సాకర్ కిక్ | Youth crazy about sakar brazil dance during 2014 FIFA World Cup | Sakshi
Sakshi News home page

సాకర్ కిక్

Published Sat, Jun 28 2014 12:34 AM | Last Updated on Fri, Jun 15 2018 4:33 PM

సాకర్ కిక్ - Sakshi

సాకర్ కిక్

సాకర్..! వరల్డ్ అంతా ఇప్పుడు అదే ఫీవర్. నగర కుర్రకారు సాకర్.. సాంబా (బ్రెజిల్ డ్యాన్స్) అంటూ కలవరిస్తోంది. టీవీలో మ్యాచ్‌లు చూస్తూ ‘గోల్’గోల చేస్తోంది. టాలీవుడ్ హీరో, హీరోయిన్లు టైమ్ దొరికినప్పుడల్లా.. కాదు కాదు..తీరిక చేసుకుని మరీ బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రపంచకప్ సాకర్ మ్యాచ్‌లను చూస్తూ కేరింతలు కొడుతున్నారు. బ్రెజిల్‌లో మొదలైన ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ సంబరాలు హైదరాబాద్ వరకు వచ్చేశాయి. రెస్టారెంట్‌లు సాకర్ మ్యాచ్‌లకు వేదికలవుతున్నాయి. కాలేజ్ క్యాంటీన్లో మెస్సీలు, రోనాల్డోల మాటలే వినిపిస్తున్నాయి. టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు సిటీ కళ్లప్పగిస్తోంది.
 
 ఫిఫా వరల్డ్‌కప్ జోష్‌తో నగరం కొత్త హంగులు అద్దుకుంది. రెస్టారెంట్లు అర్జెంటుగా మెనూలు మార్చుకున్నాయి. బిగ్‌స్క్రీన్స్‌తో స్టార్ హోటల్స్‌కు కొత్త లుక్కొచ్చింది. అర్ధరాత్రులు మేల్కొంటున్న ఆటలకు కేరింతలు జతవుతున్నాయి. మ్యాచ్‌లన్నీ దాదాపు అర్ధరాత్రి దాటాక మొదలై ఎర్లీ మార్నింగ్‌తో పూర్తవుతున్న నేపథ్యంలో.. తెల్లవారుజాము దాకా మ్యాచ్‌లు ఎంజాయ్ చేసి లేటుగా లేచేవారి కోసం బ్రంచ్ (లంచ్+బ్రేక్‌ఫాస్ట్)లు సైతం సిద్ధం చేస్తున్నారు. డ్రింక్ ఎన్ డైన్ విత్ ఫిఫా అంటూ రూ.500 మొదలుకుని రూ.2వేల దాకా ప్రత్యేక ప్యాకేజీలతో సరికొత్త మెనూలను ఆఫర్ చేస్తున్నాయి.  వెరైటీ రుచులతో పాటుగా నగరంలో ప్రస్తుతం సాకర్ ఫీవర్‌కు ఆతిథ్యం ఇస్తున్న కొన్ని వేదికలివి.
 
 సాకర్ స్క్రీనింగ్
 ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బార్, ఎస్వీఎమ్ మాల్, రోడ్ నెం-36, జూబ్లీహిల్స్
 సాకర్ కార్నివాల్
 ఆర్టియమ్ బార్, తాజ్ డెక్కన్, బంజారాహిల్స్
 ట్రైడెంట్ హోటల్,  మాదాపూర్
 బ్రిడ్జ్ బార్ అండ్ కన్వెన్షన్ సెంటర్
 మారియట్ హోటల్, ట్యాంక్‌బండ్
 సీజన్‌బార్
 తాజ్‌కృష్ణా హోటల్, బంజారాహిల్స్
 
 స్పాయిల్ ది లాంజ్,  జూబ్లీహిల్స్. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. ఇలా మరెన్నో పబ్‌లు, క్లబ్‌లు సాకర్ స్క్రీనింగ్‌కు తెరతీశాయి.  గోతెజంత్రం వంటి కొన్ని కల్చరల్ సెంటర్స్ కూడా ఇదే బాట పట్టాయి. సో.. రాన్రానూ రంజుగా మారుతున్న ఫిఫాను అంతే కిక్‌తో ఎంజాయ్ చేయాలనుకునేవారికి వెన్యూలకు కొదవలేదని అర్ధమైంది కదా. సో.. రెడీ టు ఎంజాయ్!
 
  అర్జెంటీనా ఆడుకుంటుంది
నా అభిమాన ఆటగాళ్లు పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రోనాల్డో. అర్జెంటీనాకు చెందిన మెస్సీ. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌ని అర్జెంటీనా జట్టు ప్రత్యర్థి జట్లను బోల్తా కొట్టించి కప్ కొడుతుందనుకుంటున్నా.
 -అల్లరి నరేశ్
 
 బ్రెజిల్‌దే కప్
  నా అభిమాన జట్టు బ్రెజిల్. ఫేవరెట్ ప్లేయర్ నెయ్‌మార్. ఈసారి బ్రెజిల్ జట్టే కప్ కొడుతుందనుకుంటున్నా. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఫుట్‌బాల్ బాగా ఆడేవాడ్ని. ఇప్పుడు సినిమాలతో బిజీ. అయినా ప్రస్తుతం జరుగుతున్న సాకర్ టోర్నీ మ్యాచ్‌లను చూస్తున్నాను.
 - వరుణ్ సందేశ్
 
 జర్మనీ, బ్రెజిల్‌కే ఓటు
 నా ఫేవరెట్ ఆటగాళ్లు మెస్సీ, క్రిస్టియానో రోనాల్డో, నెయ్‌మార్. అభిమాన జట్లు బ్రెజిల్, జర్మనీ. గత ఏడాది నిరాశపరిచిన అర్జెంటీనా ఆటగాడు మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో ఇరగదీస్తాడని ఆశిస్తున్నా. జర్మనీ జట్టు ఈసారి ట్రోఫీని గెలుస్తుంది
 - నవీన్ చంద్ర
 
 క్రిస్టియానో.. కేక
  నాకు బ్రెజిల్ జట్టంటే ఇష్టం. వ్యక్తిగతంగా ఫేవరెట్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో.
 ప్రస్తుతం సొంత గడ్డపై జరుగుతున్న ఈ ప్రపంచ  కప్‌ను బ్రెజిల్ కైవసం చేసుకుంటుందని ఆశిస్తున్నా.
 - నాని
 
 ఇండో-పాక్ మ్యాచ్‌లా ఫైనల్

 సొంతగడ్డపై జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ ఫైనల్ చేరితే బాగుంటుంది. మరో జట్టు అర్జెంటీనా కూడా తుది సమరానికి చేరుతుందనుకుంటున్నా. అలా జరిగితే ఈ మ్యాచ్ ఇండో-పాక్ మ్యాచ్‌లాగా అభిమానులను అలరించడం ఖాయం. ఈ జట్లలోని ఆటగాళ్లు నెయ్‌మార్, మెస్సీ మెరుపులు చూడాలని ఉంది. నేనూ ఫుట్‌బాల్ ఆటగాడ్నే.
 -  రాహుల్ రవీంద్రన్
 
 జర్మనీ ఆట తీరు బాగుంది
 ప్రస్తుత ఫిఫా సాకర్ కప్ మ్యాచ్‌లను టైమ్ చిక్కినప్పుడల్లా చూస్తున్నా. జర్మనీ ఆటతీరు చాలా బాగుంది. వాళ్లు ఇలాగే రాణిస్తే వరల్డ్‌కప్ గెలుచుకోవడం ఖాయమనిపిస్తోంది. ఇతర జట్లు కూడా ధీటుగానే రాణిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ ప్రేమికులందరినీ అలరిస్తోంది.
 - స్వాతి
 
 నా ఫేవరెట్ రోనాల్డో

 టీవీలో అన్ని మ్యాచ్ లూ చూస్తున్నా. ఈ సారి కప్ ఎవరిదైనా మ్యాచ్‌లు బాగా ఆడడమే ముఖ్యం. ఈ వరల్డ్ కప్ మంచి కిక్ ఇస్తోంది. రోనాల్డో ఆట తీరంటే నాకు చాలా ఇష్టం. తనే నా ఫేవరెట్ ప్లేయర్..
 - హితేష్
 (గోల్ కీపర్)
 
 వచ్చేసారి ఇండియా క్వాలిఫై కావాలి
 వచ్చే వరల్డ్‌కప్‌లో ఇండియా క్వాలిఫై అవ్వాలనేదే మా కోరిక. సాకర్ మ్యాచ్‌లన్నీ చూస్తున్నా. మెస్సీకి అందరూ సహకరిస్తేనే గోల్ కొడుతున్నాడు. రోనాల్డో మాత్రం ఒంటరిగానే పోరాడుతున్నాడు.
 - అన్‌మోల్, ప్లేయర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement