
ట్రూ ఫ్రెండ్!
ఫిల్మ్ ఇండస్ట్రీలో థిక్ ఫ్రెండ్‌షిప్‌లంటే కామన్‌గా కనిపించేవి డేటింగ్‌లే! అదీ ముద్దు గుమ్మలైతే ఒకరికొకరికి బొత్తిగా పొసగనే పొసగదు. కారణాలేమైనా... హీరోలతో ఉన్నంత కలివిడినెస్‌ను వారిలో వారు మెయిన్‌టెయిన్ చేయరు! కానీ... చిలిపి కళ్ల చిన్నది అనుష్కాశర్మ తన చిత్రం ‘ఎన్‌హెచ్10’ ప్రమోషన్‌లో క్యూటీ గాళ్ కత్రినా కైఫ్‌ను పొగిడేసింది. కత్రినాతో తనకు మాంచి దోస్తానీ ఉందని... తను ఓ ట్రూ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. ‘షీ ఈజ్ రియల్ పర్సన్.
నాటకీయత ఉండదు. హృదయపూర్వకంగా మాట్లాడుతుంది. మేమిద్దరం హెల్దీ టైమ్ స్పెండ్ చేశాం. కత్రినకు కూడా నేనంటే ఎంతో ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్కా. అంతే కాదు... కత్రినా ప్రెట్టీయస్ట్... సెక్సీయస్ట్ యాక్టర్ కూడానని అద్భుతమైన కాంప్లిమెంటూ ఇచ్చేసింది. మొత్తానికి విరాట్‌తో డేటింగ్‌షిప్‌ను ఎంత ఎంజాయ్ చేస్తుందో... కత్రినతో ఫ్రెండ్‌షిప్‌నూ అంతే ఆస్వాదిస్తోంది అనుష్కా!