అమ్మాయి ఓ చూపు చాలు... లక్ష భావాలు వెతుక్కోవచ్చంటారు.
అమ్మాయి ఓ చూపు చాలు... లక్ష భావాలు వెతుక్కోవచ్చంటారు. నిజమే ఆడ వారి మాట లకు అర్థాలే వేరు మరి. వారి మాటలకే కాదు చేతలకి పలు అర్థాలు ఉంటాయని ‘ట్రైయాంగిల్’ షార్ట్ ఫిల్మ్ చూస్తే అర్థమవుతుంది. సినిమాని పూర్తిగా మూకీలోనే తీసినా... కథాంశం ఎక్కడా చెడకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు సాయిరాజ్ అండ్ టీమ్. ఒక అమ్మాయి ఇద్దరి అబ్బాయిల మధ్య సాగే ఈ కథలో ీహ రోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. డైలాగులు లేని సినిమా కావడంతో ఎక్స్‌ప్రెషన్స్‌తోనే అన్ని భావాలను వ్యక్తపర చాలి. ఇందులో హీరోయిన్‌గా చేసిన సుదీప్తి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. టెక్నికల్‌గా కాకుండా కాన్సెప్ట్ పరంగా ఈ చిన్ని చిత్రం చాలా బాగుంది.
ఎస్.శ్రావణ్‌జయ