క్లిక్ మూవీస్ | shot films webset i click webset | Sakshi
Sakshi News home page

క్లిక్ మూవీస్

Published Mon, Sep 22 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

క్లిక్ మూవీస్

క్లిక్ మూవీస్

పొట్టి చిత్రాలను ప్రమోట్ చేస్తూ... వాటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ.. ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది ‘ఐక్లిక్’ వెబ్‌సైట్. రిఫరెన్స్‌లుగా ఉపయోగించుకొనేందుకు మూవీ డేటా బేస్‌ను మెయిన్‌టెయిన్ చేస్తోంది. ప్రారంభించిన ఏడాది కాలంలో 45 షార్ట్ ఫిల్మ్‌లు ప్రమోట్ చేసింది.
 
‘ఐక్లిక్ మూవీస్ ద్వారా మంచి టాలెంట్ బయటకు వచ్చింది అనే గుర్తింపు, గుడ్‌విల్ కోసమే షార్ట్ ఫిలింస్ చేస్తున్నాం. యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారా రెవెన్యూ ఉంది. కానీ దాని కంటే ముందు యంగ్ టాలెంట్‌కి ప్లాట్‌ఫాం కల్పించటం, గుడ్‌విల్ సంపాదించుకోవటమే మాకు ముఖ్యం. తద్వారా బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. 20 సినిమాలు ప్రొడ్యూస్ చేశాం. 20 ప్రమోట్ చేశాం. ప్రస్తుతం తమిళ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో షార్ట్‌ఫిల్మ్స్ చేస్తున్నాం.

భవిష్యత్తులో హిందీ కూడా చేయాలని అనుకుంటున్నాం. మంచి కథ, టీమ్, కోఆర్డినేట్ చేసుకునే అవకాశం ఉంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కల్పిస్తాం. బంజారాహిల్స్ రోడ్ నం.12లో మా ఆఫీసుకి డెరైక్టుగా రావచ్చు. ఫోన్ ద్వారా అప్రోచ్ కావచ్చు. వాళ్లు వచ్చి స్టోరీ చెప్పిన తర్వాత, వాళ్లకి వీడియో మేకింగ్ అనుభవం ఉంటే... దాన్ని బట్టి కాస్ట్ క్రూ అందించటం, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ మ్యూజిక్, కెమెరా వంటివి అందిస్తాం. ఇండిపెండెంట్ చిత్రాలు, మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్ కూడా ప్రమోట్ చేస్తుంటాం. ‘అలా క్షమించు’ అనే ఇండిపెండెంట్ చిత్రానికి ఒక నెలలో ఒక లక్ష హిట్స్ వచ్చాయి’ అంటారు సంస్థ క్రియేటివ్ హెడ్ నవీన్.
 
సినిమాలపై మక్కువ
సినిమాలంటే చాలా ఇష్టం. అమెరికాలో రిలయబుల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థ ఉన్నా... సినిమా మోజుతో ఈ వెబ్‌సైట్ ప్రారంభించా. గాసిప్ వెబ్‌సైట్స్ ఎక్కువ కావడం వల్ల తెలుగు సినిమా డేటాబేస్ చాలా తక్కువ ఉంది. బాలీవుడ్‌లో ఐఎండీబీలా టాలీవుడ్‌కి ఒక అథెంటిక్ సైట్ లేదు. ఒక సినిమా పేరుతో సెర్చ్ చేయటం మొదలు పెడితే ఏదో ఒక తప్పు కనిపిస్తుంది. క్వాలిటీ డేటాబేస్, సమాచారం, గాసిప్స్ లేకుండా, పర్సనల్ అటాక్ లేకుండా ఉండే వెబ్‌సైట్ మాది. అదే సమయంలో తెలుగు సినిమాకు ఒక కార్పొరేట్ లుక్ ఇవ్వాలనే ఆలోచన. 800 సినిమాలు అప్‌లోడ్ చేశాం’ అంటారు ఫౌండర్, సీఈఓ కృష్ణ కల్లకూరి.

 
మున్ముందు...
తెలుగు సినీ ప్రముఖులు దేవిశ్రీ ప్రసాద్, వీవీ వినాయక్, బోయపాటి శ్రీను, మధుర శ్రీధర్ సపోర్ట్‌తో ఐక్లిక్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నవంబర్‌లో నిర్వహించబోతున్నారు. అలాగే తొలిసారి ‘సినిమా మహిళా’ అవార్డ్స్‌ని అందించబోతున్నారు.
 ఔత్సాహికులు www.iqlikmovies.comనుబ్రౌజ్ చేయవచ్చు.
 
వేటికవే ప్రత్యేకం..
ఈ సంస్థ ఆధ్వర్యంలో వచ్చిన ‘పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు’ షార్ట్ ఫిల్మ్‌కు వచ్చిన రెస్పాన్స్.. ఇందులో నటించిన అనిరుధ్‌ను హీరోను చేసింది. అతను ‘కిరాక్’లో నటించాడు. ‘నాకు కోపం వచ్చింది’కి నెలలో రెండు లక్షల హిట్స్ వచ్చాయి. దీన్లోని సుదర్శన్‌రెడ్డికి నాగచైతన్య సినిమాలో ఓ మంచి ఆఫర్ వచ్చింది. ‘అదితి’ చిత్రం డెరైక్టర్ అరుణ్ పవార్, ఇప్పుడు మారుతి టాకీస్ వారి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ముహూర్తం’కు మంచి హిట్స్ వస్తున్నాయి. ‘బీప్’ సినిమాకు దాసరి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు దక్కింది.
 
 
ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యూత్‌లో యువ క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను మాకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయిం చేస్తాం. మెయిల్ టు sakshicityplus@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement