వాజపేయికి సరే... | OK to Vajpayee ... | Sakshi
Sakshi News home page

వాజపేయికి సరే...

Published Sun, Dec 28 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

ఆకార్ పటేల్

ఆకార్ పటేల్

 అవలోకనం

 నెల్సన్ మండేలా, సచిన్ తేండూల్క ర్‌కు కానీ, జవహర్‌లాల్ నెహ్రూ, గుల్జా రీలాల్ నందాకు కానీ కలిపి ఏదైనా అవార్డు ఇస్తే దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. భారతదేశ అత్యున్నత పౌర అవార్డు భారతరత్న. కానీ, ఈ అవార్డు గ్రహీతలలో చాలామంది (45 మందిలో 25 మంది) రాజకీయ నేతలే. ఇది రాజకీయాల్లో జీవన సాఫల్య అవార్డుగా కనబడుతోంది. ఈ అవార్డును స్వీకరించిన వారి పేర్ల జాబితాను చూసినట్లయితే ఇది మరింతగా తేటతెల్లమవుతుంది.

 మన రాజకీయ పార్టీలలో అధికారంలో ఉన్నవారు తమకు తామే గౌరవించుకోవడం కద్దు. భారతరత్న కూడా దీనికి మినహా యింపు కాదు. ఉదాహరణకు రాజీవ్‌గాంధీ తన రాజకీయ జీవి తంలో పెద్దగా సాధించినదేమీ లేదు కానీ, ఆయనకూ ఈ అవార్డు దక్కింది. తన తల్లి ఇందిరాగాంధీకి కూడా భారతరత్న ఇచ్చారు కాబట్టి సొంత ఇంటి వ్యవహారంలా రాజీవ్‌కు కూడా అవార్డు ప్రకటించేశారు. మహాత్మాగాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వక పోవడంపై భారతీయులు దీర్ఘకాలంగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు కానీ, ఆయనకు భారతరత్న అయినా ఎందుకివ్వలేక పోయామనే ఆలోచన కూడా చేయరు.

 తాజాగా భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారి వాజ పేయి కూడా ఇలాంటి వ్యవహారాలను తేలిగ్గా తీసుకున్నారు. పైగా, తన మోకాళ్లకు చికిత్స చేసి సరిచేసిన డాక్టర్ చిత్తరంజన్ రనవత్‌కు భారత్ అత్యున్నత మూడో అవార్డు పద్మవిభూషణ్‌ను అందించారు.
 ఒక జాతిగా మనం అవార్డులను పెద్దగా పట్టించుకోవడం లేదని నా అభిప్రాయం. మన సాయుధ బలగాలకు కూడా ఇది వర్తిస్తుంది. 1999లో భారతీయ సైన్యం తన అత్యున్నత అవార్డు పరమవీర చక్రను మరణానంతరం 19 ఏళ్ల యోగేంద్ర యాదవ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే హవల్దార్ యాదవ్ చనిపోలేదని, తూటాల గాయాలతో ఆసుపత్రిలో ఉండి తేరుకుంటున్నాడని తర్వాత తెలియవచ్చింది.

 వాజపేయి చాలావరకు మంచిగానే వ్యవహరించేవారు. ప్రతి కూల వ్యక్తులు ఎక్కువగా ఉన్న పార్టీలో ఆయన అత్యంత ఇష్టుడు. తనకు భారతరత్న అవార్డు ఇవ్వడంలో నాకెలాంటి భేదాభిప్రాయం లేదు. ఆయన కన్నా ముందు ఆ అవార్డును పుచ్చుకున్న రాజకీయనే తలను చూసినప్పుడు నా ఈ అభిప్రాయం సరైనదే అని పిస్తుంది.

 అయితే రాజకీయ జీవితం గడుపుతూ జీవన సాఫల్యం అవా ర్డును వాజపేయి పొందిన సందర్భంగా అందరూ ఉపేక్షిస్తున్న  కొన్ని అంశాల్లోకి తరచి చూడాలనుకుంటున్నాను. ఇప్పటినుంచి రాబోయే దశాబ్దాలలో ఎవరైనా రాయబోయే వాజపేయి జీవిత చరిత్ర (జీవిత చరిత్రను రాసే కళలో భారతీయులకు అంత మంచి పేరు లేనప్పటికీ) ఒకే ఒక క్రూర సత్యంతో ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఆ వాస్తవమేమిటంటే వాజపేయి, ఆయన భాగస్వామి ఎల్‌కే అద్వానీ ద్వేష భావంతో చేపట్టిన ఒక సమస్య వారి పార్టీకి ప్రజాదరణ తెచ్చిపెట్టింది కానీ, దానికి ప్రతిఫలంగా 3,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.

 అద్వానీతో పోలిస్తే  వాజపేయి మంచి మనిషి అనే భావన (పావురం, రాబందు) వట్టి బూటకం మాత్రమే. అధికారంలో ఉన్నప్పుడు అద్వానీ ఒక అడుగు వెనక్కు వేశారన్న వాస్తవం దీన్ని స్పష్టంగా ప్రదర్శించింది.

 రెండో విషయం ఏమిటంటే, ఇటీవలి దశాబ్దాల్లో 1998-99లో మాత్రమే భారత్‌లో విదేశీ పెట్టుబడులు ప్రతికూల రేటును నమోదు చేశాయి. అంటే విదేశీ నిధులు వాస్తవంగా భారత్ నుంచి తరలిపోయాయని అర్థం. పోఖ్రాన్‌లో వాజపేయి చేసిన దుస్సా హసమే దీనిక్కారణం. అణ్వస్త్ర పరీక్ష వల్ల భారత్‌కు ఎలాంటి వ్యూహాత్మక లబ్ధి దక్కకపోగా, ఈ ఘటన భారత్ అభివృద్ధిని, ఉద్యో గాలను అడ్డుకుని దారిద్య్రాన్ని మరింతగా పెంచింది (అయితే భారత్ 1997 నాటి కన్నా ఇప్పుడు మరింత సురక్షితంగా ఉందా అన్నది ఆలోచించాల్సిందే)
 అప్పట్లో దేశంలో నెలకొన్న అనిశ్చితి, హింస, అభివృద్ధికి సం బంధించిన డేటాను ఎవరూ సవాలు చేయలేదు కాబట్టి వాజపేయి అణు పరీక్ష ఘటనతో జరిగిన నష్టం గురించి తెలుసుకుని ఉండాలి. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మోసకారి పద్ధతులతో వ్యవహరిస్తుండగా, భారతీయ పర్యాటక రంగం తక్కు వ అభివృద్ధిని నమోదు చేసింది. పైగా ప్రతికూల వృద్ధి దశలతో దేశం వరుసగా దెబ్బతింటూ వచ్చింది. మన దేశ ప్రతికూల వృద్ధి రేట్లు 1984 (-8.5%), 1990-91, (-1.7% చొప్పున), 1993 (-5.5%), 1998లో (-7%), 2002 (-6%) నమోదయ్యాయి. ఢిల్లీ దాడులు, బాబ్రీ మసీదు తదనంతర దాడులు, పోఖ్రాన్, గుజరాత్ దాడులు ఈ సంవత్సరాల్లోనే జరిగాయని గుర్తుంచుకోవాలి.

 వాజపేయికి సంబంధించిన చివరి అంశం ఏమిటంటే, పెద్దగా ఎవరూ గుర్తించని ఆయన కవిత్వమే. ఉదాహరణకు, ఒక కవితను ఇక్కడ చూద్దాం.
 పృథ్వీ పర్ మనుష్య హై ఐసా ప్రాణి హై
 జో భిద్ మే అకేలా, ఔర్
 అకేలె మై భిద్ సే ఘిరా అనుభవ్ కర్తా హై
 (భూమ్మీది జీవులలో / మానవుడు మాత్రమే
 గుంపులో ఒంటరితనాన్ని అనుభవించగలడు.
 ఒంటరిగా ఉన్నప్పుడు జనం చేత దొమ్మీకి గురి కాగలడు).
 క్యా ఖోయా, క్యా పాయా జగ్ మే,
 మిల్తే ఔర్ బిచడ్తే మగ్ మే,
 ముజే కిసీ సే నహిన్ షికాయత్,
 యద్‌యాపీ చలా గయా పాగ్-పాగ్ మే,
 ఏక్ దృష్టి బేటి పార్ దలేన్ యాదోంకి పొట్లి తటోలన్
 (కలిసి, విడిపోయే ఈ ప్రయాణంలో
 భూమ్మీద నాకు దక్కిందీ, పోగొట్టుకుందీ ఏమిటి?
 ప్రతి అడుగులో నేను మోసాన్ని చూశాను,
 కానీ నాకెలాంటి బాధలు లేవు. ఫిర్యాదులూ లేవు,
 ఎందుకంటే, గతాన్ని మథిస్తూ, స్మృతులను చెరుగుతున్నాను).
 మనసుకు తగిలేటట్టు ఉండే వాజపేయి ఉచ్చారణతో దీన్ని మీరు చదివినట్లయితే ఈ కవిత మరింత బాగా ఉంటుంది. కాని దానిపై నాకు సందేహమే. కొన్నేళ్ల క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియా క్రెస్ట్ ఎడిషన్ కోసం నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాజపేయి, నరేంద్ర మోదీ కవితలపై జరిగిన ఇంటర్వ్యూ అది. దాన్ని నాకు నేను మళ్లీ పునరావృత్తి చేయడం కంటే ఆ వ్యాఖ్యను ఇక్కడ ఉల్లేఖిస్తాను. ‘‘మోదీ, వాజపేయిలలో ఏ ఒక్కరూ నైపుణ్యం కల కవులు కారు. సహజ ప్రపంచాన్ని వారు పరిశీలించలేరు. వీరి కవితలు ప్రాథమిక మైనవి. ఈ కవితలు అంటుగట్టినట్లు ఉంటాయి. మోదీ కవితలు వాజపేయి కవితల కంటే కాస్త మెరుగైనవి. ఎందుకంటే, మోదీ అమూర్త, అస్పష్ట ఆలోచనను చేపడతారు. అయితే వాజపేయి కవిత మాత్రం ఊహించలేనంత వాచ్యార్థంతోనూ, నిస్తేజంగాను ఉంటుంది’’. ఇది నిజమని నేను నేటికీ భావిస్తున్నాను.
 (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
aakar.patel@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement