ముందు ముహూర్తం చూడండి | See Muhurtam before | Sakshi
Sakshi News home page

ముందు ముహూర్తం చూడండి

Published Mon, Oct 27 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

ముందు ముహూర్తం చూడండి

ముందు ముహూర్తం చూడండి

బండెడేసి స్క్రిప్ట్‌లు.. గుండె నిండా ఆశలతో.. కథలు వినిపించడానికి నిర్మాతలు, హీరోల ఇళ్ల ముందు క్యూ కట్టే యంగ్ టాలెంట్స్ ఎందరో ఉంటారు. అదృష్టం తలుపుతట్టి కథ చెప్పే చాన్స్ దొరికి అది నచ్చినా.. వెంటనే వచ్చే క్వశ్చన్.. ‘సినిమా నువ్వు చెప్పినట్టే తీస్తావనే గ్యారంటీ ఏంటీ..?’ అని. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఓ కుర్రాడు వెరైటీగా ప్లాన్ చేశాడు. తాను రాసుకున్న సినిమా కథలో ఓ సీన్‌ను షార్ట్ ఫిల్మ్‌గా తీశాడు. దానికి ‘ముహూర్తం’ అని టైటిల్ ఫిక్స్ చేశాడు. ఆ షార్ట్‌ఫిల్మ్ చూపించి.. ‘నా ట్రయల్ షూట్ ఇది.. నచ్చితే సినిమా చేస్తా’ అని కాన్ఫిడెంట్‌గా ట్రయల్స్ చేస్తున్నాడు. ఈ పొట్టి చిత్రంతో ట్రయల్స్ చేస్తున్న యంగ్‌తరంగ్ శశితో సిటీప్లస్ ముచ్చటించింది.
 
ఇంజనీరింగ్ చదివేటప్పుడే రెండు షార్ట్ ఫిలింస్ తీశాను. నాకు తెలుగంటే అభిమానం. తెలుగులో బాగా రాయగలను. అది ఎక్కడ ఉపయోగపడుతుందా అని చూస్తే సినిమా కరెక్ట్ అనిపించింది. షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టాను. నేను తీసిన ‘సురాజ్యం’ అనే బుల్లి చిత్రానికి డెరైక్టర్ రాజమౌళి నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంపిటీషన్‌లో బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది.
 
సుముహూర్తం..
సినిమాలో డెరైక్టర్‌గా చాన్స్ కోసం ఎన్నో ఏళ్లు తిరిగాను. ప్రొడ్యూసర్స్‌కి, యాక్టర్స్‌కి స్టోరీ నెరేట్ చేసినా.. తెరపై కథను ఎలా చూపిస్తావ్ అనే ప్రశ్నించేవారు. మంచి సినిమా తీయడానికి మంచి కథను ఒకదాన్ని సిద్ధం చేసుకున్నాను. సినిమాల్లోకి వెళ్లడానికి ఈ కథనే షార్ట్ కట్‌గా ఉపయోగించుకోవాలని ఫిక్సయ్యాను. అందుకే నేను అనుకున్న కథలో కొంత భాగాన్ని షార్ట్ సినిమాలా షూట్ చేశాను. నేను తీసే సినిమా కూడా ఇంతే క్వాలిటీగా ఉంటుందని చెబుతున్నాను. ముహూర్తం షార్ట్ మూవీని హీరో సందీప్ కిషన్ ట్విట్టర్‌లో పెట్టారు. వెన్నల కిషోర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్నారు. ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ రామ్మోహన్ అప్రిషియేట్ చేశారు.
 
టైటిల్ అండ్ మేకింగ్..
ముహూర్తం చిత్రీకరణలో చాలా ఇబ్బందులే ఫేస్ చేశాను. సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి హార్డ్‌వేర్ పాడవటం, ఎక్విప్‌మెంట్ మొరాయించడం.. ఏ ముహూర్తంలో షూటింగ్ స్టార్ట్ చేశామో అని విసుక్కున్నాం. ఆ ఎమోషన్ నుంచి ముహూర్తం టైటిల్ వచ్చింది. ఈ ముహూర్తం సక్సెస్ కావడానికి నా ఫ్రెండ్స్ అశోక్, కౌశిక్, ప్రదీప్, రాజేష్‌లు కారణం. ఈ నలుగురే 90స్ కిడ్స్ స్టూడియోస్ తరపున ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఐక్లిక్ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్‌లో సపోర్ట్ అందించింది. ఈ బుల్లి సినిమాలో టూ మెయిన్ లీడ్స్ గిరీష్, గాయత్రి. ఆమె గురించి స్పెషల్‌గా చెప్పాలి. తను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆఫీస్ అయిన తర్వాత, రాత్రిపూట షూటింగ్ వచ్చింది. చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ సినిమా చూసిన కొంతమంది ప్రొడ్యూసర్స్ కాల్ చేశారు. ప్రస్తుతం డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి.
 
శాంపుల్ పిక్చర్
టైటిల్‌కు తగ్గట్టుగా సింపుల్‌గా, అందంగా, హాయిగా సాగిపోతుంది ఈ చిన్ని సినిమా. డైలాగ్స్, పిక్చరైజేషన్, యాక్టింగ్, క్వాలిటీ ఇలా ఏ యాంగిల్‌లో చూసినా పెద్ద సినిమాకు తగ్గని స్థాయిలో తీశారు. నటీనటులు హావభావాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, షాట్స్ కంపోజిషన్ అన్ని ఇంపుగా కుదిరిన ఈ సినిమాను యూట్యూబ్‌లో లక్ష మందికి పైగా చూసేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement