అంతర్వాణి చెప్పడం వరకే
జ్యోతిర్మయం
‘ఆద్యశాంతి’ అనే భారతీయ నామాన్ని ధరించిన ఒక అమెరికన్ ప్రారంభంలో జెన్ సాధకుడు. ఆద్యశాంతి ‘ఆధ్యాత్మికంగా మేల్కొన్నాడు’ అని గురువు గమనించి, ‘ఇక ఇతర్లు మేల్కొనడానికి మార్గం చూపు’ అని దీవించి పంపాడు. అప్పటి నుంచి (1996) ఆద్య శాంతి బోధిస్తూ ఉన్నాడు. అతడితో ఒకరు జరిపిన సంభాషణ ఇక్కడ ఇస్తున్నాను.
ప్రశ్న: ఇరవై ఐదేళ్ల వయసులో మీ మొదటి ‘మేల్కొనడం’ జరిగిందంటా రు. ఆ సమయాన మీకేదో కంఠధ్వని వినిపించింది అని చెప్పారు. అది ఎవరిది? మీ ‘కాన్‌షెన్స్’ అంతరాత్మ అంటా రా? లేక, లోనవుండేటి మరే దైనా నిశ్చల కంఠస్వరమా?
ఆద్యశాంతి: అదో అంతర్వాణి. దానికి మీరే పేరైనా పెట్టండి.
ప్ర: అందరికీ ఆ వాణి ఉన్నదంటారా?
ఆద్య: అంతా మానవులమే కాబట్టి, అందరి లోనూ ఉండి తీరాలి. కానీ సాపేక్ష న్యాయంగా మాట్లాడితే, ఆ ధ్వని ఉన్నా అందరూ ఆలకిస్తున్నారా? అనేది ప్రశ్న. ఎక్కువ మంది వినే స్థితిలో లేరు. అంత ర్వాణి, చిత్తశుద్ధి ఈ రెండూ ఒకటే.
నా యవ్వనపు అనుభవాన్ని తరచూ ఉదహరిస్తూ ఉంటాను. ఎవరో యువతిని ‘డేట్’ చేసేటప్పుడు, ‘ఈ యువతితో నీకు పొసగదు. చివరికెలాగూ ఇది విఫలమవుతుంది.’ అని అంతర్వాణి చెపుతూనే ఉంటుంది. ముందే వింటే ఏ చిక్కూ లేదు. చివరకు మీ ఇద్దరి మధ్యా సంబంధం సరిగా లేదని తెలియవస్తుంది. తీరా విఫలమైన తర్వాత, ‘పొరపాటు చేశాను’ అని కనుక్కునే బదులు, మొదట్లోనే ఆ కంఠస్వరం సత్యాన్నే పలుకుతోంది అని తెలుసుకొని ఉంటే, ఏ తంటా ఉండేది కాదు. కానీ చివరకు ఆ అంతర్వాణే నెగ్గింది.
ఆ కంఠస్వరం మర్మమైనదేం కాదు. ప్రజా నీకంలో అధిక భాగం అప్పుడప్పుడూ వినే ఉంటారు. కానీ దానిని తోసిపుచ్చుతాం. ఆ స్వరం తాను అలా ఎందుకంటున్నదో సమర్థన కూడా ఇవ్వాలిని డిమాండ్ చేస్తాం. మనలోని ఆ స్వరం సత్యమైనదని నిర్ధారణగా చెప్పడానికి, అది తనని తాను సమర్థిం చుకోకుండా ఉండటమే గుర్తు. ఎందుకిలా అంటు న్నావ్ అని నీ ‘అహాన్ని’ అడిగితే, నీ అహం నీకెన్ని కారణాలైనా చెప్తుంది. శాయశక్తులా తనని తాను సమర్థించుకుంటుంది. ఈ అంతర్వాణికి నిశ్చయధ్వని ఉండదు. నమ్మించడానికి ఏ ప్రయ త్నమూ చేయదు. ఈ అంతర్వాణి ఒక వరం లాంటిది. ఒకరు వింటారు, మరొకరు వినరు.
నేనెందుకు విన్నానో తెలియదు. వింటున్నందుకు ఆనందిస్తూ ఉంటాను. అన్ని సందర్భాల్లో విన్నాను అనీ చెప్పలేను. కానీ అది చెప్తూనే ఉన్నది.
ప్ర: అది మార్గదర్శి లాంటిదా, రక్షణ ఇస్తుం టుందా! మన మనసులో భాగమా?
ఆద్య: అవన్నీ కలసినది. అది ఉనికికి చెందిన మహా ప్రవాహం.
నీలంరాజు లక్ష్మీప్రసాద్