వర్ణం: జుట్టున్నమ్మ... | interesting things | Sakshi
Sakshi News home page

వర్ణం: జుట్టున్నమ్మ...

Published Sun, Mar 9 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

వర్ణం: జుట్టున్నమ్మ...

వర్ణం: జుట్టున్నమ్మ...

జుట్టుతో ఆకట్టుకుంటున్న ఈ యువతి ఐవరీ కోస్ట్ దేశంలోని ‘నాపీ డీ బాబి’ క్లబ్ మెంబర్. ఇలాంటి జుట్టు (ఫ్రిజీ హెయిర్) ఉన్న వారంతా ఆ క్లబ్‌లో మెంబర్లు. అబిజాన్ నగరం కేంద్రంగా నడుస్తున్న ఈ క్లబ్‌లో 2400 సభ్యులున్నారట. ఇలా జట్టు పెంచుకోవడం ఎలా? పెంచిన దాన్ని ఎలా కాపాడుకోవాలి? దాన్ని ఎన్నిరకాలుగా తీర్చిదిద్దుకోవచ్చు? అనే విషయాలన్నీ వీరు సెమినార్లు పెట్టి మరీ ఫ్రీగా చెబుతున్నారట.


 
 ఖరీదైన గది
 ఇది ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ సొంత ఇంటిలోని డైనింగ్ హాలు. ఈయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలు పణంగా పెట్టి ఇదిగో ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నారు. తొలుత ప్రభుత్వ భవనంగా ఉన్న దీనిని ఆయన ప్రైవేటు ప్రాపర్టీగా మార్చుకున్నాడు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇంటీరియర్‌తో ఈ ఇంటిని తీర్చిదిద్దారు. ఈయన మీద విదేశీ నిధుల దుర్వినియోగం, ఆందోళనకారుల ఊచకోత వంటి కేసులున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న షాండ్లియర్ విలువే కోట్ల రూపాయలలో ఉంటుంది.
 
 ఎన్ని పాండాలో...
 చైనాలోని తైపే నగరంలోని ఓ విచిత్రమైన ప్రదర్శన ఏర్పాటుచేశారు. దానిపేరు ‘పాండాస్ ఆన్ టూర్’. ఇందులో పేపరుతో చేసిన వేలాది పాండాలు రక రకాల ఫోజుల్లో కనిపించి అలరిస్తున్నాయి. నేషనల్ థియేటర్ లో ఓ ప్రదర్శన తిలకిస్తున్నట్లు కూర్చున్న పాండాలివి. సుమారు ఇక్కడ 1600 పండాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement