ఆరోజు... ఘోరాలు నేరాలు జరుగుతాయా?!
అవాస్తవం
నిండు చంద్రుడిని చూస్తూ కవిత్వం చెప్పేవారు కొందరైతే... నిలువెల్లా భయపడేవారు కొందరు. ఆకాశంలో నిండు చంద్రుడు కనిపించే రోజుల్లో అనేక అనర్థాలు జరుగుతాయని, పూర్ణ చంద్రుడు మనిషిలో చిత్ర విచిత్ర ప్రవర్తనకు కారణమవుతాడని, మానసిక సమస్యలతో బాధపడేవారికి ఆ తీవ్రత మరింత ఎక్కువవుతుందని, మనిషిలో దాగిన నేరప్రవృత్తి పెరిగిపోయి ఘోర నేరాలు జరుగుతాయని... ఇలా రకరకాల అపోహలున్నాయి.
పూర్ణ చంద్రుడిలోని శక్తి మనిషి మెదడులోని నీటిపై ప్రభావం చూపుతుందనే విషయం ప్రచారంలో ఉంది. మనిషి మానసిక ప్రవృత్తిలో వచ్చే మార్పులకు, నేరాలు ఘోరాలకు నిండు చంద్రుడికి ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో జరిగిన 23 స్టడీలపై కెనడియన్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఐ.డబ్ల్యూ. కెల్లీ బృందం సమీక్ష జరిపింది. రెండిటికీ మధ్య ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.