shoot to win
బిగ్ స్క్రీన్‌కు షార్ట్ కట్ లఘు చిత్రం. పెద్దగా ఖర్చు, సిబ్బందితో పని లేకుండా నచ్చిన విషయాన్ని మెచ్చేలా తీయడానికి ఉన్న ఏకైక సాధనం. అంతకు మించి తమలోని సృజనాత్మక టాలెంట్‌కు ‘రూపం’ ఇచ్చేందుకు అందుబాటులో ఉన్న ‘చిత్రం’. కానీ... వాటిని ఎలివేట్ చేయాలంటే... అందుకు తగిన వేదిక కావాలి. యువతరంలోని ప్రతిభను ప్రోత్సహించడానికి ‘సాక్షి’ షార్ట్ ఫిలిమ్స్ కోసం ప్రత్యేక ఫీచర్లు, పోటీలు నిర్వహిస్తోంది. అదే బాటలో ఇప్పుడు హీరో మంచు విష్ణు కూడా పయనిస్తున్నారు. షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
‘సినిమాలను పూర్తిగా కొత్త తరహాలో రూపొందించగల సత్తా, క్రియేటివిటీ ఉన్న వాళ్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అలాంటి వారి టాలెంట్ చూపించుకోవడానికి, కల నిజం చేసుకోవడానికి ఓ చిన్న దారి ఏర్పాటు చెయ్యడం కోసమే ఈ పోటీ. వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. ఒక్కసారితోనే సరిపెట్టకుండా... ఏటా ఈ పోటీలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం.
నేచురల్ టాలెంట్ ఉన్నవారందరికీ ఇది ఓ చక్కని వేదికగా మారాలి. తద్వారా సినీ పరిశ్రమకు మంచి దర్శకులను అందించాలన్నది మా లక్ష్యం. విజేతను నాన్న పుట్టిన రోజు మార్చ్ 19న ప్రకటిస్తాం. వారిని 24 ఫ్రేమ్స్ ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తాం’ అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు. దీంతో పాటు మరికొన్ని సంస్థలు కూడా షార్ట్ ఫిలిం కాంటెస్టులు నిర్వహిస్తున్నాయి. ఔత్సాహికుల కోసం వాటి వివరాలు...
బంపర్ ఆఫర్
ఐక్లిక్ మూవీస్ వారు తెలుగు, ఇంగ్లిష్, హిందీ లఘు చిత్రాలను ఆహ్వానిస్తున్నారు. చివరి తేదీ ఫిబ్రవరి 20. ఉత్తమ చిత్రానికి రూ.లక్ష బహుమతి. రెండో ఉత్తమ చిత్రానికి రూ.50 వేలు, మూడు ఉత్తమ చిత్రానికి రూ.25 వేల బహుమతి. వివరాలకు జ్ఞీజీజుఝౌఠిజ్ఛీట.ఛిౌఝను బ్రౌజ్ చేయవచ్చు.
యాన్యువల్ కాంటెస్ట్
తెలుగువన్ వెబ్‌సైట్ నిర్వహిస్తున్న యాన్యువల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఫిబ్రవరి 14తో ముగుస్తుంది. విజేతకు రూ.లక్ష బహుమతి. వివరాలకు ్ట్ఛఠజఠౌ్ఛ.ఛిౌఝ వెబ్‌సైట్‌ను చూడండి.
మెగా ప్రైజ్
ఇండీఫీస్ట్... 60 నిమిషాల లోపు నిడివి ఉన్న చిత్రాలను
ఆహ్వానిస్తోంది. ఈ నెల 31 చివరి తేదీ. ఎంట్రీ ఫీజు రూ.500. మొదటి బహుమతి రూ.5 లక్షలు. రెండో బహుమతి రూ.3 లక్షలు. మూడో బహుమతి రూ.2 లక్షలు. వివరాలు జీఛీజ్ఛీజజ్ఛీట్ట్చ.ఛిౌఝలో చూడవచ్చు.