
నీరోగారి కళా‘పోషణ’
రోమ్ నగరం తగలబడుతుంటే, ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడని నీరో చక్రవర్తిపై జగమెరిగిన అపప్రథ. నీరోగారికి సంగీత జ్ఞానం ఏమాత్రం ఉండేదో ఎవరికీ తెలియదు గానీ, ఆయన సంగీత కళా‘పోషణ’ మాత్రం అనితరసాధ్యమైన రీతిలో ఉండేది. నిజానికి నీరో లైర్ వాయించే వాడు, ఫిడేల్ కాదు. లైర్ ఒక ప్రాచీన తంత్రీ వాద్యం.
కచేరీల కోసం చాలా ప్రాంతాల్లో పర్యటనలు చేసే నీరో చక్రవర్తి, కేవలం తన సంగీతాన్ని శ్లాఘించడం కోసమే ఐదువేల మంది సైనికులను నియమించుకున్నాడు. వారి పనంతా నీరోగారి వెంట ఆయన చేసే కచేరీలకు వెళ్లడం, ఆయన లైర్ వాదన ఎలా ఉన్నా ఆహో.. ఓహో.. భళి భళీ.. అని మెచ్చుకోవడమే.