సమాజ పునర్నిర్మాణానికి ఏకైక మార్గం
పేజీలు: 150 వెల: 80
ప్రతులకు: 5-4-1413, శారదానగర్, వనస్థలిపురం,
హైదరాబాద్-70. ఫోన్: 9866681927
పుస్తకం : హేతువాదం - అపోహలు, అపార్థాలు
రచన : గుమ్మా వీరన్న
విషయం : సమాజం మూఢ విశ్వాసాల నుండి బయటపడి అభ్యుదయానికి అడ్డుగోడలు తొలగించుకోవాలంటే, హేతువాదంతో కూడిన భావ విప్లవమే శరణ్యం అంటారు గుమ్మా వీరన్న. ఈ వ్యాససంపుటిలో ఆధునిక విజ్ఞానం అందించే శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకుంటే మన సామాజిక సాంస్కృతిక జీవనంలో సరైన మార్పులు వస్తాయంటారు. సత్యాన్వేషణ శ్రమతో కూడినది. శాస్త్రీయమైన పరిశోధనల ద్వారానే దాన్ని పొందగలం. శ్రమలేని సుఖాన్ని అందించేది విశ్వాసం. అందుకే ఏ శ్రమ లేకుండా దేవుణ్ని నమ్ముతుంటాం. అజ్ఞానంలో సుఖాన్ని వెతుక్కుంటుంటాం. జ్ఞానమనేది భౌతిక వాస్తవికత మీద ఆధారపడి మాత్రమే లభ్యమవుతుంది. నూతన సత్యాలు సైన్స్ ద్వారానే వెలుగు చూస్తాయి, మూఢ భక్తి వలన కాదు అని చెబుతారు. వాస్తవిక సత్యాన్ని గ్రహించినట్లయితే, సుఖశాంతులతో సమాజాన్ని ముందుకు తీసుకుపోవచ్చునంటారు.
- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
జిడ్డు కృష్ణమూర్తితో అనుభవాలు
పేజీలు: 258 వెల: 150
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ,
హైదరాబాద్-27. ఫోన్:040- 24652337
పుస్తకం : జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా?
జానర్ : నాన్ ఫిక్షన్/అనుభవాలు
రచన : నీలంరాజు లక్ష్మీప్రసాద్
విషయం : ‘ఆధ్యాత్మిక రంగంలో ఒకరి ఆధిపత్యం, అధికారం, పెత్తనం పనికిరావు. ప్రతిమనిషీ తనకుతానే గురువుగానూ, శిష్యుడిగానూ రూపొందాలి’ అని ప్రకటించిన ఆధ్యాత్మిక విప్లవకారుడు జిడ్డు కృష్ణమూర్తి. ఆయన భావనలు చాలా పుస్తకాలుగా వ్యాప్తిలో ఉన్నాయి. ఈ పుస్తక లక్ష్యమూ అదే! అయితే, దీని భిన్నత్వం ఏమిటంటే, సీనియర్ రచయిత లక్ష్మీప్రసాద్ 1980 ప్రాంతంలో కృష్ణమూర్తిని చేసిన ఇంటర్వ్యూలు, అప్పటి అనుభవాలను కూడా మేళవించడం!
‘నా జీవితంలో జిడ్డు కృష్ణమూర్తిగారు తటస్థపడటం గొప్ప అదృష్టం’ అంటారు రచయిత. ఆ అదృష్టాన్ని ఇలా పుస్తకంగా పంచుకున్నారు. ‘మన సాధారణ చైతన్యం ఆవలనున్న ఏ మహా కరుణను వీరు దర్శించారో’ అంటూ ఇటీవలి వరకు రాసిన వ్యాసాలను కూడా జతపరిచారు. ‘కృ’ తత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ సులభంగా అర్థం చేయించే పుస్తకం!
మరొక కొత్త నిఘంటువు
పుస్తకం : విజేతకాంపిటీషన్స్ ‘ఇంగ్లీష్- తెలుగు నిఘంటువు’
సంపాదకత్వం : డా.ఎ.వి.పద్మాకరరెడ్డి
విషయం : నిరంతర పరిణామం సమాజ లక్షణం. అదే భాషకూ వర్తిస్తుంది. తదనుగుణంగా కొత్త పదజాలం పుడుతుంది. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా నిఘంటువును సరిచేసుకోవాల్సిన అవసరమూ పడుతుంది. అయితే, ‘బండ్ల పబ్లికేషన్స్’ సాయిబాబు ఏకంగా కొత్త నిఘంటువునే నిర్మించ తలపెట్టారు. నిఘంటు నిర్మాణమంటే, ‘మహాయజ్ఞం’. ‘బ్రహ్మ ప్రళయమైన పని’. ‘పుష్కర కాల శ్రమ’. ప్రపంచంలో కరడుగట్టిన నేరస్తునికి విధించాల్సిన సరైన శిక్ష ఏమిటంటే, ఏదైనా నిఘంటువును సంకలనం చేయమని ఆదేశించడమట! అలా నైఘంటికుడు పద్మాకరరెడ్డి తన భాషా ప్రేమకు తగిన శిక్ష అనుభవించారు. ఇటీవలే కన్నుమూసిన సొదుం రామ్మోహన్ కూడా సహసంపాదకుడిగా ఆ శిక్షను పంచుకున్నారు. డీటీపీ చేసిన రాఘవస్వామి సరేసరి! అలా ‘లక్షకు పైగా ఆరోపాలతో’ కూడిన ఈ సరికొత్త ఆంగ్ల-తెలుగు డిక్షనరీ భాషాప్రేమికులకు అందుబాటులోకి వచ్చింది.
కొత్త పుస్తకాలు
నేలపై నిండు చంద్రుడు (మహమ్మద్ ప్రవక్త జీవన దృశ్యాలు)
రచన: మర్దిజా ఆల్డ్‌రిచ్ టారింటినో
తెలుగు: బా మేరాజ్
పేజీలు: 116; వెల: 40
ప్రతులకు: శాంతిమార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, 16-2-867/10, అక్బర్‌బాగ్, సయీదాబాద్, హైదరాబాద్-59. ఫోన్: 9676144697
మిఠాయిపొట్లం (పొడుపు కథలు)
రచన: కందేపి రాణీప్రసాద్
పేజీలు: 112; వెల: 50
ప్రతులకు: స్వాప్నిక్ పబ్లికేషన్స్, సృజన్ చిల్డ్రెన్ హాస్పిటల్, సిరిసిల్లా, కరీంనగర్.
ఫోన్: 08723-233514
ముద్రలు, బంధాలు (ఆనందానికి, ఆరోగ్యానికి సాధనలు)
రచన: ధరణీప్రగడ ప్రకాశరావు
పేజీలు: 304(హార్డ్‌బౌండ్); వెల: 300
ప్రతులకు: రచయిత, 7-1-309/76, బి.కె.గూడ, సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్-38.
ఫోన్: 9849066765
1.భారతీయ మహిళా పారిశ్రామికవేత్తలు
పేజీలు: 400; వెల: 225
2.అపురూపమైన తండ్రీకూతుళ్ల అనుబంధం
పేజీలు: 400; వెల: 225
రచన: శ్రీవాసవ్య
ప్రతులకు: కృష్ణవేణి పబ్లికేషన్స్, 27-20-46, మ్యూజియం రోడ్, విజయవాడ-2. ఫోన్: 0866-2576864
ఖండిత స్వప్నాలు (కవిత్వం)
రచన: డా. కొండెపోగు బి.డేవిడ్ లివింగ్‌స్టన్
పేజీలు: 152; వెల: 100
ప్రతులకు: రచయిత, రాజగృహ, తర్లుపాడు రోడ్, మార్కాపురం, ప్రకాశం-523316.
ప్రతులకు: బండ్ల పబ్లికేషన్స్, 2-2-1130/24/1/డి/1, ఇండియన్ బ్యాంక్ వెనుక, శివం రోడ్డు, న్యూ నల్లకుంట, హైదరాబాద్-44. ఫోన్: 040-27673494
సమీక్షణం: పుస్తక సమీక్షణం
Published Sun, Nov 10 2013 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
Advertisement
Advertisement