దేవుడున్నాడు!
భార్య: దేవుడున్నాడండీ.
భర్త: ఇపుడే ఎందుకు నమ్మాలనిపించింది?
భార్య: పెళ్లి రోజు కదా...
భర్త: అయితే..?
భార్య: ఒకరిపై ఒకరికి పీక పిసికేయాలన్నంత కోపం వచ్చినా పాతికేళ్లు కలిసి కాపురం చేశామంటే దేవుడి మహిమే కదండీ.
అల్లుడు
తండ్రి: ఏవమ్మా. అల్లుడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాని చెప్పాడు, నువ్వేమో పుట్టింటికొచ్చావు?
కూతురు: ఆ పువ్వులు కొనడానికి మీ దగ్గర డబ్బులు తీసుకురమ్మని పంపారు నాన్న.
దొంగ తెలివి
జడ్జి: నువ్వు దొంగతనం చేయలేదని బుకాయిస్తున్నావు, సీసీ కెమెరాలో రికార్డయ్యింది తెలుసా?
దొంగ: చూపించండి.
జడ్జి: (వీడియో చూశాక) వీడియో చూశావుగా ఇపుడేం చెప్తావో చెప్పు.
దొంగ: నా పెర్‌ఫామెన్స్ నచ్చితే దొంగ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కోర్టు నెంబరుకు ఎస్‌ఎంఎస్ చేయండి.
సంతోషం
భార్య: నేను చచ్చిపోతే ఏం చేస్తారు?
భర్త: నేను కూడా చచ్చిపోతానేమో.
భార్య: ఎంత ప్రేమండీ మీకు నా మీద.
భర్త: ఒక్కోసారి ఎక్కువ సంతోషం కూడా ప్రమాదమే కదా!
అతితెలివి
టీచర్: రవీ.. కుక్క గురించి వ్యాసం రాయమంటే రామూని చూసి కాపీ కొడతావా?
రవి: లేదు మేడమ్, ఇద్దరం ఒకే కుక్క గురించి రాశాం.!!
పోయే జబ్బే
పేషెంట్: రిపోర్టుల్లో ఏముంది డాక్టర్?
డాక్టర్: ఇది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు. ఆపరేషన్‌తో పోతుంది.
పేషెంట్: అయితే, మా తాతకు చేయండి డాక్టర్!
కవ్వింత:దేవుడున్నాడు!
Published Sat, Jul 12 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM
Advertisement
Advertisement