లేస్...

ఐడియా ఉంటే చాలు.. స్టార్టప్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తుండటంతో నగరంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. హైదరాబాదీలు డౌన్‌లోడ్ చేసుకుంటున్న యాప్స్‌లో ఎక్కువగా ఈ-కామర్స్ యాప్స్ ఉంటున్నాయి. రెండో స్థానం కమ్యూనికేషన్ యాప్స్, మూడో స్థానంలో తెలుగులో భాష అప్లికేషన్స్ ఉన్నాయి. ఆన్‌లైన్ కేటలాగ్స్‌తో వెబ్‌సైట్స్ వర్చువల్ మాల్స్‌లా మారిపోయాయి. అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కువగా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. వీటితోపాటు ఇతర బిజినెస్ లావాదేవీలకోసం ఈ-కామర్స్ యాప్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈజీ షేరింగ్, ఫ్రీ అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ కోసం వాట్సప్, టెలిగ్రామ్, హైక్ వంటి కమ్యూనికేషన్ యాప్స్‌ని హైదరాబాదీలు ఎక్కువగా డౌన్‌లోడ్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఉండే అప్లికేషన్స్‌ని మాత్రం విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు ఎక్కువగా వాడుతున్నారు.
 - అయ్యప్ప నగుబండి, పాసిబిలియన్ టెక్నాలజీస్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement