చాలా రోజులుగా డేటింగ్ చేస్తున్నా...
చాలా రోజులుగా డేటింగ్ చేస్తున్నా... లవ్‌లో మునిగి తేలుతున్నా... ఎప్పుడూ బయటపడని స్టార్ జంట రణబీర్ కపూర్, కత్రినా కైఫ్‌లు తాజాగా హౌస్ వార్మింగ్ పార్టీ చేసుకున్నారట. తండ్రి రుషీకపూర్ అనారోగ్యం కారణంగా కొంతకాలం ముంబైలోని కృష్ణరాజ్ బంగ్లాలో ఉన్న రణబీర్... ఆయన ఆరోగ్యం కుదుట పడగానే కత్రినాతో కలసి కొత్త హౌస్‌లోకి షిప్టయిపోయాడట. ఆర్యన్ ముఖర్జీ, హృతిక్ రోషన్, కంగనా రనౌత్, అనుష్కా శర్మ, కబీర్ ఖాన్, మినీ మాధుర్ తదితర ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఈ పార్టీకి అటెండ్ అయ్యారన్నది మిడ్‌డే కథనం.