కృష్ణాతీర పుష్కరఘాట్లు | ghats in krishna river in telugu states | Sakshi
Sakshi News home page

కృష్ణాతీర పుష్కరఘాట్లు

Published Sun, Aug 7 2016 9:20 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

ghats in krishna river in telugu states

కృష్ణాజిల్లాలో...
జిల్లాలో మొత్తం 74 స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో 6 ఘాట్లు, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 68 ఘాట్లు ఉన్నాయి. వీటిని నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఒక లక్ష పైబడిన సంఖ్యలో పుష్కర యాత్రికులు పవిత్రస్నానం ఆచరించే స్నానఘట్టాలను ఏ- ప్లస్ కేటగిరీలో ఉంచారు.  భవాని, పున్నమి, దుర్గ్గ, కృష్ణవేణి, పద్మావతి, ఇబ్రహీంపట్నం మండలంలో పవిత్రసంగమం, ఫెర్రీ ఘాట్లు ఏ-ప్లస్ కేటగిరీలోకి వస్తాయి.


జగ్గయ్యపేట మండలం ముక్త్యాల, పవిత్రసంగమం ఫెర్రీ ఘాట్లు, ఏ కేటగిరీలోకి వస్తాయి. వీటిలో 50 వేల నుంచి లక్షమంది లోపు స్నానం ఆచరిస్తారు. జగ్గయ్యపేట మండలంలో గుడిమెట్ల ఘాట్ - 1, గుడిమెట్ల ఘాట్ - 2, మోపిదేవి మండలం పెద్ద కళ్లేపల్లి ఘాట్, కోడూరు మండలం హంసలదీవి ఘాట్లను బి-కేటగిరీ ఘాట్లుగా నిర్ధారించారు. వీటిలో 10 వేల నుంచి 50 వేల మంది స్నానం ఆచరిస్తారు. మిగిలిన 39 ఘాట్లు సి- కేటగిరీ. వీటిలో 10వేల కంటే తక్కువ మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. 21 ఘాట్లను, వెయ్యి మంది లోపు స్నానాలు ఆచరించేవిగా, స్థానిక ఘాట్లుగా గుర్తించారు.
 
నగరంలో ఇలా...
విజయవాడ నగరంలో ప్రకాశం బ్యారేజీ ఎగువన 3 ఘాట్లు, దిగువన  2 ఘాట్లుగా విభజించారు.
పద్మావతి ఘాట్: పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ముందు నుంచి రైల్వే బ్రిడ్జి వరకు 11 కి.మీ. మేర విస్తరించి ఉంది.
కృష్ణవేణి ఘాట్: రైల్వే బ్రిడ్జి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు 750 మీటర్ల మేర విస్తరించింది. ఈ రెండు ఘాట్లకు ప్రకాశం బ్యారేజ్ నుంచి, స్లూయిస్ నుంచి 10 మీటర్ల వెడల్పున తవ్విన ప్రత్యేక కాలువ ద్వారా బ్యారేజీ నుంచి నిరంతరం నాలుగు అడుగుల లోతున పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం ఇక్కడ జల్లు స్నానం (షవర్‌బాత్) ఏర్పాట్లు కూడా చేశారు.
 
ప్రకాశం బ్యారేజి  ఎగువన...
దుర్గాఘాట్: ప్రకాశం బ్యారేజీ నుంచి కనకదుర్గ అమ్మవారి గాలిగోపురం వరకు 160 మీటర్ల మేర విస్తరించి ఉన్న ఘాటును 325 మీటర్ల పొడవుకు విస్తరించారు. ఘాట్ వద్ద ప్రత్యేకంగా అభివృద్ధి పరచిన మోడల్ గెస్ట్‌హౌస్‌లో కమాండెంట్, కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తారు. 16 వందల సీసీ కెమెరాల సహాయంతో అన్ని జిల్లాలలోని పుష్కర ఘాట్లలో ప్రతిక్షణం జరుగుతున్న దృశ్యాల్ని కంట్రోల్‌రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు.
పున్నమి ఘాట్: ‘విజయ డైరీ ఇన్‌టేక్‌వెల్’ నుంచి ‘పున్నమి రెస్టారెంట్’ గోడ వరకు 400 మీటర్ల మేర విస్తరించి ఉంది ఈ ఘాటు.
భవానీ ఘాట్: పున్నమి రెస్టారెంట్ గోడ నుంచి గొల్లపూడి వరకు భవానీఘాట్ వద్ద 1.1 కి.మీ. మేర నదికి అభిముఖంగా తీరప్రాంతాన్ని రూపుదిద్దుతున్నారు.
రెండు కొత్త ఘాట్లు
పవిత్రసంగమం ఘాట్:  పోలవరం కుడి ప్రధాన కాల్వ నుంచి గోదావరి నీటిని కృష్ణమ్మకు కలిపే బుడమేరు డైవర్షన్ కెనాల్ దగ్గర కొత్తగా 250 మీటర్ల పొడవైన ఘాట్ నిర్మిస్తున్నారు.
ఫెర్రీ ఘాట్: హారతి పెవిలియన్ దాటిన తర్వాత 750 మీటర్ల పొడవైన ఫెర్రీఘాట్ నిర్మాణం జరుగుతోంది.
 - నండూరి శారంగపాణి, విజయవాడ
 
 నల్లగొండ జిల్లాలో...
జిల్లాలో ముఖ్యమైన పుష్కర ఘాట్లు ఇవి...
 1. కాచరాజుపల్లి (చందంపేట మండలం)
 2. పెదమునిగల్ (చందంపేట) 3. అజ్మాపూర్ (పీయేపల్లి మండలం) 4. శివాలయం (పెదవూర) 5. ఆంజనేయస్వామి (నాగార్జునసాగర్) 6. పొట్టిచెలమ (నాగార్జునసాగర్)
7. ఊట్లపల్లి (పెదవూర) 8. కిష్టాపురం (మేళ్లచెరువు)
9. వజినేపల్లి (మేళ్లచెరువు) 10. బుగ్గమాదారం (మేళ్లచెరువు)
11. మహంకాళిగూడెం (నేరేడుచర్ల) 12. ప్రహ్లాద (మఠంపల్లి)
13. మార్కండేయ (మఠంపల్లి) 14. బాలాజీఘాట్ (మఠంపల్లి)
15. శివాలయం, వాడపల్లి (దామరచర్ల) 16. లక్ష్మీనర్సింహ (వాడపల్లి)
17. లక్ష్మీపురం (వాడపల్లి) 18. మెట్లరేవు (వాడపల్లి) 19. ఓల్డ్ పీఎస్ (వాడపల్లి) 20. ముదిరాజ్ (వాడపల్లి) 21. ఓల్డ్ సిమెంట్ (వాడపల్లి) 22. అయ్యప్ప(వాడపల్లి) 23. ముదిమాణిక్యం (వాడపల్లి) 24. అడవిదేవులపల్లి (వాడపల్లి) 25. ఇర్కిగూడెం (వాడపల్లి) 26. దర్వేశిపురం (కనగల్) 27. కనగల్ వాగు (కనగల్) 28. ఛాయాసోమేశ్వర ఆలయం (నల్లగొండ)
 
మహబూబ్‌నగర్ జిల్లాలో...
1. తంగెడి 2. కృష్ణ 3. గుడబెల్లూర్ 4. మూడుమళ్ల
5. పసుపుల 6. పంచదేవుపాడు 7. పారేవుల
8. ముసలపల్లి 9. అనుకొండ 10. గడ్డెంపల్లి
11. నెట్టెంపాడు 12. ఉప్పేరు 13. నందిమల్ల
14. మూలమల్ల 15. రేవులపల్లి 16. పెద్దచింతరేవుల
17. రేకులపల్లి 18. జూరాల 19. నదీ అగ్రహారం 20. ఆరేపల్లి
21. కత్తేపల్లి 22. తెలుగోనిపల్లి 23. జమ్మిచేడు 24. బీరెల్లి
25. రాంపురం 26. బీచుపల్లి 27. రంగాపురం 28. మునగమూన్ దిన్నె 29. బూడిదపాడు 30. తిప్పాయిపల్లి 31. గుమ్మడం
32. యాపర్ల 33. మారుమునగల 34. బెక్కెం 35. గూడెం
36. పెద్దమారూరు 37. క్యాతూర్ 38. వెల్టూరు 39. గొందిమళ్ల 40. కాలూరు 41. చర్లపాడు 42. అయ్యవారిపల్లి
43. కొప్పునూరు 44. జటప్రోలు 45. మంచాలకట్ట
46. మల్లేశ్వరం 47. సోమశిల (వీఐపీ) 48. సోమశిల (జనరల్) 49. అమరగిరి 50. బక్కలింగాయపల్లి 51. పాతాళగంగ
 
బ్రహ్మాండ పురాణం, శివపురాణం, స్కాందపురాణం, మత్స్య, కూర్మ, బ్రహ్మ, వామన, వాయు, నారద, వరాహ పురాణాలలో కృష్ణానది ప్రస్తావన కనిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement