sakar
-
‘ఆ సినిమా కథ కాపీరైట్స్ నావే’
సాక్షి, హైదరాబాద్ : తాను కాపీరైట్స్ తీసుకున్న కథను మరొకరికి విక్రయించిన వ్యక్తిపై, ఆ కథతో సినిమాను తెరకెక్కించిన నిర్మాత, నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని రచయిత డాక్టర్ నంది చిన్నికుమార్ విజ్ఞప్తి చేశాడు. మంగళవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఆమీర్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే ‘సత్యమేవ జయతే’ కార్యక్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన అఖిలేపాల్ అనే వ్యక్తి జీవిత కథను విన్నానని తెలిపారు. ఆయన ఓ మురికివాడలో పుట్టి ఎన్నో నేరాలు చేసి తర్వాత ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగి బ్రెజిల్లో జరిగిన సాకర్ కప్ టోర్నమెంట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడన్నారు. ప్రస్తుతం మురికివాడల్లోని, రెడ్‌లైట్ ఏరియాల్లోని పిల్లలకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అతని జీవిత కథ తనకెంతో నచ్చడంతో ఆయన దగ్గరికెళ్లి సినిమా తీసేందుకు 2018 మార్చి 19న కాపీరైట్స్ అగ్రిమెంట్ చేసుకున్నానని వివరించారు. ఇందుకు కొంత నగదు కూడా చెల్లించినట్లు పేర్కొన్నారు. తాను సినిమా స్టోరీ అంతా సిద్ధం చేసుకొని... నటీనటులు, నిర్మాతల కోసం వెతుకుతున్నానన్నారు. కాగా ఇటీవల విడుదలైన విజిల్ (తెలుగు), తమిళ్లో (బిగిల్) సినిమా తాను కాపీరైట్స్ తీసుకున్నదేనన్నారు. దీనిపై పాల్‌ను సంప్రదించగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా బృందాన్ని సంప్రదించినా స్పందన లేదన్నారు. దీంతో తెలంగాణ సినిమా రైటర్స్ అసోసియేషన్, సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనూ అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేయగా, వారు బాధ్యులపై కేసు నమోదు చేశారన్నారు. దీనిపై త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. -
సాకర్ కిక్
సాకర్..! వరల్డ్ అంతా ఇప్పుడు అదే ఫీవర్. నగర కుర్రకారు సాకర్.. సాంబా (బ్రెజిల్ డ్యాన్స్) అంటూ కలవరిస్తోంది. టీవీలో మ్యాచ్‌లు చూస్తూ ‘గోల్’గోల చేస్తోంది. టాలీవుడ్ హీరో, హీరోయిన్లు టైమ్ దొరికినప్పుడల్లా.. కాదు కాదు..తీరిక చేసుకుని మరీ బ్రెజిల్లో జరుగుతున్న ప్రపంచకప్ సాకర్ మ్యాచ్‌లను చూస్తూ కేరింతలు కొడుతున్నారు. బ్రెజిల్లో మొదలైన ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ సంబరాలు హైదరాబాద్ వరకు వచ్చేశాయి. రెస్టారెంట్లు సాకర్ మ్యాచ్‌లకు వేదికలవుతున్నాయి. కాలేజ్ క్యాంటీన్లో మెస్సీలు, రోనాల్డోల మాటలే వినిపిస్తున్నాయి. టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు సిటీ కళ్లప్పగిస్తోంది. ఫిఫా వరల్డ్‌కప్ జోష్‌తో నగరం కొత్త హంగులు అద్దుకుంది. రెస్టారెంట్లు అర్జెంటుగా మెనూలు మార్చుకున్నాయి. బిగ్‌స్క్రీన్స్‌తో స్టార్ హోటల్స్‌కు కొత్త లుక్కొచ్చింది. అర్ధరాత్రులు మేల్కొంటున్న ఆటలకు కేరింతలు జతవుతున్నాయి. మ్యాచ్‌లన్నీ దాదాపు అర్ధరాత్రి దాటాక మొదలై ఎర్లీ మార్నింగ్తో పూర్తవుతున్న నేపథ్యంలో.. తెల్లవారుజాము దాకా మ్యాచ్‌లు ఎంజాయ్ చేసి లేటుగా లేచేవారి కోసం బ్రంచ్ (లంచ్+బ్రేక్‌ఫాస్ట్)లు సైతం సిద్ధం చేస్తున్నారు. డ్రింక్ ఎన్ డైన్ విత్ ఫిఫా అంటూ రూ.500 మొదలుకుని రూ.2వేల దాకా ప్రత్యేక ప్యాకేజీలతో సరికొత్త మెనూలను ఆఫర్ చేస్తున్నాయి. వెరైటీ రుచులతో పాటుగా నగరంలో ప్రస్తుతం సాకర్ ఫీవర్‌కు ఆతిథ్యం ఇస్తున్న కొన్ని వేదికలివి. సాకర్ స్క్రీనింగ్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ బార్, ఎస్వీఎమ్ మాల్, రోడ్ నెం-36, జూబ్లీహిల్స్ సాకర్ కార్నివాల్ ఆర్టియమ్ బార్, తాజ్ డెక్కన్, బంజారాహిల్స్ ట్రైడెంట్ హోటల్, మాదాపూర్ బ్రిడ్జ్ బార్ అండ్ కన్వెన్షన్ సెంటర్ మారియట్ హోటల్, ట్యాంక్‌బండ్ సీజన్బార్ తాజ్‌కృష్ణా హోటల్, బంజారాహిల్స్ స్పాయిల్ ది లాంజ్, జూబ్లీహిల్స్. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. ఇలా మరెన్నో పబ్‌లు, క్లబ్‌లు సాకర్ స్క్రీనింగ్‌కు తెరతీశాయి. గోతెజంత్రం వంటి కొన్ని కల్చరల్ సెంటర్స్ కూడా ఇదే బాట పట్టాయి. సో.. రాన్రానూ రంజుగా మారుతున్న ఫిఫాను అంతే కిక్‌తో ఎంజాయ్ చేయాలనుకునేవారికి వెన్యూలకు కొదవలేదని అర్ధమైంది కదా. సో.. రెడీ టు ఎంజాయ్! అర్జెంటీనా ఆడుకుంటుంది నా అభిమాన ఆటగాళ్లు పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రోనాల్డో. అర్జెంటీనాకు చెందిన మెస్సీ. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌ని అర్జెంటీనా జట్టు ప్రత్యర్థి జట్లను బోల్తా కొట్టించి కప్ కొడుతుందనుకుంటున్నా. -అల్లరి నరేశ్ బ్రెజిల్దే కప్ నా అభిమాన జట్టు బ్రెజిల్. ఫేవరెట్ ప్లేయర్ నెయ్మార్. ఈసారి బ్రెజిల్ జట్టే కప్ కొడుతుందనుకుంటున్నా. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఫుట్‌బాల్ బాగా ఆడేవాడ్ని. ఇప్పుడు సినిమాలతో బిజీ. అయినా ప్రస్తుతం జరుగుతున్న సాకర్ టోర్నీ మ్యాచ్‌లను చూస్తున్నాను. - వరుణ్ సందేశ్ జర్మనీ, బ్రెజిల్‌కే ఓటు నా ఫేవరెట్ ఆటగాళ్లు మెస్సీ, క్రిస్టియానో రోనాల్డో, నెయ్మార్. అభిమాన జట్లు బ్రెజిల్, జర్మనీ. గత ఏడాది నిరాశపరిచిన అర్జెంటీనా ఆటగాడు మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో ఇరగదీస్తాడని ఆశిస్తున్నా. జర్మనీ జట్టు ఈసారి ట్రోఫీని గెలుస్తుంది - నవీన్ చంద్ర క్రిస్టియానో.. కేక నాకు బ్రెజిల్ జట్టంటే ఇష్టం. వ్యక్తిగతంగా ఫేవరెట్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో. ప్రస్తుతం సొంత గడ్డపై జరుగుతున్న ఈ ప్రపంచ కప్‌ను బ్రెజిల్ కైవసం చేసుకుంటుందని ఆశిస్తున్నా. - నాని ఇండో-పాక్ మ్యాచ్‌లా ఫైనల్ సొంతగడ్డపై జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ ఫైనల్ చేరితే బాగుంటుంది. మరో జట్టు అర్జెంటీనా కూడా తుది సమరానికి చేరుతుందనుకుంటున్నా. అలా జరిగితే ఈ మ్యాచ్ ఇండో-పాక్ మ్యాచ్‌లాగా అభిమానులను అలరించడం ఖాయం. ఈ జట్లలోని ఆటగాళ్లు నెయ్మార్, మెస్సీ మెరుపులు చూడాలని ఉంది. నేనూ ఫుట్‌బాల్ ఆటగాడ్నే. - రాహుల్ రవీంద్రన్ జర్మనీ ఆట తీరు బాగుంది ప్రస్తుత ఫిఫా సాకర్ కప్ మ్యాచ్‌లను టైమ్ చిక్కినప్పుడల్లా చూస్తున్నా. జర్మనీ ఆటతీరు చాలా బాగుంది. వాళ్లు ఇలాగే రాణిస్తే వరల్డ్‌కప్ గెలుచుకోవడం ఖాయమనిపిస్తోంది. ఇతర జట్లు కూడా ధీటుగానే రాణిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ ప్రేమికులందరినీ అలరిస్తోంది. - స్వాతి నా ఫేవరెట్ రోనాల్డో టీవీలో అన్ని మ్యాచ్ లూ చూస్తున్నా. ఈ సారి కప్ ఎవరిదైనా మ్యాచ్‌లు బాగా ఆడడమే ముఖ్యం. ఈ వరల్డ్ కప్ మంచి కిక్ ఇస్తోంది. రోనాల్డో ఆట తీరంటే నాకు చాలా ఇష్టం. తనే నా ఫేవరెట్ ప్లేయర్.. - హితేష్ (గోల్ కీపర్) వచ్చేసారి ఇండియా క్వాలిఫై కావాలి వచ్చే వరల్డ్‌కప్‌లో ఇండియా క్వాలిఫై అవ్వాలనేదే మా కోరిక. సాకర్ మ్యాచ్‌లన్నీ చూస్తున్నా. మెస్సీకి అందరూ సహకరిస్తేనే గోల్ కొడుతున్నాడు. రోనాల్డో మాత్రం ఒంటరిగానే పోరాడుతున్నాడు. - అన్మోల్, ప్లేయర్ -
వారి స్వప్నమే వారిని ఛాంపియన్లను చేసింది!
మనసును అలరించే సుందర స్వప్నం ఒక్కోసారి మనలో స్ఫూర్తిని నింపుతుంది. అద్భుతాలు సాధించడానికి ఆరంభంగా నిలుస్తుంది. అసాధ్యం అనిపించే విషయాలను సుసాధ్యం చేసి చూపుతుంది. ఆ స్వప్నం వ్యక్తిది గాక సమూహానిదే అయితే రెట్టించిన ఉత్సాహం వస్తుంది. అలాంటి ఉరకలెత్తే ఉత్సాహంతో కొంతమంది టీనేజర్లు చేసిన ప్రయత్నానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఒక స్ఫూర్తిపాఠమై నిలిచింది. థాయ్‌లాండ్ దేశంలో ఒక పెద్ద సరస్సు మధ్యలో ఒక చిన్న ఊరు. దాన్ని దీవి అనలేం. ఎందుకంటే దాని విస్తీర్ణం చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే... ఆ ఊళ్లో పిల్లలు సైకిల్ తొక్కడానికి కూడా అవకాశం ఉండదు. ఉన్న స్థలంలో అంతా ఇళ్లు కట్టేశారు. చుట్టూరా నీళ్లు మాత్రమే ఉన్నాయి. మైదానం అనే మాట తెలియని ఆ ఊరి పిల్లలకు చుట్టూరా కనిపించే అపారమైన జలధిని దాటి ఒడ్డును చేరడమనేది అంత సులభమైన విషయం కాదు. అలాంటి నేపథ్యంలో ఆ ఊరిలో ఫుట్‌బాల్ ఫీవర్ మొదలైంది. 1986 ఫీఫా వరల్డ్ కప్ అక్కడి టీనేజర్లలో, చిన్నపిల్లల్లో సాకర్ పిచ్చిని ఇంజెక్ట్ చేసింది. ఇంకేముంది.. ఫుట్‌బాల్‌ను చూశారు కాబట్టి, వారిలో ఆడాలనే తహతహ మొదలైంది. అయితే ఆడటానికి ఉత్సాహం ఉన్నా ఊరిలో గ్రౌండ్ లేదు! ఈ విషయాన్ని అర్థం చేసుకొని కొన్నిరోజుల పాటు కలల్లోనే ఫుట్‌బాల్‌ను ఆడసాగారు అక్కడి యువకులు. క్రమంగా మైదానంలో ఫుట్‌బాల్ ఆడాలని, అటునుంచి అంతర్జాతీయస్థాయికి ఎదగాలనే పట్టుదల మొదలైంది. అంతేకాదు మైదానాన్ని ఏర్పాటు చేసుకొనే పట్టుదల కూడా ఉంది వారిలో! దాదాపు పాతిక మంది యువకులు... పడవలలో, కిలోమీటర్ల కొద్దీ దూరం ప్రయాణించి ‘చెక్క పలకల’ను తెచ్చుకొన్నారు. తమ నైపుణ్యంతో వాటి ద్వారా సరస్సు మధ్యలోని తమ ఊరిలో దాదాపు 50 మీటర్ల విస్తీర్ణం మేర ఒక గ్రౌండ్‌ను ఏర్పాటుచేసుకొన్నారు! చదువుసంధ్యలు పెద్దగా లేని ఆ తెగ యువకుల్లోని ఫుట్‌బాల్ ఫీవర్‌ను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ యువకులకుఉత్సాహమే కోచ్, ఉల్లాసమే స్ఫూర్తి, పట్టుదలే మైదానం... ఈ మూడింటి సహకారంతో ఉదయించినదే ‘పన్ ఈ’ ఫుట్‌బాల్ క్లబ్. బెస్ట్ ఫుట్‌బాల్ క్లబ్‌గా ఎదిగింది... ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని బెస్ట్ ఫుట్‌బాల్ క్లబ్‌లలో పన్ఈ ఒకటి. ఒక సరస్సు మధ్యలో ఏర్పాటుచేసుకొన్న మైదానంలో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన యువకులు అతి తక్కువ రోజుల్లోనే ఇతర జట్ల మీద సవాళ్లకు సిద్ధమయ్యారు. నది మధ్య నుంచి మైదానాల మధ్యకు వచ్చి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్నారు. విజయాలు సాధించారు. తమకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకొన్నారు. 1986లో గ్రౌండ్ నిర్మాణంలో పాలు పంచుకొన్న యువకులు... 2000 సంవత్సరం నుంచి థాయ్‌లాండ్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నారు. ఆ ఏడాది ట్రోిఫీని గెలిచారు. తర్వాత 2004, 2005, 2006, 2007, 2009... సంవత్సరాల్లో యూత్ ఛాంపియన్‌షిప్‌ల విషయంలో పన్ఈ క్లబ్ దే హవా! టీమ్ స్పిరిట్... వ్యక్తిగతంగా ఆ మైదానం నిర్మాణంలో ఎవరికీ క్రెడిట్ లేదు కానీ... పన్ ఈ ఫుట్‌బాల్ క్లబ్ మాత్రం అత్యంత స్ఫూర్తిమంతమైనదిగా పేరు తెచ్చుకొంది. వీరు సాధించిన విజయాల కన్నా వీరి విజయగాథకు మంచి గుర్తింపు ఉంది. వీరి సక్సెస్స్టోరీపై అనేక డాక్యుమెంటరీలు కూడా రూపొందాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పినట్టు... కలలు కనడమే కాదు... ఆ కలలను సాకారం చేసుకోవడం కూడా అవసరమే! -జీవన్‌రెడ్డి బి.