కవ్వింత: దేవుడే దిగివచ్చినా... | The god may come down by impress of devotee | Sakshi
Sakshi News home page

కవ్వింత: దేవుడే దిగివచ్చినా...

Published Sun, Jul 6 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

కవ్వింత: దేవుడే దిగివచ్చినా...

కవ్వింత: దేవుడే దిగివచ్చినా...

కూతురు: అమ్మా... మా సంగీతం మాష్టారుకు మహా దైవ భక్తి.
తల్లి: నీ కెలా తెలుసే...
కూతురు: నేను పాట పాడుతున్నప్పుడల్లా ఓరి భగవంతుడా అంటున్నాడే అమ్మా.
 
 బంగారం లాంటి నిద్ర
 భార్య: మావారు రాత్రంతా మెలకువగా ఉంటున్నారండీ. ఎప్పుడు చూసినా నా వంకే చూస్తున్నాడు. మీరే చికిత్స చేయాలి.
 డాక్టరు: ఏమక్కర్లేదు... మీ ఒంటి మీద బంగారమంతా లాకర్లో పెట్టండి. హాయిగా నిద్రపోతాడు.
 
 అప్ప 1 అప్ప 2
 వెంగళప్ప 1: ఒరేయ్.. నాకు నాన్‌వెజ్ తినాలని ఉందిరా.
 వెంగళప్ప 2: దాందేముందీ ఫిష్ కర్రీ తిందాం.
 వెంగళప్ప 1: ఫిష్ వద్దురా... ముళ్లుంటాయి.
 వెంగళప్ప 2: ఓస్ దానికేనా... చెప్పులేసుకుని తిందాంలేరా.
 
 రాని పని
 విద్యార్థి: ఈసారైనా నేను పరీక్షల్లో పాసవుతానా?
 జ్యోతిష్యుడు: తప్పకుండా. కానీ ఒక పని చెయ్యాలి.
 విద్యార్థి: ఏం పని స్వామీ?
 జ్యోతిష్యుడు: ఓ రెండ్రోజులైనా చదవాలి.
  - ఆకుల జ్యోతి, మిట్టకందాల, కర్నూలు జిల్లా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement